Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. నాని నిజం- మాలిని ఆడదేనా? జ్యో కోసం మహిని గెంటేసిన సూరజ్- తల్లికి షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 11 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. జ్యోత్స్నను సూరజ్ తిట్టడంపై ఇంట్లో అందరూ ప్రశ్నిస్తారు. మాలిని ఏమో మామయ్య మనసు మార్చాలని చూస్తుంది. కానీ ఆఫీసులో జరిగిందంతా నాని చెప్తాడు. దీంతో క్లయింట్ ను సూరజ్ గెంటేస్తాడు.

Published on: Nov 11, 2026, 07:02:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తూ ఆఫీసులో క్లయింట్ హెడ్ మహి అసభ్యంగా అన్న మాటలను తలుచుకుని జ్యోత్స్న బాధపడుతుంటుంది. మనసు, మనిషి ఒక్క చోట ఉంటేనే దాన్ని సాల్వ్ చేయగలవని సుమిత్ర వచ్చి అంటుంది.

కార్తీక దీపం 2.. నాని నిజం- మాలిని ఆడదేనా? జ్యో కోసం మహిని గెంటేసిన సూరజ్- తల్లికి షాక్ (jiohotstar)
కార్తీక దీపం 2.. నాని నిజం- మాలిని ఆడదేనా? జ్యో కోసం మహిని గెంటేసిన సూరజ్- తల్లికి షాక్ (jiohotstar)

జరిగింది చెప్పిన కార్తీక్

ఆఫీసులో జరిగిన దాని గురించి ఇంట్లో పంచాయతీ పెడతారు. ఏం జరిగిందని జ్యోత్స్నను అందరూ అడుగుతారు. కానీ ఏం జరగలేదని చెప్పి జ్యో తప్పించుకోవాలనుకుంటుంది. అయితే కార్తీక్ జరిగింది చెప్తాడు. రేపటి లోపు సంజాయిషీ ఇచ్చుకోకపోతే రాజీనామా చేయాల్సిందేనని సూరజ్ అన్నాడని కార్తీక్ చెప్తాడు.

తప్పు చేశావా జ్యోత్స్న?

ఇంత గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెప్తావేంట్రా? రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని శివ నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఆఫీసుకు వెళ్తానని అంటుంది. సూరజ్ కే సమాధానం చెప్తానంటుంది. నీ తప్పు లేకపోతే మాటలు పడవు. కానీ అన్ని మాటలు పడ్డావంటే ఏమైనా తప్పు చేశావా? అని జ్యోను దీప అడుగుతుంది.

సాల్వ్ చేసుకోగలను

అయితే జ్యోత్స్నను సూరజ్ తిట్టడంపై సుమిత్ర, పారిజాతం ఫైర్ అవుతారు. ఆఫీసులో అరగంట పాటు కనిపించకుండా జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందనే విషయం తెలియాలని కార్తీక్ అంటాడు. అందరూ ఇదే విషయాన్ని అడుగుతారు. ఆఫీసు విషయాలు ఇంట్లో మాట్లాడలేను. నాకేం కాలేదు, బాగానే ఉన్నా. ఆఫీసులో సూరజ్ తోనే మాట్లాడతా. నా సమస్యను సాల్వ్ చేసుకోగలనని చెప్పి జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది.

మోసపోయారు మామయ్య

మరోవైపు జ్యోత్స్నపై లేనిపోని నిందలు వేస్తూ దక్షిణామూర్తి మనసును మార్చాలని మాలిని ప్రయత్నిస్తుంది. జ్యోత్స్న మీ శత్రువు. మీరు తప్పు చేశారు మామయ్య. నమ్మి మోసపోవడం అనడం మంచిది. మీ కూతురు సుమిత్ర మిమ్మల్ని శత్రువుగా చూస్తున్నారు. శివ నారాయణ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగి మనవరాలికి ఉద్యోగం ఇస్తే శత్రువుకు ఛాన్స్ ఇచ్చినట్లే కదా. జ్యో వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నామని మాలిని అంటుంది.

ఏదో బలమైన కారణం

ఇదే సమస్యను జ్యోత్స్న వైపు నుంచి చూడాలని దక్షిణామూర్తి అంటాడు. నేను అదే చేశా. అందుకే ఫస్ట్ మెల్లగా అడిగా. కానీ జ్యోత్స్న ఏం చెప్పలేదు. అందుకే కోపంతో అడిగా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదన్న కోపం ఉందని సూరజ్ అంటాడు. చెప్పలేనంత బాధ మనసులో ఉందేమోనని దక్షిణామూర్తి మనవరాలికి సపోర్ట్ చేస్తాడు. కానీ సూరజ్ వినడు. జ్యోత్స్న ఇక మన ఆఫీసులో ఉండదు తాత అని సూరజ్ షాకిస్తాడు.

జ్యోత్స్న మౌనం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో నీకు తర్వాత తెలుస్తుందని సూరజ్ మనసు మార్చడానికి దక్షిణామూర్తి ప్రయత్నిస్తాడు.

నిజం చెప్పిన నాని

ఉదయం ఆఫీసులో సూరజ్ ప్రజెంటేషన్ కు క్లయింట్ చప్పట్లు కొడతాడు. జ్యోత్స్నను జాబ్ లో నుంచి తీసేశారా అని మహి అడుగుతాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. నిన్న మీటింగ్ కు రాకుండా జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందని సూరజ్ మళ్లీ అడుగుతాడు. కానీ తాను చెప్తానని ఆఫీస్ బాయ్ నానిని కార్తీక్ పిలుస్తాడు.

జ్యోత్స్న చేయిని మహి పట్టుకోవడం, కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించడం గురించి నాని చెప్తాడు. అది విని అందరూ షాక్ అవుతారు. అవమానంతో జ్యోత్స్న బయటకు వెళ్లిపోయింది. మీటింగ్ జరుగుతుందనే అనుకుంది. కానీ మీ టేబుల్ మీద ఫైల్ పెట్టిన సంగతి మీకు తెలియలేదు. మీ కాల్ లిఫ్ట్ చేస్తే లోపలికి రమ్మంటారని లిఫ్ట్ చేయలేదు. వీడు (మహి) వెళ్లిన తర్వాతే వచ్చిందని కార్తీక్ చెప్తాడు.

బుద్ధి లేని మాలిని

ఇలాంటి నీచుల మాటలు బయటకు చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోయింది జ్యోత్స్న. నాని చూశాడని కూడా జ్యోకు తెలియలేదు. కుటుంబం కోసం కష్టపడుతున్న అమ్మాయి చేయి పట్టుకోవడానికి వీడికి ఎంత ధైర్యం అని కార్తీక్ సీరియస్ అవుతాడు. నా మీద ఇలాంటి ఆరోపణలు ఏంటీ అని మహి డ్రామా స్టార్ట్ చేస్తాడు. మాలిని కూడా ఆ క్లయింట్ కే సపోర్ట్ చేస్తుంది. బుద్ధి లేకుండా మాట్లాడుతుంది.

డీల్ పై సంతకం

మధ్యలో సూరజ్ జోక్యం చేసుకుంటాడు. కార్తీక్ చెప్పేది నిజమా కాదా? అని జ్యోను సూరజ్ అడుగుతాడు. నిజమే అని జ్యో చెప్తుంది. అయినా కూడా డీల్ క్యాన్సిల్ కాకూడదని మాలిని చూస్తుంది. పొరపాటున చేయి తగిలిందేమోనంటుంది. డీల్ పై మహిని సైన్ చేయమంటుంది. అసలు నువ్వు ఆడదానివేనా అని కార్తీక్ ఫైర్ అవుతాడు. మహి ఏమో సంతకం పెడతాడు.

కార్తీక్ ఆవేశం

సూరజ్ ను సంతకం పెట్టమని మాలిని చెప్తుంది. పీఏ మాటలు నమ్మొద్దని మహి అంటాడు. సంస్థ అనేది కుటుంబం లాంటిది. ఓ అతిథి వచ్చి ఆడపిల్లను వేధిస్తే ఆ ఇంటి యజమానిని అవమానించినట్లు కాదా? మీ పీఏ అని తెలిసినా చేయి వేశాడంటే మీకు మర్యాద ఉన్నట్లా? ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పట్టించుకోకపోతే ఇక ఛైర్మన్ ఎందుకు? అని సూరజ్ తో కార్తీక్ ఆవేశంగా మాట్లాడి జ్యోను తీసుకొని బయటకు వెళ్తాడు.

గెంటేసిన సూరజ్

కార్తీక్ మాటలతో సూరజ్ రెచ్చిపోతాడు. మహి ముఖం మీద ఫైల్ కొడతాడు. దీంతో మాలిని షాక్ అవుతుంది. మహి కాలర్ ను పట్టుకొని బయటకు గెంటేస్తాడు సూరజ్. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More