...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు షాక్ మీద షాక్‌లు- కొత్త సీఈఓగా దీప ఎంట్రీ- పారు డబుల్ రోల్‌పై కార్తీక్ డౌట్

Karthika Deepam 2 Serial May 16th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 16వ ఎపిసోడ్‌లో శివ నారాయణతో దశరథ్ మాట్లాడుతూ జ్యోత్స్నను సీఈఓ చేస్తే పెళ్లి ఎప్పటికీ చేసుకోదని చెబుతాడు. కార్తీక్ విచిత్రమైన సలహా ఇస్తాడు. బోర్డ్ మీటింగ్‌కు వచ్చిన దీప కొత్త సీఈఓ అని దశరథ్ అంటాడు. పారుపై కార్తీక్ డౌట్ పడతాడు.

Published on: May 16, 2026, 07:18:08 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సీఈఓగా కార్తీక్ గారు ఎందుకు ఉండకూడదని బోర్డ్ మెంబర్స్ అడిగితే.. కొన్ని వ్యక్తిగత నిబంధనల వల్ల కేవలం సలహాదారుగా మాత్రమే ఉండగలనని కార్తీక్ అంటాడు. బావ చెప్పేది నిజమే అయితే నాన్న ఎందుకు ఆపుతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది.

సుమిత్ర ఉందిగా

కార్తీక దీపం 2 సీరియల్ మే 16 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మే 16 ఎపిసోడ్

జ్యోత్స్న ఎందుకు సీఈఓగా ఉండటంలో నీ అభ్యంతరం ఏంటీ, తను కాకుండా మన ఫ్యామిలీలో ఎవరున్నారు అని శివ నారాయణ అంటాడు. మీతో పర్సనల్‌‌గా మాట్లాడాలని దశరథ్ అంటే.. సరే చిన్న బ్రేక్ తీసుకుందామని శివ నారాయణ అంటాడు. అంతా బ్రేక్ తీసుకుంటారు. చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నావ్. నేను తప్ప కంపెనీ సీఈఓగా ఎవరు అవ్వరు అని జ్యోత్స్న అంటే.. కార్తీక్ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోతాడు.

నేను కాకుండా మా ఫ్యామిలీ ఎవరున్నారని జ్యో అంటే.. మీ అమ్మ సుమిత్ర ఉందిగా. తను కూడా బాగా చదువుకుందని శ్రీధర్ చెప్పి వెళ్లిపోతాడు. దాంతో కంగారు పడిన జ్యోత్స్న తాతకు నాన్న ఏం చెప్పబోతున్నాడని అనుకుంటుంది. కార్తీక్ అంటే జ్యోత్స్నకు చాలా ఇష్టం. అలాంటి జ్యోత్స్న పెళ్లికి వెంటనే ఒప్పుకుంటేనే నాకు ఆశ్చర్యమేసింది. జ్యోత్స్నను సీఈఓ చేస్తే ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. ఎలా చేస్తుందో పక్కన పెట్టండి. జ్యోత్స్నను కంట్రోల్ చేయాలని దశరథ్ అంటాడు.

మావయ్య చెప్పింది నిజమని కార్తీక్ కూడా అంటాడు. నేను కోడలి మొహంలో ఆనందం చూడాలనుకున్నాను అని శివ నారాయణ అంటాడు. మీరు అనేది వెంటే నా మాట పోతుంది కదరా అని శివ నారాయణ అంటాడు. ఎవరి మాట పోకూడదంటే నా దగ్గర ఓ సొల్యూషన్ ఉందని కార్తీక్ అంటాడు. సుమిత్ర హ్యాపీగా ఉండాలి, జ్యోత్స్నకు పెళ్లి అవ్వాలని శివ నారాయణ అంటాడు.

విచిత్రమైన సలహా

జ్యోత్స్న రెస్టారెంట్ కొత్త సీఈఓ గ్రానీనా అని జ్యోత్స్న అంటుంది. నేను సీఈఓనా. ఇందుకేనా నన్ను పిలిచింది. మీరు ఇంతలా కోరుకుంటే నేను కాదనను. మీ అందరికి అని పారిజాతం అంటుంది. పారు ఒక్క నిమిషం. నువ్వు కాస్తా తప్పుకుంటే వెనుకున్నవాళ్లు ముందుకు వస్తారు అని కార్తీక్ అంటాడు. వెనుక చూస్తే దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసి అంతా షాక్ అవుతారు. జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది.

దీపను జ్యోత్స్న కూర్చోమని దశరథ్ అంటే.. జ్యోత్స్న పనివాళ్లు వచ్చేది కాఫీ, టీలు ఇచ్చేందుకని హేళనగా అంటుంది. దీప పని మనిషి కాదు. జ్యోత్స్న రెస్టారెంట్‌కి కాబోయే సీఈఓ అని దశరథ్ అంటాడు. అంతా అవాక్కవుతారు. జ్యోత్స్నకు కొత్త సీఈఓ సుమిత్ర అని, పారు అని, ఆఖరికి దీప అని తెలిసి షాక్ మీద షాక్‌లు తగులుతాయి. ఇప్పుడు నేనే అడ్డుపడాలి అని పారిజాతం అనుకుంటుంది. ఇంట్లో గిన్నెలు కడిగేవాళ్లను సీఈఓ చేయడం రాంగ్ డెసిషిన్ అవుతుందని తండ్రి మాటను వ్యతిరేకిస్తుంది జ్యోత్స్న.

ఇంకో మార్గం లేదు

దీప కడుపుతో ఉంది. ఈ బాధ్యతలు అవసరమా అని పారిజాతం అంటుంది. దీప మీద నాకు నమ్మకం ఉందని దశరథ్ అంటాడు. ధరణితో ఇరికిస్తుంది జ్యోత్స్న. దీప సీఈఓ అవడం ఇష్టం లేదని ధరణి అంటాడు. సీఈఓ మీ ఇంట్లో మనిషి ఉండాలని చెప్పాం కదా అని ధరణి అంటాడు. దీప నా కూతురే. నా చెల్లెలి కోడలు అంటే నాకు కూతురే కదా. దీప మా ఫ్యామిలీ మెంబరే అని దశరథ్ అనడంతో అభ్యంతరం లేదని ధరణి అంటాడు.

అభ్యంతరం ఉందని జ్యో అంటుంది. ఓటింగ్ పెట్టమని, అది న్యాయంగా ఉంటుందని జ్యోత్స్న అడుగుతుంది. సరే అని అంతా ఒప్పుకుంటారు. ఓటు హక్కు కార్తీక్‌కు కూడా ఉంటుందని శివ నారాయణ అంటే.. సరేనని జ్యో అంటుంది. ఓటింగ్ నిర్వహిస్తారు. జ్యోత్స్నను అడ్డుకోడానికి ఇది తప్ప ఇంకో మార్గం లేదని దీపతో అంటాడు కార్తీక్. దీపను తీసుకురమ్మంటే పక్కనే ఉన్న హాస్పిటల్‌కు అనుకున్న అని జ్యోతో పారు అంటుంది.

సీఈఓకి ఓటింగ్

వాళ్లను చూసి కార్తీక్ పారు డబుల్ రోల్ ప్లే చేస్తున్నట్లు ఉందని డౌట్ పడతాడు. ఓటింగ్ చీటీలను తీసి నువ్వే సీఈఓ ఎవరో చెప్పమని జ్యోత్స్నకు చెబుతాడు శివ నారాయణ. వరుసగా మూడు చీటీల్లో జ్యోత్స్న పేరు వస్తుంది. దాంతో జ్యోత్స్న సంతోషిస్తుంది. తర్వాత 3 చీటీల్లో దీప పేరు వస్తుంది. తర్వాత చీటీ చాలా డౌట్‌గా తీయబోతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe