Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- దీప నా కూతురే కాదు- మైండ్ బ్లాక్ షాకిచ్చిన దశరథ- జ్యోత్స్న కన్నీళ్లు
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 1 ఎపిసోడ్ లో సూరజ్ ను వదలను అని కార్తీక్ ఫిక్స్ అవుతాడు. సూరజ్ తిరిగిచ్చిన తన గిఫ్ట్ లను చూసి జ్యోత్స్న వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీప తన కూతురు కాదు అనేలా దశరథ మాట్లాడతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు ఇక్కడ చూసేయండి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ చేతిలో మోసపోయామని కార్తీక్, దీప ఫీల్ అవుతుంటారు. మనకు ఈ గతి పట్టించిన మాలిని బాగుంది. మనవడిని పంపిన దక్షిణామూర్తి బాగానే ఉన్నాడు. మోసం చేసిన సూరజ్ బాగానే ఉన్నాడు. మనం ఎటూ కాకుండా మిగిలిపోయామని దీపతో కార్తీక్ అంటాడు.

మోసపోయాం దీప
సూరజ్ అన్ని తెలుసుకొని పక్కా ప్లాన్ తో ఈ గేమ్ ఆడాడు. బ్యాంకులో రాబరీ చేసిన వాళ్లలాగే సూరజ్ ప్లాన్ చేశాడు. సూరజ్ గ్రౌండ్ వర్క్ చేశాడు. మన ద్వారా ఇంట్లోకి వచ్చాడు. డబ్బులు తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా? కానీ సూరజ్ చేశాడు. మా నాన్న ఎప్పుడో చెప్పాడు. సూరజ్ విషయంలో ఎప్పటికప్పుడు మోసపోతూ వచ్చామని దీపతో కార్తీక్ చెప్తాడు.
సూరజ్ ను వదిలిపెట్టను
చివర్లో మనల్ని దోషులుగా చేయడం కూడా ఆటలో భాగమే. పెళ్లి ఆగిపోతే ఎవరో ఒకరు గుండె పట్టుకొని పడిపోతారని సూరజ్ కు తెలుసు. పెళ్లి ఆగిపోతే మనం గొడవకు వెళ్లేవాళ్లం. అలా జరగకూడదనే సూరజ్ చాలా తెలివిగా మనల్ని మన ఫ్యామిలీకి దూరం చేశాడు. కానీ నేను వాడిని వదిలిపెట్టను. వాడి తండ్రి కారణంగా నా తల్లి అవిటిది అయిందని కార్తీక్ ఫీల్ అవుతాడు.
వెక్కి వెక్కి ఏడ్చిన జ్యోత్స్న
మరోవైపు బెడ్ రూమ్ లోకి వెళ్లి జరిగిన విషయాన్నితలుచుకుని జ్యోత్స్న ఏడుస్తుంది. ముహూర్తానికి ముందు సూరజ్ ఇచ్చిన గిఫ్ట్ ను జ్యో ఓపెన్ చేస్తుంది. అందులో జ్యోత్స్న ఇచ్చిన గోల్డ్ చైన్, రింగ్, గులాబీ ఉంటాయి. అందులో ఓ కార్డుపై ‘అన్నీ తిరిగిచ్చేశాను’ అని ఉంటుంది. అవి చూసుకుంటూ జ్యోత్స్న గతాన్ని తలుచుకుని వెక్కివెక్కి ఏడుస్తుంది.
సూరజ్ ను మర్చిపో
అప్పుడే పారిజాతం వస్తుంది. నాలో ఉన్న బాధ బయటకు వదిలేస్తున్నా. నేను సూరజ్ కు ఇచ్చినవి తిరిగిచ్చేశాడని జ్యోత్స్న చెప్తుంది. వాడు మోసగాడే. సూరజ్ఎ ప్పుడైతే మాలిని కొడుకు అని తెలిసిందో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాడు అబద్ధం. వాడి ప్రేమ అబద్ధం. ఇంకా వాడిని తలుచుకోవడం ఏంటీ? వాడిని మర్చిపో అని పారిజాతం చెప్తుంది.
సూరజ్ ను మర్చిపోలేను
మర్చిపోలేను గ్రానీ. నన్ను నేను మోసం చేసుకోలేను. నేను వాడిని వదులుకోలేను కదా అని జ్యోత్స్న ఏడుస్తుంది. నువ్వు మారిపోవడం వల్లే ఏడుస్తున్నావ్. సూరజ్ ను మర్చిపో. మళ్లీ నీలా మారిపో అని పారు అడుగుతుంది. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతుందేమో కానీ.. సీతాకోక చిలుక మళ్లీ గొంగళి పురుగు కాలేదని జ్యోత్స్న ఎమోషనల్ డైలాగ్ లు పేలుస్తుంది. దీంతో జ్యోను పట్టుకొని పారిజాతం కూడా ఏడ్చేస్తుంది.
తండ్రి చావుకు పగ తీర్చుకోవడం కోసం ఓ ఆడపిల్ల మనసును మోసం చేశాడు. మనం వాడిని వదలకూడదు. ఈ పారిజాతం మనవరాలిని మోసం చేసినందుకు ఏం జరుగుతుందో వాడికి తెలియాలి. నాలోని పాత పారిజాతం బయటకు వస్తే ఆ మాలిని కూడా పిల్ల బాతుబచ్చానే అని పారిజాతం ఆవేశపడుతుంది.
సూరజ్ ను ప్రేమించా
చైన్ లాకెట్ లో సూరజ్ ఫొటోను చూసి పారిజాతానికి విపరీతమైన కోపం వస్తుంది. లాకెట్ ను పడేయాలనుకుంటుంది. కానీ లాకెట్ తీసుకున్న జ్యోత్స్న.. సూరజ్ తన మనసులో ఉన్నాడని చెప్తుంది. నువ్వు ఏడవడమే సూరజ్ కు కావాలి. నువ్వు కుమిలిపోతే వాళ్లు అనుకున్నది సాధించినట్లే. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలని పారిజాతం అంటుంది.
నేను ఎవరినీ ఏం చేయాలనుకోవడం లేదు. సూరజ్ ను ప్రేమించా. ప్రేమంటే ఏంటో తెలిసింది సూరజ్ వల్లేనని జ్యోత్స్న అంటుంది. దీప, కార్తీక్ కలిసి సూరజ్ ను నీ జీవితంలోకి తీసుకొచ్చారు. నువ్వు ఏమైపోతావేమోనని భయమేస్తుందని పారు కంగారు పడుతుంది. నీ కన్నీళ్ల ఉసురు ఆ సూరజ్ గాడికి తగలాలని పారు శాపం పెడుతుంది.
దశరథ కోపం
ఇటు హాస్పిటల్ లో దశరథ కూడా కార్తీక్, దీపను దూరం పెట్టేలాగే మాట్లాడతాడు. మీరే తప్పు చేశారు. మీ వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. మీరు నిజం చెప్పలేదు. సుమిత్ర కూతురు కాబట్టే జ్యోత్స్నకు ఈ శిక్ష పడింది. వెంటనే మీరు జ్యోత్స్న దాసు కూతురు అని చెప్పాలి కదా. జ్యోత్స్న బతుకు ఏమైపోయినా పర్వాలేదా? పగను నువ్వు ఇలా తీర్చుకున్నావా? అని దీపను దశరథ అడుగుతాడు.
దీపనే కారణం
జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదు అనే నిజాన్ని చెప్పి ఉంటే సూరజ్ తాళి కట్టేవాడు. జ్యోత్స్నకు స్వార్థం ఉంటే.. శివ నారాయణ కుటుంబంతో సంబంధం లేదని చెప్పి సూరజ్ తో వెళ్లిపోయేది. మా రక్తం పంచుకోకపోయినా మా పగ పంచుకుంది. మాట కోసం నిలబడింది. అదీ కూతురంటే. జ్యోత్స్న నా సొంత కూతురైపోయిందని దశరథ లాజిక్ మాట్లాడతాడు.
చెల్లెలు లాంటి జ్యోత్స్న జీవితం నాశనం అవుతున్నా నోరు మెదపకుండా నిలబడ్డావ్. నా భార్య ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం నువ్వే దీప అని దశరథ షాక్ ఇస్తాడు. ఇప్పుడు దీప సొంత కూతురనే విషయం సుమిత్రకు తెలిస్తే కన్న కూతురే పెంచిన కూతురి జీవితాన్ని నాశనం చేసిందని మీ అమ్మ గుండె ఆగిపోతుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని దశరథ చెప్తాడు.
దీప కూతురని చెప్పలేను
జ్యోత్స్న జీవితాన్ని చీకటి చేశారు. జ్యోత్స్న ఎలా తట్టుకుని నిలబడిందో అర్థం కావడం లేదు. నా ప్రాణాలు కాపాడి నా చెల్లి అవిటిది అయిపోయింది. కాంచన రుణం జీవితంలో తీర్చుకోలేను. మీరు చేసింది కూడా జీవితంలో మర్చిపోలేను. దీపనే దశరథ, సుమిత్రల కన్నకూతురని ఈ జన్మలో నోరు తెరిచి చెప్పలేనేమో అని దశరథ మైండ్ బ్లాక్ అయ్యే షాకిస్తాడు.
అంటే దీప తన కూతురు కాదనేలా దశరథ మాట్లాడతాడు. ఆ మాటలకు కార్తీక్, దీప షాక్ అవుతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


