Karthika Deepam 2: తెలుగు ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ సీరియల్ కు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్రాంఛైజీలో వచ్చిన ‘కార్తీక దీపం 2’ కూడా తెలుగునాట సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు సీరియల్ లో నాటకీయ పరిణామాలు ఆడియన్స్ కు కిక్ అందించడం ఖాయంగా కనిపిస్తున్నాయి.
రివేంజ్ మోడ్

కార్తీక దీపం 2 సీరియల్ లో స్టోరీ ఇప్పుడు ఊపందుకుంది. కార్తీక్, దీప రివేంజ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మాలిని, సూరజ్ మీద పగ తీర్చుకోవడానికి రెడీ అయ్యారు. తన తాత ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగిన మాలినిని కార్తీక్, దీప కలిసి టార్గెట్ చేశారు. దిమ్మతిరిగేలా దెబ్బకొట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.
ఎమోషనల్ డ్రామా
కార్తీక దీపం 2 సీరియల్ లో గత కొన్ని ఎపిసోడ్లుగా ఎమోషనల్ డ్రామా పండింది. మాలిని కొడుకు అని తెలియక సూరజ్ ను గుడ్డిగా నమ్మిన శివ నారాయణ ఫ్యామిలీ రోడ్డున పడింది. అందుకు కారణం దీప, కార్తీక్ అని నిందలు వేశారు. గొప్పగా బతికిన తాత ఫ్యామిలీ ఈ దుస్థితికి రావడం, దీపకు యాక్సిడెంట్ జరగడం లాంటి విషయాలతో కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు.
ఆస్తులన్నీ పోయి నడిరోడ్డు మీదకు రావడంతో శివ నారాయణ, దశరథ, సుమిత్ర, పారిజాతం కూడా ఏడ్చారు. చివరకు కాంచన ఇంట్లో శివ నారాయణ ఫ్యామిలీ సెటిలైంది.
రూపాయి జీతమైనా
తన ఫ్యామిలీని మోసం చేసిన మాలినిపై పగతో కార్తీక్, దీప రగిలిపోతున్నారు. అందుకే అగ్రిమెంట్ ను అడ్డం పెట్టుకొని జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. దీప ఏమో సీఈఓగా, కార్తీక్ ఏమో అడ్వైజర్ గా అడుగుపెట్టారు. కానీ మాలిని వీళ్ల ఇద్దరికి కలిపి ఒక్క రూపాయి శాలరీ అని షాకిచ్చింది.
{{/usCountry}}తన ఫ్యామిలీని మోసం చేసిన మాలినిపై పగతో కార్తీక్, దీప రగిలిపోతున్నారు. అందుకే అగ్రిమెంట్ ను అడ్డం పెట్టుకొని జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. దీప ఏమో సీఈఓగా, కార్తీక్ ఏమో అడ్వైజర్ గా అడుగుపెట్టారు. కానీ మాలిని వీళ్ల ఇద్దరికి కలిపి ఒక్క రూపాయి శాలరీ అని షాకిచ్చింది.
{{/usCountry}}రూపాయి జీతమైనా కూడా పగ తీర్చుకునేంత వరకూ బయటకు వెళ్లేదే లేదని దీప, కార్తీక్ ఫిక్స్ అయ్యారు. అందుకే తమ రెస్టారెంట్స్ ను తిరిగి దక్కించుకొని మాలినిని చావు దెబ్బ తీసేలా అక్కడే ఉంటామని ఫిక్స్ అయిపోయారు.
సూరజ్ కు తెలుస్తుందా?
అయితే ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ లో కథ ఇంట్రెస్టింగ్ గా మారడానికి మరో కారణం కూడా ఉంది. అదే సూరజ్ పై తల్లికి, తల్లికి సూరజ్ పై అనుమానం. తల్లి ఏదో తప్పు చేస్తోందని సూరజ్ కు డౌట్ వచ్చింది. కానీ అమ్మ ప్రేమతో దాన్ని బయటపెట్టలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సూరజ్ కు మాలిని చేసిన దారుణాలు తెలిస్తే కథ మరో మలుపు తిరిగే అవకాశముంది.