...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- శివ నారాయణ ఆఫీసులపై ఒకేసారి దాడులు- దీపను చంపేందుకు మాలిని యాక్సిడెంట్

Karthika Deepam 2 Serial September 12th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 12వ ఎపిసోడ్‌‌‌లో ఊహించని విధంగా దెబ్బ దెబ్బ మీద కొట్టింది మాలిని. శివ నారాయణ ఆఫీసులు, రెస్టారెంట్‌లపై వరుసగా దాడులు, ప్రమాదాలు తలపెట్టడమే కాకుండా దీపను చంపించేందుకు మాలిని యాక్సిడెంట్ చేయించి సర్వనాశనం చేసింది.

Published on: Sep 12, 2026, 07:49:33 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర దశరథల పొగరు దించుదాం అని తనతో చేయి కలపమంటుంది మాలిని. చేయి ఇచ్చినట్టే ఇచ్చి మాలిని చేతిని బలంగా పిసికేస్తుంది. దాంతో నొప్పితో చేయి విడిపించుకుంటుంది మాలిని.

మాలినికి దీప వార్నింగ్

కార్తీక దీపం 2- శివ నారాయణ ఆఫీసులపై ఒకేసారి దాడులు- దీపను చంపేందుకు మాలిని యాక్సిడెంట్
కార్తీక దీపం 2- శివ నారాయణ ఆఫీసులపై ఒకేసారి దాడులు- దీపను చంపేందుకు మాలిని యాక్సిడెంట్

కొడుకును అడ్డంగా పెట్టుకున్నావ్ కాబట్టి తప్పించుకున్నావ్. నీలాంటి వాళ్ల వల్ల మాటలు పడాల్సి వస్తుంది. సుమిత్రమ్మా నాకు కన్నతల్లి లాంటిది. ఆ ఇల్లు నాకు పుట్టిల్లులాంటిది. వాళ్ల జోలికి రాకూ. నాలో ఉన్న అమ్మోరుని మా బావ చూశాడు. నువ్వు చూడాలనుకోకు. వెళ్లి యాపిల్ జ్యూస్ తాగు. నేనుండగా ఆ ఇంటి మీద ప్రమాదం రాదు. సారీ మేముండగా ఏ ప్రమాదం నా పుట్టిల్లు లాంటి ఆ ఇంటి మీద పడదు అని దీప వార్నింగ్ ఇస్తుంది.

కార్తీక్, దీప వెళ్లిపోతారు. థ్యాంక్యూ దీప నిన్ను కలవడం మంచిదే అయింది. నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది. నీ పనిలో నువ్వుండు.. నా పనిలో నేనుంటాను అని మాలిని అనుకుంటుంది. మరోవైపు ధీరజ్ ఇంటి గేట్ ముందు జ్యోత్స్న ఉంటుంది. జ్యోని చూసి వెంటనే వెళ్తాడు సూరజ్. కానీ, అక్కడ ఎవరు ఉండరు. తన గురించి ఆలోచించడం వల్ల తను వచ్చిందనుకున్నానా అని తిరిగి సూరజ్ వెళ్లిపోతుంటే వెనకే ఉంటుంది జ్యోత్స్న.

భ్రమ అనుకున్నావా. నేను రాలేదనుకున్నావా అని జ్యోత్స్న అంటుంది. ప్రేమ గురించి ఇద్దరు వాదించుకుంటారు. నీకు ఒకటి ఇద్దామని వచ్చాను. నీకు చాలా ఇష్టమైంది, చాలా విలువైంది అని సూరజ్ పర్స్ తిరిగి ఇస్తుంది. మా ఇంటి వాకిట్లో దొరికింది. కావాలనే పడేశావా, పొరపాటునా పడిందా అని ఇచ్చి అడుగుతుంది జ్యోత్స్న.

నాలాగే మర్చిపోలేక అవస్థలు పడుతున్నావ్

కొన్ని తీయడం గుర్తుండకపోవచ్చు కదా అని సూరజ్ అంటే.. అలా అయితే నా ఫొటోను చింపేసి కింద పడేయ్ అని జ్యోత్స్న అంటుంది. నేను ఎప్పుడో పెట్టిన ఫొటో ఇది. ఇప్పుడు తీయడం మర్చిపోయాను అని సూరజ్ అంటాడు. కూతురు ఆకలి తీర్చేందుకు ఓ తండ్రి చేసిన దొంగతనం కథ గురించి చెప్పిన జ్యోత్స్న ఎదుటివాళ్ల వైపుకు వెళ్లి ఆలోచించనంతవరకు మన అభిప్రాయమే కరెక్ట్ అనిపిస్తుందని జ్యో అంటుంది.

నీ కథల్లో నా జీవితాన్ని చూసుకోలేను. నీకు మీ నాన్న చందమామ కథలు చెప్పి ఉంటాడు. కానీ నాకు చెప్పింది అన్ని మా నాన్న కథలే. పసిబిడ్డ ఆకలి కంటే పసివాడి బాధ చాలా విలువైంది. నీకు బాధ విలువ తెలియదనుకుంటా. ఇంకెప్పుడు తెలుసుకోలేవు. ఎప్పటికీ తెలియదు. థ్యాంగ్స్ నా పర్స్ గేట్ ముందే ఇచ్చినందుకు. ఇది ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు. కానీ దీన్ని బట్టే నీ ఇంట్రెస్ట్ ఏంటో నీకే తెలుస్తుందని సూరజ్ అంటాడు.

జ్యోత్స్న మొహం మీదే గేట్

గుడ్ బై చెప్పి జ్యోత్స్న మొహం మీదే గేట్ వేసి వెళ్తాడు సూరజ్. మరోవైపు ఇన్నాళ్లు మీ నాన్న అస్థికలు కాశీలో కలపకపోవడానికి కారణం పగ తీరలేదని. ఇప్పుడు తీరింది. రేపు మీ నాన్న ఆర్థికం (వర్ధంతి). మీ నాన్న అస్థికలు కాశీలో కలిపేసి రా. మీ నాన్న జ్ఞాపకం నువ్వేరా అని మాలిని అంటుంది. ఆ అస్థికలు దక్షిణామూర్తి తీసుకుని నేను వెళ్తానని. నా కొడుకు అస్థికలు నేను కలపాల్సి వస్తుంది. ఇది నా తలరాత అంటాడు.

సరేనని మాలిని అంటుంది. రేపు మన కొత్త బ్రాంచ్‌కు వెళ్లాలని మాలిని చెబితే ముందు కాదని తర్వాత వెళ్తానని సూరజ్ ఒప్పుకుంటాడు. నువ్వే బాధ్యతలన్నీ తీసుకోవాలని మాలిని అంటుంది. అమ్మా.. నువ్వు నాకు తెలియకుండా ఏం చేయట్లేదుగా అని డౌట్‌గా సూరజ్ అడుగుతాడు. దాంతో షాక్ అయిన మాలిని నేను ఏం చేసిన నీకోసమే అని అంటుంది.

అనుమానంతో అడుగుతున్నావా.. తెలుసుకోవాలని అడుగుతున్నావా అని మాలిని అంటే.. క్లారిటీ కోసం అడుగుతున్నా అని సూరజ్ అంటాడు. ఏం చేసిన నీకోసం, మీ నాన్నకోసమే అని సమాధానం ఏం చెప్పకుండా వెళ్లిపోతుంది మాలిని. మరోవైపు అత్తాపూర్ బ్రాంచ్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని దశరథతో ఇంట్లో కంగారుగా చెబుతాడు శివ నారాయణ.

శివ నారాయణ అన్ని బ్రాంచ్‌ల్లో సమస్యలు

అంతా షాక్ అవుతారు. ఇంతలో స్టాఫ్ వచ్చి ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్స్ బోరబండలోని రెస్టారెంట్‌పై రైడ్ చేసి సీజ్ చేశారని చెబుతారు. దశరథకు కాల్ వస్తుంది. అమీర్ పేట్‌లోని బ్రాంచ్‌పై రైడ్ జరుగుతుందట అని శివ నారాయణకు చెబుతాడు దశరథ. ఇంకొకతను వచ్చి పంజాగుట్టలోని మన బ్రాంచ్ ఓపెన్ చేయకూడదని ఎవరో మనవాళ్లను కొడుతున్నారు సర్ అని చెబుతాడు.

అసలు ఏం జరుగుతుంది. ఎవరో మనల్నీ బెదిరిస్తున్నారని శివ నారాయణ అంటాడు. ఇంతలో దశరథకు మరో కాల్ వస్తుంది. మొత్తం ఏదో జరిగింది నాన్న. అన్ని బ్రాంచ్‌ల దగ్గర ఏదో ఒక సమస్య జరుగుతుంది. ఎవరో ఇది కావాలనే చేస్తున్న పని అని దశరథ అంటాడు. ఆఫీస్ మీద రైడ్ జరుగుతుందని శివ నారాయణ అంటాడు. దాంతో ఆఫీస్‌కు శివ నారాయణ, దశరథ వెళ్తారు.

ఏంటీ సుమిత్ర. ఎవరో కావాలని చేసినట్లు అన్ని సమస్యలు ఒకేసారి ఎలా వస్తాయని పారిజాతం అంటుంది. జరుగుతున్న వాటిపైన మాలిని లేదుగా అని సుమిత్ర డౌట్ పడుతుంది. దీపకు కూడా అన్ని సమస్యల గురించి కాల్స్ వస్తాయి. కార్తీక్‌కు చెప్పాలనుకుంటే ఫోన్ ఇంట్లోనే ఉంటుంది. త్వరగా వెళ్లాలని దీప నడుచుకుంటూ వెళ్తుంది.

దీపకు యాక్సిడెంట్

దీపను వెనుక నుంచి వ్యాన్ యాక్సిడెంట్ చేస్తుంది. ముందున్న చెత్త ట్రాలీపై దీప పడుతుంది. కడుపుకు దెబ్బ తగులుతుంది. నొప్పితో కిందపడిపోతుంది. తలకు దెబ్బ తగులుతుంది. అందరూ వీడియో తీస్తూ అంబులెన్స్‌కు కాల్ చేయండని అంటుంటారు. ఇంతలో మాలినికి వ్యాన్ డ్రైవర్ కాల్ చేసి మీరు చెప్పినట్లే చేశాను అంటాడు.

దీప ప్రాణం పోయిందా లేదా అని మాలిని అడిగితే.. బతికే అవకాశమే లేదు. చావు వార్త వింటారు అని అతనంటాడు. దీప దీప దీప.. నేను ఇచ్చిన ఆఫర్ రెజెక్ట్ చేసి వార్నింగ్ ఇచ్చావ్. నేను నవ్వుకుంటూ వచ్చానంటే సర్వనాశనం చేస్తానని అర్థం. నీ దమ్మేంటో నీ మాటలతో చూపించావ్. నా దమ్మేంటో నా చేతల్లో చూపించాను. నువ్వు సుమిత్ర కుటుంబంపై ఈగ వాలనివ్వను అన్నావుగా. హాయిగా చనిపో అని మాలిని అంటుంది.

మరోవైపు దీపను జ్యోత్స్న చూస్తుంది. ఎవరైనా సాయం చేయండని జ్యోత్స్న అడుగుతుంది. నేను హెల్ప్ చేస్తానని సూరజ్ అంటాడు. పదా హాస్పిటల్‌కు తీసుకెళ్దామని సూరజ్ అంటాడు. అలా దీపను సూరజ్, జ్యోత్స్న హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks