...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్ పనికి మాలిని షాక్- చెట్టు కింద శివ నారాయణ కుటుంబం-కలిసిన కార్తీక్

Karthika Deepam 2 Serial September 17th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 17వ ఎపిసోడ్‌‌‌లో దీపను కాపాడిన విషయం మాలినికి చెబుతాడు సూరజ్. నేను తీయాలనుకున్న ప్రాణాలకు నువ్వు ఊపిరి పోశావా అనుకుంటుంది. ఆస్తులన్నీ మాలిని జప్తు చేసుకున్న విషయం కార్తీక్‌కు తెలుస్తుంది. కార్తీక్, దీప వెతుకుతారు.

Published on: Sep 17, 2026, 07:41:52 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు ఏమైంది. బతికిందా చచ్చిందా ఇంకా తెలియదలేదేంటని మాలిని ఆలోచిస్తుంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. కొత్త రెస్టారెంట్‌కు వెళ్లలేదంటని అడుగుతుంది. వెళ్లలేదని, సమయం అంతా అక్కడే గడిచిందని సూరజ్ చెబుతాడు.

దీప వదినను కాపాడాను

కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 17 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 17 ఎపిసోడ్

సూరజ్ షర్ట్‌‌పై రక్తం చూసి, ఏంట్రా ఇది. ఎమైందని కంగారుగా అడుగుతుంది. ఈ రక్తం నాది కాదు. నేను కాపాడిన వ్యక్తిది. రోడ్డుపై చావుబతుకుల్లో ఉన్న ఒకరిని కాపాడాను. తను దీప వదిన అని సూరజ్ చెబుతాడు. దాంతో మాలిని తెగ షాకైపోతుంది. మనుషుల మీద కోపాన్ని విలువలపై చూపలేం. అందుకే దీపను వదిన అని పిలుస్తున్నాను. పైగా శివ నారాయణ కుటుంబాన్ని ఎలాంటి సంబంధం లేదు. ఈ విధంగా నేను రుణం తీర్చుకున్నా అని సూరజ్ అంటాడు.

దీపను నువ్వు కాపాడావా అని మాలిని అంటుంది. అదేంటీ ఎలా ఉందో అడగకకుండా ఇలా అడుగుతున్నావ్ అని సూరజ్ అంటాడు. షాక్‌లో ఉన్నా. కారు గుద్దేసినట్లు ఎలా తెలుసు అని మాలిని అడుగుతుంది. జ్యోత్స్న చూసింది. జ్యోత్స్న నేను కలిసి దీప వదినను హాస్పిటల్‌కు తీసుకెళ్లామని జరిగింది చెబుతాడు సూరజ్. నేను తీయాలనుకున్న ప్రాణాలు నువ్వు పోశావా అని మాలిని అనుకుంటుంది.

ఇప్పటికీ కూడా దీప వదిన ఎలా ఉందో నువ్వు అడగట్లేదేంటమ్మా. మనసులో దీప వదిన మీద కోపముందా. ప్రాణం కంటే పనిముఖ్యం కాదుకదా. నేను ఇలాంటి పరిస్థితిలో ఉంటే దీప నన్ను వదిలేయలేదు అని సూరజ్ అంటాడు. సరే వాళ్ల గురించి వదిలేయ్. దీప కాంచన కోడలు. నిన్ను కార్తీక్, దీప శత్రువు కొడుకులాగే చూస్తారని మాలిని అంటుంది.

దీప ఆయుష్షు గట్టిదే

మరోవైపు దీప స్పృహలోకి వస్తుంది. కార్తీక్ మాట్లాడుతుంటాడు. జ్యోత్స్న, సూరజ్ కాపాడి రుణపడేలా చేసుకున్నారని కార్తీక్ అంటాడు. ఫోన్ వచ్చింది గుర్తు చేసుకున్న దీప తాత ఇంటికి వెళ్లావా. రెస్టారెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్‌ జరిగిందని వంట మనిషి కాల్ చేసినట్లు చెబుతుంది దీప. మరి జ్యోత్స్న నాకు ఏం చెప్పలేదని కార్తీక్ అంటాడు.

తనకు కూడా తెలుసోలేదో. నువ్వు త్వరగా తాత ఇంటికి వెళ్లు అని దీప అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి ఇలా ఎందుకు మాట్లడుతున్నారు. దీప నువ్వు రెస్ట్ తీసుకోవాలని వారిస్తుంది. కార్తీక్ తాత ఇంటికి వెళ్తాడు. వాచ్‌మెన్ వెళ్లనివ్వడు. కానీ, బలవంతంగా కార్తీక్ వెళ్తాడు. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి షాక్ అవుతాడు కార్తీక్.

ఏ రోడ్డు పట్టుకుని వెళ్లారో

అక్కడికి మేనేజర్ వస్తాడు. ఇక్కడ ఇంఛార్జ్ నాకే ఇచ్చారని చెబుతాడు. మా తాత వాళ్లు ఎక్కడికి వెళ్లారని కార్తీక్ అడిగితే.. గెంటేస్తే ఎక్కడికి వెళ్తారో నాకేం తెలుసు అంటాడు మేనేజర్. రేయ్ గెంటేయడం ఏంట్రా అని కార్తీక్ అంటాడు. శివ నారాయణ ఆస్తులన్నీ మా మాలిని మేడమ్ జప్తు చేసుకున్నారు అని మేనేజర్ అంటే కార్తీక్ కాలర్ పట్టుకుంటాడు.

వదిలేయండి సార్ నేను కూడా మాలిని మనిషినే అని మేనేజర్ అంటాడు. జరిగింది అంతా చెబుతాడు మేనేజర్. అన్ని ఆస్తులు జప్తు చేసుకుని కట్టుబట్టలతో గెంటేశారు. మీరు ఇక్కడికి వచ్చారంటే మీ ఇంటికి రాలేదని అర్థమైంది. ఏ రోడ్డును పట్టుకుని వెళ్లారో వెతుక్కోండి అని మేనేజర్ అంటాడు. నమ్మకద్రోహి అని కార్తీక్ కొట్టబోతాడు.

ఇంతలో కార్తీక్‌కు డాక్టర్ కాల్ చేసి రమ్మంటుంది. తాతవాళ్లు ఎక్కడికి వెళ్లారో నాకు ఫోన్ చేయొచ్చుగా అని కార్తీక్ అంటే.. ఫోన్‌లు కూడా ఇవ్వలేదు సర్. అన్నీ లోపలే ఉన్నాయి. మేడమ్ గారు హాస్పిటల్‌లో ఉన్నారు వెళ్లండి అని మేనేజర్ అంటాడు. మా వాళ్లకు ఏమైనా కావాలి ఒక్కరిని కూడా వదలను అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

సూరజ్‌ని తిట్టిన జ్యోత్స్న

మరుసటి రోజు ఉదయం బ్రాంచ్‌కు కారులో సూరజ్ వెళ్తుంటాడు. మాలినితో వెళ్తున్నట్లు మాట్లాడుతుంటాడు. ఇంతలో కారులో జ్యోత్స్న ఫోన్ కనిపిస్తుంది. దాంతో మాలినితో ఇంటికి వచ్చాక మాట్లాడుతానని కాల్ కట్ చేస్తాడు. ఇది జ్యోత్స్న ఫోన్ అని సూరజ్‌కు గుర్తుకు వస్తుంది. మరోవైపు జ్యోత్స్న తన ఫోన్‌కు కాల్ చేసుకోవాలని ఇతరులను ఫోన్ అడిగితే కిందకి మీదకు చూసి ఇవ్వకుండా వెళ్తారు.

దొంగ సంతకాలు పెట్టించి మోసం చేశానని ఫ్యామిలీ అంతా నన్ను తిట్టుకుంటూ ఉంటారు. ఈ ఫోన్ ఎలా జ్యోత్స్నకు ఇవ్వాలని సూరజ్ ఆలోచిస్తాడు. ముందు ఫోన్ స్విచ్ఛాన్ చేద్దాం. ఎవరితో అయినా కాల్ చేయిస్తుందేమో అని సూరజ్ అనుకుంటాడు. ఒకరి ఫోన్‌తో కాల్ చేస్తుంది జ్యోత్స్న. సూరజ్ మాట్లాడుతాడు. జరిగింది చెబుతాడు సూరజ్.

ఫోన్ చూసి ఏం చేశావని జ్యోత్స్న అడుగుతుంది. చూసి నీకు ఇద్దామని ఇంటికి వెళ్లాను అని సూరజ్ అంటే.. అక్కడ ఎవరున్నారని వెళ్లడానికి, దొంగ సంతకాలు పెట్టుకుంచుకుని మమ్మల్ని గెంటేసి రెండు రోజులు అవుతుంది. ఇది మూడో రోజు. నన్ను ఒక్కదాన్నే మోసం చేశావనుకున్నా. నా ఫ్యామిలీ అందరిని వీధిలోకా లాగేశావని తిడుతుంది జ్యోత్స్న.

మన చేతులతో మనవాళ్ల జీవితాలు నాశనం

ఎక్కడున్నావ్. నీ ఫోన్ నీకు ఇవ్వాలి అని సూరజ్ అడిగితే.. ఎందుకు. ఆస్తులన్నీ లాగేసుకుని ఈ ఫోన్ మాత్రం ఎందుకు అని కాల్ కట్ చేసి వెళ్తుంది. కాల్ వచ్చిన నెంబర్‌కు కాల్ చేసిన సూరజ్ అడ్రస్ కనుక్కుంటాడు. మరోవైపు పరిస్థితి ఎలా వచ్చిందో చూశావా అని కాంచన బాధపడుతూ చెబుతుంది. దీపకు ఎక్కడ విషయం తెలుస్తుందో అని మమ్మల్ని హాస్పిటల్‌కు కూడా రావొద్దన్నావ్ అని కాంచన అంటుండగా.. దీప వస్తుంది.

ఏం మాట్లాడుతున్నావ్ అత్త అని అడుగుతుంది. సుమిత్రమ్మ కుటుంబం వీధినపడటం ఏంటని. నేను వెళ్తాను అని అడుగుతుంది దీప. దాంతో కాంచన, కార్తీక్ ఇద్దరు జరిగింది అంతా చెబుతారు. మాలిని చాలా తెలివిగా మన చేతులతో మనవాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేసిందని కార్తీక్ అంటాడు. నీకు చెబితే నువ్వు ఇంత త్వరగా కోలుకునేదానివి కాదు అని కార్తీక్ అంటాడు.

వాళ్లు గురించి ఏం తెలియట్లేదని శ్రీధర్ అంటాడు. వాళ్ల దగ్గర ఫోన్ కూడా లేదని కార్తీక్ అంటాడు. పదా. మనం వెళ్దాం. ఏం చేసైనా సరే వాళ్లను ఇంటికి తీసుకొద్దామని దీప అంటుంది. కార్తీక్, దీప శివ నారాయణ వాళ్ల కోసం ఫొటోలు చూపిస్తూ వెతుకుతుంటారు. ఇదివరకు సూరజ్‌కు కాల్ చేసిన ఫోన్ వ్యక్తి నెంబర్ నుంచి కార్తీక్‌కు కాల్ వస్తుంది.

మణికొండ బస్టాఫ్ దగ్గర ఉంది

మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో వాళ్లు ఇక్కడే ఉన్నారని. నువ్వు వెతుకుతున్న కుటుంబం మణికొండ బస్టాఫ్ దగ్గర ఉన్నారని చెబుతాడు. మీరెవరు అని కార్తీక్ అడిగితే.. అదంతా ఎందుకు అబ్బాయి అని కాల్ కట్ చేస్తాడు. అతని సూరజ్ అలా చెప్పిస్తాడు. అతనికి సూరజ్ డబ్బులిస్తే.. వద్దు బాబు. మంచి పనికి డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని వెళ్లిపోతాడు.

ఈ మాట గుర్తుపెట్టుకుంటానని సూరజ్ అంటాడు. శివ నారాయణ వాళ్లను కార్తీక్, దీప చూస్తారు. ఓ చెట్టు కింద కూర్చుని ఉంటారు. తాత అని పిలుస్తాడు కార్తీక్. నీకు కూతురు కంటే రోడ్డు ఎక్కువైందా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ అని దశరథ అంటే.. నీతో మాట్లాడను మావయ్య. మాపై కోపాలు ఉండొచ్చు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మొండిగా ఉంటానంటే ఎలా అని కార్తీక్ అంటాడు.

శివ నారాయణను కలిసిన కార్తీక్ దీప

మేము ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసిందని శివ నారాయణ అంటాడు. మీకోసం రెండు రోజుల నుంచి వెతుకుతున్నాం. దీపను ఇవాళే డిశ్చార్జ్ చేశారని కార్తీక్ అంటాడు. దీప సంతకాలు పెట్టించడం గురించి, సూరజ్ గాడు ఆఫీస్‌లో అడుగుపెట్టిన రోజే ఈ శివ నారాయణ పతనానికి శంకుస్థాపన చేశావని దీపను అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks