Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. మాలిని మనుషులమే-దిమ్మతిరిగే షాకిచ్చిన కార్తీక్-చచ్చిపోతానన్న జ్యోత్స్న
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 22 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఎవరెన్ని చెప్పినా జ్యోత్స్న మాత్రం పీఏగా చేస్తానంటుంది. లేదంటే చచ్చిపోతానంటుంది. తాము మాలిని మనుషులపై అని కార్తీక్ షాకిస్తాడు. పని చేయడం రాదని జ్యో ముఖంపై సూరజ్ పేపర్లు విసురుతాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఆఫీసుకు వెళ్తున్న జ్యోత్స్నను కార్తీక్ ఆపుతాడు. అత్తయ్య, మామయ్య మీరు మాకో బాధ్యత ఇచ్చారు. జ్యోత్స్నను ఆఫీస్ వెళ్లకుండా ఆపితే మా నిజాయతీని గుర్తిస్తామన్నారు. ఆ బాధ్యత మేం తీసుకోవాలనుకోవడం లేదని కార్తీక్ షాకిస్తాడు.

షాకిచ్చిన కార్తీక్
మీరు మమ్మల్ని బ్లేమ్ చేసిన పర్వాలేదు. నేను, దీప ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. జ్యోత్స్నకు ఓ జీవితం, ఆశయం ఉన్నాయి. మా స్వార్థం కోసం ఒకరిని ఆపే హక్కు మాకు ఎక్కడ ఉంది. సూరజ్ దగ్గర జ్యోత్స్న పీఏగా చేయాలనుకుంటే చేస్తుంది, లేదంటే లేదని కార్తీక్ అంటాడు.
మాలిని మనుషులు
శభాష్, మీరు మాలిని మనుషులని మళ్లీ ప్రూవ్ చేసుకున్నారని శివ నారాయణ వెటకారంగా చప్పట్లు కొడతాడు. జ్యోత్స్నకు జాబ్ రావడానికి మా నాన్న కారణమని తెలుసు. కానీ ఆయనతో ఆ పని చేయించింది మీరేనని మాకు అర్థమవుతుందని సుమిత్ర అంటుంది. అప్పుడే మీపై అన్ని నిందలు వేస్తుంటే మాట్లాడవేంట్రా అని కార్తీక్ ను తల్లి కాంచన అడుగుతుంది.
అవన్నీ నిందలు కాదు నిజాలు. అవును, మేం మాలిని మనుషులమే. అన్నింటికీ మేమే కారణమని కార్తీక్ చెప్పడంతో ఫ్యూజులు ఔట్ అవుతాయి. మీరు స్వార్థపరులు అని నిరూపించుకుంటున్నారు. సూరజ్ ఇంటికి వచ్చి మరీ జ్యోత్స్నను వద్దన్నాడు. జ్యోత్స్న ఈ తాత మీద గౌరవం ఉంటే జాబ్ కు వెళ్లకుండా ఆగిపో అని జ్యోను శివ నారాయణ అడుగుతాడు. సుమిత్ర, దశరథ కూడా ఎంత చెప్పినా జ్యోత్స్న వినదు.
నా బావ చెట్టులా
నా బావ కార్తీక్ ను చూసి ఎలా బతకాలో నేర్చుకున్నా. ఎంత పెద్ద కష్టం వచ్చినా చెట్టులా నిలబడతాడు. మీరు అపార్థం చేసుకున్నంతకాలం మీకు నిందితుడిగానే కనిపిస్తాడని జ్యోత్స్న అంటుంది. మీ బావ దేవుడే. మేం గల్లాపెట్టె దగ్గర నిలబడి చిల్లెర లెక్క పెట్టుకుంటున్నానంటే అందుకు కారణం మీ బావనే అని శివ నారాయణ అంటాడు.
నేను చచ్చిపోయినా సరే కానీ మాట వినని కూతురికి తల్లిగా ఉండలేనని సుమిత్ర కఠినంగా మాట్లాడుతుంది. అంటే ఓడిపోయిన కూతురికి తల్లిగా ఉంటావా? నువ్వు పెంచిన కూతురు చేతగానిది కాదు మమ్మీ అని జ్యో షాక్ ఇస్తుంది. నేను కన్న కూతురివి నువ్వు అని సుమిత్ర అంటుంది. నువ్వు ఆ ఆఫీసుకు వెళ్తే నా ప్రాణం పోయినట్లేనని సుమిత్ర షాక్ ఇస్తుంది.
చావనిస్తారా?
నన్ను ఆపితే నేను చచ్చినంత ఒట్టే. నేను మొండిదాన్ని. నా సంగతి నాకంటే బాగా నీకే తెలుసు. చేయి వదిలేస్తావా లేదా నేను అనుకున్నది చేసి చూపెట్టమంటావా? నన్ను వెళ్లనివ్వండి లేదా చావనివ్వండని జ్యోత్స్న అడుగుతుంది. జ్యో మూడు అంకెల లెక్కపెట్టేసరికి తన చేయి వదిలేయమని దశరథ చెప్పాడు. జ్యోత్స్నను ఎగరనిద్దామని దశరథ అంటాడు.
నా కూతురు లూజర్ కాదు ఫైటర్ అని దశరథ అనగానే జ్యో వెళ్లి నాన్నను హగ్ చేసుకుంటుంది. ఎమోషనల్ అవుతూ జ్యో బయటకు వెళ్లిపోతుంది.
సూరజ్, మాలిని షాక్
ఇటు ఆఫీసులో దక్షిణామూర్తి ఏమో జ్యోత్స్న కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతుంటాడు. దక్షిణామూర్తిని ఆఫీసులో చూసి మాలిని, సూరజ్ షాక్ అవుతారు. జ్యోత్స్న రాదని సూరజ్, మాలిని అంటారు. రాకపోతే సుమిత్ర కూతురే కాదని వస్తున్న జ్యోత్స్నను దక్షిణామూర్తి చూపిస్తాడు. జ్యోను చూసి సూరజ్, మాలిని కంగుతింటారు.
పులి పిల్లవి
ఎందుకు వచ్చావని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. తప్పులు చేసిన వాళ్లే ఆఫీసుకు వస్తుంటే, నేను ఎందుకు రాకూడదు. సంకల్పం బలంగా ఉంటే చావు కూడా ఆపలేదు. జింకపిల్ల పులిబోనులో అడుగుపెట్టిందని అనుకుంటున్నావా? అని సూరజ్ ను జ్యో అడుగుతుంది.
నువ్వు పులి పిల్లవి. కానీ మా అమ్మకు నువ్వు ఆఫీసుకు రావని తీసుకొచ్చా. అయితే మళ్లీ ప్రాబ్లెం తీసుకోవచ్చావని సూరజ్ ఫైర్ అవుతాడు. జ్యోత్స్న మాత్రం తన ఆఫీసులో వర్క్ బిజీలో పడిపోతుంది.
దీప నిజం చెప్పి ఉంటే
మరోవైపు దశరథ తో కార్తీక్, దీప మాట్లాడతారు. జ్యోత్స్న పెళ్లిలో దీప నిజం చెప్పి ఉంటే ఈ కథ పెళ్లి దగ్గరే ఆగిపోయేది. ఇప్పుడు జ్యోత్స్న కష్టపడటానికి కారణం దీప కాదా? జ్యో నాకు ఓ నమ్మకాన్ని కలిగించిందని దశరథ అంటాడు. నీ కన్నకూతురే కాదు పెంచిన కూతురు కూడా తప్పు చేయదు మామయ్య అని దశరథకు కార్తీక్ చెప్తాడు.
జ్యోత్స్న రెడీ చేసిన షెడ్యూల్ ప్లాన్ చేసి సూరజ్ కోప్పడతాడు. అందరి ముందు గట్టిగా అరుస్తాడు. అసలు షెడ్యూల్ అంటే ఏంటో తెలుసా? రికమండేషన్ తో వచ్చేస్తారని జ్యోను అవమానించేలా సూరజ్ మాట్లాడతాడు. ట్రాఫిక్ లో ఎలా వెళ్తామని పేపర్స్ ను జ్యోత్స్న ముఖం మీదే సూరజ్ విసిరేస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


