Karthika Deepam 2 Today Episode:కార్తీక దీపం 2-ఏడిపించిన దీప, జ్యోత్స్న-సూర‌జ్‌కు జ్యో కౌంట‌ర్‌-మాలిని కుట్ర‌తో దీప షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 2 ఎపిసోడ్ లో జ్యోత్స్న, దీప మధ్య ఎమోషనల్ సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఇక టిఫిన్ బండి దగ్గర గిన్నెలు కడగొద్దని జ్యోత్స్నకు సూరజ్ చెప్తాడు. కానీ జ్యో వినదు. మరోవైపు ఫుడ్ ఆర్డర్ కోసం నాసిరకం సరుకులు వాడటం చూసి దీప షాక్ అవుతుంది.

Published on: Nov 2, 2026, 07:12:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన పెళ్లి గురించి సుమిత్ర ఏడుస్తూ అన్న మాటలను చూసి జ్యోత్స్న బాధపడుతుంది. జ్యోత్స్న దగ్గరకు వచ్చి దీప ఓదార్చుతుంది. అంతా చూశాను జ్యోత్స్న అని దీప చెప్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఫీల్ అయిన దీప

నువ్వేం చూడకపోయినా నేను నీ దగ్గర అబద్ధం చెప్పను దీప. నా గురించి తెలిసింది నీకు, బావకే. సుమిత్ర, దశరథల సొంత కూతురివి నువ్వు. సొంత కూతురిలా పెరిగిన దాసు కూతురిని నేను. నన్ను సొంత కూతురు అనుకొని ఇలా ఆలోచిస్తున్నారని జ్యోత్స్న అంటుంది. సొంత కూతురు కాకపోయినా ఇలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు నాకు, నీకు తేడా లేదని దీప ఫీల్ అవుతుంది.

జ్యోత్స్న చచ్చిపోయింది

అమ్మానాన్న ప్రేమను అందుకొనే అర్హత నాకు లేదు. నా స్వార్థం కోసమే పెరిగా. ఎన్నో దారుణాలు చేశా. ఓ క్రిమినల్ గా బతికానని జ్యోత్స్న అంటుంది. ఆ జ్యోత్స్న ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు ఉన్న జ్యోత్స్న కుటుంబం కోసం నిలబడుతుంది. తల్లిదండ్రుల కష్టం చూడలేకపోతుందని దీప చెప్తుంది. కానీ నువ్వు ఆఫీసుకు రావడం అమ్మానాన్నకు ఇష్టం లేదు. నువ్వు కష్టపడటం నువ్వు చూడలేకపోతున్నారు. మానేయొచ్చు కదా అని దీప అడుగుతుంది.

జ్యోను హత్తుకున్న దీప

అంత ప్రేమ చూపించే అమ్మానాన్న రుణం ఎలా తీరుతుంది? ఇది నేను తీరుస్తున్న రుణం అనుకో దీప. వాళ్లను కష్టాల్లో వదిలేసి నేను సుఖం చూసుకోలేనని జ్యోత్స్న అంటుంది. ఆ మాటలు వినగానే జ్యోత్స్నను ఆప్యాయంగా దీప హత్తుకుంటుంది. మనం ఇలాగే ఉండాలి జ్యోత్స్న అని దీప అంటుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కార్తీక్ చప్పట్లు కొడతాడు. ఎప్పటికీ ఇలాగే ఉండాలంటాడు.

జస్ట్ రెడ్ సింబల్

ఉదయం బయట సూరజ్ ను కలిసి జ్యోత్స్న మాట్లాడుతుంది. నైట్ నీ మొబైల్ కు కొన్ని ఫొటోలు షేర్ చేశా. దానికి రిప్లే ఏమిచ్చావని సూరజ్ అడుగుతాడు. తన మొబైల్ లో తీసుకున్న స్క్రీన్ షాట్ ను చూపిస్తాడు. జస్ట్ రెడ్ సింబల్ ఉందని జ్యోత్స్న అంటుంది. దీన్ని లవ్ సింబల్ అంటారని సూరజ్ అంటాడు. ప్రేమ గురించి తెలిసిన వాళ్లకే అది లవ్ సింబల్. ఆ సింబల్ ను శౌర్య పంపించిందని జ్యోత్స్న చెప్తుంది.

మర్చిపోలేనంత ప్రేమ

నేను డిలీట్ చేయబోయే చిన్న గ్యాప్ లోనే ఆ స్క్రీన్ షాట్ ఎందుకు తీశావ్? నేనంటే మర్చిపోలేనంత ప్రేమ అనుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. కానీ సూరజ్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఇద్దరం కలిసి హాస్పిటల్ కు వెళ్దామని జ్యో కౌంటర్ వేస్తుంది. నీకు ఏం కావాలి? ఆఫీసులో పీఏగా చేస్తున్నావ్ కదా. టిఫిన్ బండి దగ్గర ప్లేట్స్ ఎందుకు కడుగుతున్నావ్? అలా చేయొద్దని సూరజ్ చెప్తాడు.

సూరజ్ కు నచ్చలేదు

నా గిన్నెలు నా ఇష్టం. అవసరమైతే టిఫిన్ బండి దగ్గర చెత్త కూడా ఊడుస్తానని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. నీ ఫొటోలను తాతకు నేను చూపించా. అది చూసి నన్ను తింటారు. తన మనవరాలు అలా ప్లేట్లు కడగడానికి కారణం నేనేనని తిట్టారు. ఇదే నీ స్ట్రాటజీ. ఏదో ఒక పని చేసి తాతతో తిట్టించాలని చూస్తున్నావ్. మా తాతకు నచ్చలేదు. ఆయన బాధపడుతున్నాడని సూరజ్ చెప్తాడు. నాకు నచ్చలేదు జ్యోత్స్న, బాధపడ్డానని చెప్పు మానేస్తానని జ్యో సూటిగా అడుగుతుంది.

దీంతో నీకు నచ్చినట్లే చేసుకో అని సూరజ్ అంటాడు. ఇదేనా చెప్పాల్సింది? నాకు ఆఫీసుకు లేట్ అవుతుంది. అసలే నాకు ఓ తిక్కలోడు బాస్ గా ఉన్నాడని సూరజ్ తో జ్యోత్స్న ఆటాడుకుంటుంది.

దీప షాక్

మరోవైపు క్యాటరింగ్ ఆర్డర్ కోసం వంట జరుగుతుంది. అక్కడి వంట సామాన్ల క్వాలిటీ చూసి దీప షాక్ అవుతుంది. దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? అసలు ఏంటీ అవి? బిర్యానీకి వాడే బియ్యం ఇవేనా? అసలు ఇవి జ్యోత్స్న రెస్టారెంట్ క్వాలిటీనే కాదని దీప అరుస్తుంది. నేను చూడగానే అలాగే అనుకున్నా. కానీ మీరే పంపించారని తెలిసి వంటలు చేస్తున్నా. అన్నీ అయిపోవచ్చాయని చెఫ్ మూర్తి చెప్తాడు.

వంట ఆపొద్దన్న సూరజ్

వెంటనే ఆపేయాలని దీప అరుస్తుంది. అప్పుడే సూరజ్ వచ్చి ఎందుకు ఆపాలని అడుగుతాడు. ఇలాంటి నాసిరకం పదార్థాలతో వంట చేస్తే బ్రాండ్ పేరు పోతుంది. ఇవన్నీ ముందే చూసుకోవాలి సీఈఓ గారు. ఇప్పుడు వంట ఆపకండని సూరజ్ చెప్తాడు. కానీ దీప వినదు. ఇది స్పెషల్ ఆర్డర్. అన్నీ నాణ్యతగా ఉండాలని దీప ఆర్గ్యూ చేస్తుంది.

మటనే రాలేదు

మెటీరియల్ ను ముందే చూసుకోవాలి కదా. స్పాట్ కు వచ్చాక అది బాలేదు, ఇది బాలేదు అంటే సీఈఓను పెట్టుకోవడం ఎందుకు, ఆమెకు అడ్వైజర్ ఎందుకు అని సూరజ్ ఫైర్ అవుతాడు. మూర్తిని మటన్ బిర్యానీకి ప్రిపేర్ చేయమని దీప అంటుంది. అసలు మటన్ బిర్యానీ గురించి చెప్పనేలేదు. అసలు మటనే రాలేదు కదా అని మూర్తి అనడంతో దీప షాక్ అవుతుంది.

కన్నింగ్ మాలిని

థాంక్యూ దీప గారు మీ వల్ల నాకు మంచి పేరు వచ్చేలా ఉందని సూరజ్ ఎద్దేవా చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయలేమని సూరజ్ అంటాడు. మీకోసం నేను మాటలు పడలేను. ఫుడ్ ఎలా డెలివరీ చేస్తారో ఆలోచించి చెప్పండని సూరజ్ అడుగుతాడు. ఇక మేడం అంటూ మాలిని దగ్గరకు మేనేజర్ వంశీ పరుగెత్తుకుంటూ వెళ్తాడు.

సరుకులన్నీ నాసిరకంగా ఉన్నాయని దీప వంటలన్నీ ఆపేశారని వంశీ చెప్తాడు. వంటలు పంపకపోతే ఆర్డర్ ఇచ్చినవాళ్లు ఊరుకుంటారా? జ్యోత్స్న రెస్టారెంట్ పరువు తీస్తారు. అప్పుడు నింద దీప మీద వేస్తాం. ఏం జరిగినా లాభం మనకే కదా అని మాలిని కన్నింగ్ గా అంటుంది.

ఏం చేద్దాం బావ అని దీప టెన్షన్ పడుతుంది. నేను లేకపోతే ఏం చేసేదానివో అదే చేయాలి. నీ వెనుక నేనుంటా. ఏం చేద్దామో చెప్పు అని దీపను కార్తీక్ ఎంకరేజ్ చేస్తాడు. ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి తాను బాధ్యత తీసుకుంటున్నానని సూరజ్ కు దీప చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More