...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్‌తో మాలిని డబుల్ గేమ్- పగతో రగిలిపోతున్న సూరజ్- పద్మవ్యూహంలో జ్యో

Karthika Deepam 2 Serial September 3rd Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 3వ ఎపిసోడ్‌‌‌లో సూరజ్ ప్రేమ నుంచి బయటపడలేనని కార్తీక్, దీపతో చెబుతుంది జ్యోత్స్న. సుమిత్ర డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. ఇక తను దేన్నైనా తట్టుకోగలను అంటుంది. సుమిత్ర ఇంట్లో ఎలా ఉందో దక్షిణామూర్తి కనుక్కోమంటాడు.

Published on: Sep 3, 2026, 07:06:05 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నకు దీప, కార్తీక్ సారీ చెబుతారు. సూరజ్‌ను ఇప్పటికీ ప్రాణంగా ప్రేమిస్తున్నానని, మర్చిపోలేకపోతున్నానని జ్యోత్స్న చెబుతుంది. సూరజ్ పగతో చేశాడని తెలిసినప్పుడు వదిలేయడమే మంచిదని కార్తీక్ అంటాడు.

అన్నా వదినల్లా పెళ్లి చేయాలనుకున్నారు

కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 3 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 3 ఎపిసోడ్

సూరజ్ గులాబీ పువ్వు ఇచ్చినప్పుడు జ్యోత్స్న తొక్కేస్తే అప్పుడు సూరజ్ చెప్పింది చెప్పి తను చేసినదానికి ప్రేమ ఏమాత్రం మారదని జ్యో అంటుంది. నువ్వు ఇంతలా మారతావనుకోలేదని దీప అంటుంది. నేను మారలేదు, వాడు మార్చాడని జ్యోత్స్న అంటుంది. ఈ గమ్యం లేని ప్రయాణం ఎంతవరకు. ఎక్కడో చోట ఆపాలని, నువ్వు నీలా ఉంటేనే కదా ఏదైనా తెలియడానికి కార్తీక్ అంటాడు.

మీ తాత మా మొహాలు చూడనన్నాడు, మావయ్య దూరం పెట్టాడు. ఇప్పుడు వాళ్లకు ఎదురుపడి వాళ్లను బాధపెట్టడం ఇష్టంలేదు. బయటకు వస్తావేమో అని మెసేజ్ చేస్తే రిప్లై రాలేదు. సూరజ్ గదిలోకి రావడం చూసి వచ్చామని కార్తీక్ అంటాడు. వెళ్లిపోండి బావ. తాత చూస్తే ఏమైనా అంటాడు. మీరు ఎంత బాధలో ఉన్నారు తెలుసు. అన్నా వదినల్లా నిలబడి పెళ్లి చేయాలనుకున్నారు. నిజం తెలిశాక ఏమైపోయి ఉంటారో అర్థం చేసుకోగలను అని జ్యోత్స్న అంటుంది.

మీ గుండె ఆగినంత పనైంది. దానికితోడు అందరు మిమ్మల్ని నిందించుంటారు. నేను మాత్రం అనను అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నను హగ్ చేసుకుని తోబుట్టువులా చెబుతున్నాను. అంతా వదిలేయ్. మనల్ని వద్దనుకునే ప్రేమలు వద్దు అని దీప అంటుంది. సూరజ్ ప్రేమ పద్మవ్యూహంలాంటిది. తిరిగిరావడం నాకు తెలియట్లేదు. తెలిసిన రాలేను. నేను నా మనసును కోల్పోయాను అని జ్యోత్స్న వెళ్లిపోతుంది.

ఇక నేను దేన్నైనా తట్టుకోగలను

తనను వెళ్లనివ్వు. జ్యోత్స్న సంగతి మేము చూసుకుంటాం. నువ్వు కోలుకోవాలని సుమిత్రతో అంటాడు శివ నారాయణ. ఇక ఏం జరిగిన నేను తట్టుకుంటాను. నా కూతురు జీవితం బాగుండాలి. అందుకోసం నేను ఏం చేయడానికైన సిద్ధంగా ఉన్నాం. మాలిని మా నాన్న ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసి నా కూతురు మనసుతో ఇంతలా ఆడుకుంటారనుకోలేదని సుమిత్ర అంటుంది.

నేను బతికిపోయానని ఈపాటికి మా నాన్న బాధపడుతూనే ఉంటాడని సుమిత్ర అంటుంది. మరోవైపు సుమిత్ర, శివ నారాయణ కోపం గురించి నాకు తెలుసు. ఈపాటికి మనింటి మీద సునామీలా పడాలి. సుమిత్ర రాలేదంటే అక్కడ ఏదో జరిగింది. నేను ఎదురుచూసింది వేరు. కానీ, మీరిద్దరు వేరే చేశారని దక్షిణామూర్తి అంటాడు. మీ కూతురు మనింటికి వస్తుంది. అందుకే సూరజ్ ఇలా చేశాడని మాలిని అంటుంది.

సూరజ్‌తో మాలిని డబుల్ గేమ్

ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలని దక్షిణామూర్తి అంటాడు. ఇంతలో సూరజ్ వస్తే మీ అత్తింట్లో ఏం జరుగుతుందో తెలుసు అని మాలిని చెబుతుంది. సూరజ్ బయటకు వస్తాడు. మాలిని పిలిచి మీ తాత అడిగారని తెలుసుకోమ్మన్నాను. తెలుసుకోకు. మళ్లీ ఆయనే వద్దన్నారు. మనం వాళ్ల వెంట మనం పడటం ఏంటీ. మీ అత్త సుమిత్ర తనంతట తాను వచ్చి క్షమించమని అడగాలి అని మాలిని అంటుంది.

మళ్లీ ఇక్కడ తాత చెప్పాడని, మళ్లీ వద్దన్నాడని చెప్పి సూరజ్‌తో డబుల్ గేమ్ ఆడుతుంది మాలిని. పార్క్‌లో రన్నింగ్ చేస్తున్న సూరజ్‌కు జ్యోత్స్న కనిపించి ఆగుతాడు. ఎందుకు వచ్చావని అడగవా. నేనొచ్చింది నీకోసమే అని జ్యోత్స్న అంటుంది. అన్నీ తిరిగిచ్చేశానుగా అని సూరజ్ అంటాడు. అన్నీ ఇచ్చేశావ్. ఒక్క మనసు తప్పా అని జ్యో అంటుంది.

ఒకరి జ్ఞాపకాలు మనకు వద్దు అనుకున్నప్పుడు వాళ్లు ఇచ్చిన వస్తువులు తిరిగి ఇవ్వాలని నిన్ను చూసే తెలుసుకున్నాను అని కార్తీక్‌కు జ్యోత్స్న ఇచ్చిన గిఫ్టుల గురించి చెబుతాడు సూరజ్. రెండు పోల్చాల్సిన అవసరం లేదు. మా బావ వేరొకరి భర్త. నువ్వు కాబోయే భర్త. నువ్వు వదిలేసింది ఒక ఆడపిల్ల జీవితాన్ని. నీ పగ తీర్చుకోడానికి నా మనసులో ఆడుకునే అధికారం నీకేముంది. నీ పగకు నాకు ఏం సంబంధం ఏంటని జ్యో అడుగుతుంది.

అన్యాయానికి అన్యాయమే న్యాయం

మీ అమ్మ పెళ్లికి మా నాన్న చావుకు కారణం ఎవరు. ఎవరు ఎంత సమర్థించుకున్న చేసిన తప్పులు పోవని సూరజ్ అంటాడు. నీ తల్లి పగ నా ప్రేమను బలి కోరడం అన్యాయం కాదా అని జ్యో అంటుంది. అది అన్యాయం అయితే నీ తల్లి ప్రేమ నా తండ్రి చావు కోరడం కూడా అన్యాయమేగా. అన్యాయానికి అన్యాయమే న్యాయం. అది నేను చేశాను అని సూరజ్ అంటాడు.

నేను కోల్పోయిన దానితో పోలిస్తే నువ్వు కోల్పోయింది చాలా తక్కువ. నీకు ఎంతో అందమైన జీవితం ఉంది. కానీ, నేను ఏం కోల్పోయానో తెలుసా. నేను కడుపులో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. మీ అమ్మే చంపేసింది. అమ్మ, తాత మాత్రమే ఉండేవారు. మీ అమ్మ చేసిన ఒకే ఒక్క తప్పు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని సూరజ్ పగతో రగిలిపోతుంటాడు.

మా కుటుంబం లాగే బాధపడాలి

మా నాన్నకు నేనిచ్చే నివాళి ఇదే. తల్లి కన్నీళ్లు తుడవడం కంటే నరకం ఇంకోటి ఉండదు. మా కుటుంబం ఎలా బాధపడిందో మీ కుటుంబం కూడా అంతే బాధపడాలని సూరజ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe