Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దక్షిణామూర్తి క్షమాపణ చెప్పాలని అడిగింది, జరిగిన గొడవ గురించి జ్యోత్స్నకు చెబుతాడు శివ నారాయణ. అంతలో సూరజ్ ఇంటికి వస్తాడు. శివ నారాయణతో ఆవేశంతో ఊగిపోతాడు.
మీరసలు మనుషులేనట్రా..

మీతో మాట్లాడదామని వచ్చానని తాత అని సూరజ్ అంటే.. ఎవడ్రా నీకు తాత.. తూ.. మీరసలు మనుషులేనట్రా.. అందరూ పగలు పెట్టుకుని జీవితాలను నాశనం చేస్తారా.. ఏం బతుకులురా మీవి.. అని శివ నారాయణ అంటాడు. అదే మాట నేను అంటే అని సూరజ్ అంటుండగా.. రేయ్ సూరజ్.. దశరథ లోపలికి వెళ్లి రివాల్వర్ తీసుకురా.. మాటలతో చెబితే వీడికి అర్థం కాదు అని శివ నారాయణ ఉగ్రరూపం చూపిస్తాడు.
వీడు మూర్ఖుడురా.. తండ్రి ఆదేశిస్తే తల్లి తల నరికిన ఒక రాజు కథ నాకు తెలుసు. కానీ, వీడు తల్లి ఆదేశిస్తే ఎవడి తలైన నరుకుతాడు అని శివ నారాయణ అంటాడు. మరి ఇంత మూర్ఖుడులా మాట్లాడుతున్నావేంటీ తాత అని సూరజ్ అంటే.. కొట్టేందుకు పైకి వెళ్తాడు శివ నారాయణ. జ్యోత్స్న ఆపుతుంది.
జ్యోత్స్న వెళ్లి మూర్ఖుడులా మాట్లాడుతావేంటీ అని అడుగుతుంది. అది ఎవరు తెలుస్తుంది. ఎవరు ఆవేశపడుతున్నారు. కొడుకును రివాల్వర్ తెమ్మంటున్నాడు. అంటే షూట్ చేస్తాడా అని సూరజ్ అంటే.. పెద్దవాళ్లు కోపంలో ఏదో అంటారు. అన్ని చేస్తారా అని జ్యో అంటుంది. ఇప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. నా తండ్రి చావుకు కారణం ఈ కుటుంబమే అని సూరజ్ అంటాడు.
మా అమ్మ తప్పుగా అర్థం చేసుకుందనుకున్నా
చిన్నప్పటి నుంచి నేను ఏదైతే నమ్ముతున్నానో అదే నిజం. మొన్న పెళ్లిలో సమర్థించుకున్నారని కొంత ఆలోచించాను. మా అమ్మ తప్పుగా అర్థం చేసుకుందేమో అని ఆలోచించా. కానీ, ఇంత చిన్న విషయానికి ఇంతలా ఆవేశపడుతున్నాడు. ఆరోజు ఇంకెంత చేసి ఉంటాడో. మా నాన్న చావుకు మీ అమ్మ ఒక్కత్తే కారణం కాదు మీ కుటుంబం మొత్తం అని సూరజ్ అంటాడు.
{{/usCountry}}చిన్నప్పటి నుంచి నేను ఏదైతే నమ్ముతున్నానో అదే నిజం. మొన్న పెళ్లిలో సమర్థించుకున్నారని కొంత ఆలోచించాను. మా అమ్మ తప్పుగా అర్థం చేసుకుందేమో అని ఆలోచించా. కానీ, ఇంత చిన్న విషయానికి ఇంతలా ఆవేశపడుతున్నాడు. ఆరోజు ఇంకెంత చేసి ఉంటాడో. మా నాన్న చావుకు మీ అమ్మ ఒక్కత్తే కారణం కాదు మీ కుటుంబం మొత్తం అని సూరజ్ అంటాడు.
{{/usCountry}}రేయ్ ఊరుకున్న కొద్ది ఎక్కువగా మాట్లాడుతున్నావ్. నా తండ్రిని చంపాలని చూశారు అని జ్యో అంటుంది. చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్. క్రూరత్వంతో నిండిపోయిన మనుషులు ఎలా ఉంటారో కనిపిస్తోంది. మానవత్వంతో నిండిపోయిన మనుసులు ఎలా ఉంటాయో నేను చెప్పనా అని దక్షిణామూర్తి వచ్చి పలకరించింది, మాలిని బాబాయ్ అని ప్రేమగా పిలిచిందని సూరజ్ అంటాడు.
ఇవాళ మా తాతకు జరిగిన అవమానమే అన్నింటికి పెద్ద సాక్ష్యం. మీ తాత మూర్ఖుడు అనడానికి ఇంతకంటే పెద్ద కారణం ఏముంటుంది అని సూరజ్ అంటాడు. రేయ్ మర్యాదగా ఉండదని జ్యో అంటే.. ఏంటే నీకిచ్చే మర్యాద. ఇంతదూరం వచ్చాకా చెబుతున్నా.. అందుకే నీకు కరెక్ట్ శాస్తే జరిగింది. నువ్వు హంతకురాలి కూతురువు కాబట్టే నీ పెళ్లి ఆగిపోయిందని సూరజ్ అంటాడు.
ఆగిపోయింది నా ఊపిరి
ఎవర్రా హంతకురాలు అని సూరజ్ చెంపచెల్లుమనిపిస్తుంది జ్యోత్స్న. నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి మా అమ్మ గురించే అంటావా. అనాలనుకుంటే నేను ఎన్నైనా అనొచ్చు. కానీ తిరిగి తీసుకోలేని మాటలు అనలేను. మా నాన్న రివాల్వర్ తీసుకురా అన్నాడు. అదే ఆవేశంలో నువ్వు నోరు జారావు కదా. ప్రతిసారి గీతలు గీసుకుని మాట్లాడలేము. మాటలు గీతలు దాటుతాయి. కానీ హద్దులు దాటడం తప్పు అని జ్యోత్స్న అంటుంది.
మా అమ్మను హంతకురాలు అనడానికి నువ్వు సరిపోవు. మా కుటుంబానికి తగిన శాస్తి జరిగిందా. ఏం చేసిందిరా నా కుటుంబం. నాలాగే మా అమ్మ కూడా ప్రేమించింది. ప్రేమించడమే తప్పు అయితే ప్రతి ఆడదానిది తప్పేరా. మనుషులు ప్రేమిస్తారు. తగిన శాస్తి జరిగిందన్నమాట వెనక్కి తీసుకో. ఎందుకంటే ఆగిపోయింది పెళ్లి కాదు నా ఊపిరి అని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత నేను కదులుతున్నాను. మనసు విలువ తెలియని మనిషికి విచక్షణ లేకుండా పోట్లాడే పశువుకి తేడా లేదు. మనం మనుషుల్లాగే ఉందామని జ్యో అంటుంది. ఈ మాట మీ తాతకు చెప్పు. మా తాతకు పెద్ద అవమానమే చేశారు. నేను ఊరుకోను అని చెప్పడానికే వచ్చాను అని సూరజ్ అంటాడు. నాది కూడా సేమ్ డైలాగ్ అని జ్యోత్స్న అంటుంది.
సూరజ్ వర్సెస్ జ్యోత్స్న
నీ తాతకు నువ్వుంటే మా తాతకు నేనుంటే. మా తాత జోలికి వస్తే నేను ఊరుకోను. ఈ మాట మీ తాతకు చెప్పు అని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. ఈ మాట మీ తాతను గుర్తుపెట్టుకోమ్మను అని సూరజ్ అంటే.. ఇక నువ్వు వెళ్లొచ్చు అని జ్యో అంటుంది. సూరజ్ వర్సెస్ జ్యోత్స్నల ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటారు.
సూరజ్ వెళ్లిపోతాడు. కానీ, కారు కీస్ తీస్తుంటే సూరజ్ పాకెట్‌లో నుంచి పర్స్ కిందపడిపోతుంది. అది జ్యోత్స్న చూస్తుంది. మరోవైపు దక్షిణామూర్తి, సూరజ్ ఇద్దరు అవమానంతో కుమిలిపోతుంటారు. అది చూసి సుమిత్రకు కాల్ చేస్తుంది మాలిని. చేసిన తప్పుకు ఆమాత్రం అవమానం సరిపోయింది, నీ కొడుకును ఎలా పెంచావ్. వాడికి విషం పెట్టి పెంచావ్. ఒక ఒడదాని మీదకు ఆయుధంలా వదిలావ్. మనిషేనా నీ కొడుకు అని సుమిత్ర అంటుంది.
ఆడపిల్ల జీవితంతో ఆడుకునే వాడికి ఇలాంటి మర్యాదలే జరగాలి. నేను కూడా నీకు ఇలాంటి మర్యాదలు చేసుంటే ఇంత దూరం వచ్చేది కాదు. మండపంలో పెళ్లి ఆపినప్పుడు నా గుండె ఇంతకుమించి బరువెక్కింది. మీరు మాకు చేసిన అవమానం ముందు ఇది చాలా తక్కువ. నా పతనం చూడాలనుకున్నారు నా వాళ్లు కాదు. అది తండ్రి అయిన, నా మేనల్లుడు అయిన, ఆఖరికి నా వదిన అయిన. ఇంకోసారి నీ కొడుకు నా గుమ్మం తొక్కితే ఇలాగే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది సుమిత్ర.
శివ నారాయణతో కాళ్లు పట్టిస్తా
ఇదే సుమిత్ర నిజస్వరూపం. వాళ్ల సంగతి నాకు తెలుసు. మీకోసం నేను మెట్టు దిగాను. శివ నారాయణ మీద మనం ఓడిపోయాం. వాళ్లే మన మీద పగ తీర్చుకున్నట్లు ఉంది. మంచికోసం 100 మెట్లు దిగితే శివ నారాయణ చేతులతో చెప్పారు. మీకు ఏమైనా జరిగితే అది నాకు అవమానమే. అహంకారంతో మీ షర్ట్ చింపేసిన ఆ శివ నారాయణతోనే మీ కాళ్లు పట్టుకునేలా చేస్తాను అని మాలిని అంటుంది.
మీకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాను. ఇక నేను ఎవరు చెప్పిన వినను. మనం తప్పు చేస్తే ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తెలియాలి చేసి చూపిద్దాం మావయ్య అని పగతో రగిలిపోతుంది మాలిని. కట్ చేస్తే కార్తీక్, దీపను మాలిని కలుస్తుంది. మీరు మీరు బాగానే ఉన్నారు మధ్యలో మేము, జ్యోత్స్న బలైపోయాం అని కార్తీక్ అంటాడు.
నీకున్న అభిమానం మీ తాతకుంటే మీరు ఆఫీస్‌లో ఉండేవారు. మీకు సాయం చేసేందుకు వచ్చానురా. మీకున్న ఒక్క ఆధారం లేకుంటే ఎలా బతుకుతార్రా. మీకు ఓ ఆపర్ ఇద్దామని వచ్చాను. నా మాట విని నా దగ్గర పనిచేయు అని దీపతో అంటాడు. వాడంటే శివ నారాయణ కూతురు కొడుకు కాబట్టి వాళ్లకే సపోర్ట్ చేస్తాడు. కానీ, నువ్వు అలా కాదుగా. సుమిత్ర కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదుగా. దీప అనాధ. సుమిత్ర ఫ్యామిలీతో ఎలాంటీ సంబంధం లేదు అని మాలిని అంటుంది.
మీరు మాతో చేతులు కలపండి
ఈ మాట కరెక్టే బాగా విను దీప అని కార్తీక్ సెటైర్ వేస్తాడు. దీప నవ్వుతుంది. మీరు మాతో చేతులు కలపండి. వాళ్ల పొగరు దించొచ్చు. చేయి కలుపు దీప అని మాలిని హ్యాండ్ ఇస్తుంది. నాతో చేయి కలిపితే మీ జీవితాలే మారిపోతాయ్. మీ పిల్లల భవిష్యత్తే మారిపోతుంది. చేయి కలుపు అని అంటుంది మాలిని. దీప చేయి కలుపుతుంది.
నాకు తెలుసు నువ్వు నా మాట వింటావు. సుమిత్ర దశరథల పొగరు మనం దించుదాం అని మాలిని అంటుంది. దాంతో మాలిని చేయిని గట్టిగా పిసుకుతుంది. నా చేయి నొప్పి పెడుతుంది అని లాక్కుంటుంది. ఏం తింటావే నువ్వు చేయి ఇంత రఫ్‌గా ఉంది. నీ చేయి బలమేంటో చూపించమనలేదని మాలిని అంటుంది.
కొడుకును అడ్డంపెట్టుకున్నావ్ కాబట్టి నీ ఆటలు సాగాయి. లేకుంటే కష్టాన్ని ఆ ఇంటి ముందే ఆపేసేదాన్ని. సుమిత్రమ్మ నాకు కన్నతల్లిలాంటిది అని దీప అంటుంది. అలా ట్విస్టుల మీద ట్విస్టులతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.