...
...
Next Story

Karthika Deepam Sourya: వంటలక్క కూతురా మజాకా! కార్తీక దీపం 'శౌర్య' ఇంటర్ మార్కులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Karthika Deepam Sourya: కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురిగా అద్భుతమైన నటనతో అభిమానుల మనసులు గెలుచుకున్న బేబీ క్రితిక గుర్తుంది కదాా. ఇప్పుడు ఆ పాప మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆమెకు వచ్చిన మార్క్స్ తెలిస్తే షాక్ అవాల్సిందే.

Published on: Apr 15, 2026 11:29 AM IST
Advertisement

Karthika Deepam Sourya: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం 2 సీరియల్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సీరియల్ ను తెలుగు ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. అయితే ఈ సీరియల్ ఫస్ట్ పార్ట్ కార్తీక దీపం కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కార్తీక దీపంలో వంటలక్క కూతురుగా నటించిన బేబీ క్రితిక ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

కార్తీక దీపం శౌర్య

కార్తీక దీపం సీరియల్ ఫేమ్ క్రితిక (instagram-Karthikadeepam sourya)
కార్తీక దీపం సీరియల్ ఫేమ్ క్రితిక (instagram-Karthikadeepam sourya)

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురిగా క్రితిక నటించింది. శౌర్య పాత్రలో అదరగొట్టింది. ముద్దు ముద్దు మాటలతో, యాక్టింగ్ తో మెప్పించింది. ఆ సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. చిన్నతనంలోనే పెద్ద పేరు తెచ్చుకుంది.

ఇంటర్ మార్క్స్

యాక్టింగ్ లోనే కాదు చదువులోనూ క్రితిక అదరగొట్టింది. తాజాగా తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో క్రితిక కు వచ్చిన మార్కులు చూసి అందరూ షాక్ అవుతున్నారు. నటనతో సత్తాచాటే ఈ పాప చదువులోనూ ఇంత క్లెవరా? అని అనుకుంటున్నారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన క్రితిక 470కి గాను 459 మార్కులు సాధించడం విశేషం. ఆమెకు టోటల్ పరంగా చూస్తే కేవలం 11 మార్కులు మాత్రమే తక్కువ వచ్చాయి.

ఎంపీసీ

ఇంటర్ లో క్రితిక ఎంపీసీ చదువుతోంది. ఫస్ట్ ఇయర్ లో ఆమెకు ఇంగ్లీష్ లో 100కు 94, ఫిజిక్స్ లో 60కి 60, కెమిస్ట్రీలో 60కి 59, సంస్కృతంలో 100కి 99, మ్యాథ్స్-ఏలో 75కు 73, మ్యాథ్స్-బిలో 75కు 74 మార్కులు వచ్చాయి. ఓవరాల్ గా 470కి గాను 459 మార్కులు సాధించింది. ఈ మార్కుల మెమోను క్రితిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

సినిమాల్లోనూ

ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ స్టార్ మాలో ప్రసారమవుతోంది. సీరియల్ రేటింగ్స్ లో ఈ కార్తీక దీపం 2 దూసుకెళ్తోంది. ఇందులో నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్, గాయత్రి సింహాద్రి, స్వర్ణ, నటకుమారి తదితరులు నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe