Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన ప్రేమ గురించి సూరజ్ కు అర్థమయ్యేలా చెప్తుంది జ్యోత్స్న. ఇది మన ప్రేమ కథ. మర్చిపోలేని అందమైన ప్రేమ కథ అని జ్యోత్స్న అంటుంది. నీకు పెళ్లి అనగానే దాసు ఎందుకు ఆనందపడుతున్నాడని సూరజ్ అడుగుతాడు.
జ్యోత్స్న షాక్

సూరజ్ ప్రశ్నతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దశరథ కంటే దాసు కళ్లలోనే ఆనందం చూశానని సూరజ్ అంటాడు. ఆయన నాకు చిన్నాన్న అవుతాడు కాబట్టి, అన్నయ్య కూతురు పెళ్లి అంటే సంతోషం ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలంటే ఆయన్నే అడగమని చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది.
నగలతో పారు
ఇటు ఉదయం కొత్త చీర, ఒంటి నిండా నగలతో పారిజాతం మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తుంది. ఇదంతా ఏంటీ అని కార్తీక్ అడుగుతాడు. పారు నియమాలు ఉల్లంఘించిందని తాతకు చెప్తాడు కార్తీక్. మీ తాతే పర్మిషన్ ఇచ్చారు. మీ తాత వరం ఇచ్చారని పారు చెప్తుంది. జ్యోత్స్న పెళ్లి సెట్ అయింది కదా. మీ భార్య పనిమనిషి అంటే బాగోదని అడిగింది. అందుకే పర్మిషన్ ఇచ్చానని శివ నారాయణ చెప్తాడు.
క్రెడిట్ సూరజ్ కే
దశరథ వచ్చి కార్తీక్, దీపలతో మాట్లాడతాడు. జ్యోత్స్న నా కూతురు కాదని తెలిసినప్పటి నుంచి తన ప్రవర్తన నాకు నచ్చేది కాదు. నా పెంపకం సరిగ్గా లేదు. నేను తనకు మంచి తండ్రిగా లేను కాబట్టే నాకు మంచి కూతురిగా లేదనుకున్నా. కానీ మీరు జ్యోత్స్నను మార్చారు. మంచి కూతురిగా మార్చారని దశరథ అంటాడు. ఈ క్రెడిట్ అంతా సూరజ్ కే దక్కాలని కార్తీక్ అంటాడు.
దీప, జ్యోత్స్న అక్కాచెల్లెలు
సూరజ్ ఎవరు? మీరు లేకపోతే సూరజ్ ఆఫీస్ లోకి, ఇంట్లోకి కానీ వచ్చేవాడా? సూరజ్ నాకు నచ్చలేదు. కానీ నీ కారణంగా ఇంట్లో ఉండనిచ్చా. దీప తీసుకొచ్చి అడ్వైజర్ గా పెట్టుకుంది. జ్యోత్స్న, సూరజ్ కు పెళ్లి చేయాలని దీప అనుకుంది. దీప నా సొంత కూతురు, జ్యోత్స్న నా పెంపుడు కూతురు. ఇద్దరూ నా కూతుళ్లే. జ్యోత్స్నకు దీప అక్క అవుతుంది. దీప మంచి సంబంధం తీసుకొచ్చిందని నమ్మానని దశరథ చెప్తూ పోతాడు.
దీప ట్విస్ట్
{{/usCountry}}సూరజ్ ఎవరు? మీరు లేకపోతే సూరజ్ ఆఫీస్ లోకి, ఇంట్లోకి కానీ వచ్చేవాడా? సూరజ్ నాకు నచ్చలేదు. కానీ నీ కారణంగా ఇంట్లో ఉండనిచ్చా. దీప తీసుకొచ్చి అడ్వైజర్ గా పెట్టుకుంది. జ్యోత్స్న, సూరజ్ కు పెళ్లి చేయాలని దీప అనుకుంది. దీప నా సొంత కూతురు, జ్యోత్స్న నా పెంపుడు కూతురు. ఇద్దరూ నా కూతుళ్లే. జ్యోత్స్నకు దీప అక్క అవుతుంది. దీప మంచి సంబంధం తీసుకొచ్చిందని నమ్మానని దశరథ చెప్తూ పోతాడు.
దీప ట్విస్ట్
{{/usCountry}}జ్యోత్స్న అంతలా మారుతుందని అనుకోలేదు. ఇప్పుడు జ్యోత్స్న కూడా నా కూతురే అని దశరథ అంటాడు. జ్యోత్స్న మీ కూతురే. ఇప్పుడు ఈ దీప మీ కూతురు అని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని దీప ట్విస్ట్ ఇస్తుంది. మీరిద్దరూ నా కూతుళ్లే అని దశరథ ఎమోషనల్ అవుతాడు. నిజాలు బయటపడ్డ రోజు సుమిత్రతో దీప నా కన్నకూతురని, జ్యోత్స్న పెంచిన కూతురని చెప్తానని దశరథ అంటాడు.
ఎంగేజ్మెంట్ వద్దు
సూరజ్ ను పిలిపించి పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడతాడు శివ నారాయణ. ఒక్కగానొక్క మనవరాలి పెళ్లిని గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాని చెప్తాడు. నీకు, జ్యోత్స్నకు ఫస్ట్ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నా. నీకేమైనా అభ్యంతరం ఉందా అని సూరజ్ ను శివ నారాయణ అడుగుతాడు. అభ్యంతరం ఉందని సూరజ్ షాకిస్తాడు.
ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని సూరజ్ చెప్పడంతో అందరి మైండ్ బ్లాంక్ అవుతుంది. నాకైతే ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టించండని ట్విస్ట్ ఇస్తాడు సూరజ్. పంతులును ఈ రోజే పిలిపించి ముహూర్తాలు పెట్టించండని సూరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
పెద్ద అబద్ధం
సూరజ్ దగ్గరకు వెళ్లి ఎందుకు ఎంగేజ్మెంట్ వద్దన్నావని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడు పెళ్లిల్లు ఏమో ఎంగేజ్మెంట్, ఫొటో షూట్, బ్యాచిలర్ పార్టీ, సంగీత్, హల్దీ.. ఇలా వేడుకగా జరుగుతున్నాయని జ్యోత్స్న చెప్తుంది. కానీ సూరజ్ మాత్రం ఇవేమీ వద్దంటాడు. పెద్ద అబద్ధం చెప్పానంటాడు. నా మీద ఉన్న ప్రేమ అబద్ధమనుకున్నానని జ్యోత్స్న అంటుంది.
జ్యో గిఫ్ట్
నువ్వు నా సొంతం సూరజ్. ప్రేమగా మాట్లాడుకుందామని జ్యోత్స్న అంటుంది. సూరజ్ కు గోల్డ్ చెయిన్ ను గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ లాకెట్ లోపల ఓ వైపు సూరజ్, మరోవైపు జ్యోత్స్న ఫొటోలు ఉంటాయి. అది చూసి సూరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ‘జేఎస్’ అనే అక్షరాలు ఉన్న రింగ్ ను కూడా జ్యో ఇస్తుంది. జే అంటే జ్యోత్స్న, ఎస్ అంటే సూరజ్. నేను నీకు ఈ గిఫ్ట్ లు ఇచ్చానని 10 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకున్నా ఈ జ్ణాపకాలు అద్భుతంగా ఉండాలి. మన పిల్లలకు ప్రేమ కథ చెప్పాలని జ్యోత్స్న అంటుంది.
ప్రేమ లేదని
చైన్ ను మెడలో వేస్తానంటే సూరజ్ వద్దంటాడు. కానీ జ్యోత్స్న బలవంతంగా సూరజ్ మెడలో చెయిన్ వేస్తుంది. నువ్వు ఎంగేజ్మెంట్ వద్దు అన్నావ్ కదా. నేను ఈ ఉంగరం నీ వేలికి పెట్టానంటే మనకు ఎంగేజ్మెంట్ అయినట్లేనని రింగ్ పెట్టబోతుంది జ్యోత్స్న. కానీ సూరజ్ వద్దంటాడు. నీకు నా మీద ప్రేమ లేదని జ్యో కోపంగా వెళ్లిపోతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.