...
...
Next Story

Karuppu: ప్రొడ్యూసర్‌కు తెలియకుండానే షో వేసేశారు.. సూర్య మూవీకి పైరసీ ముప్పు.. ఆందోళనలో మేకర్స్

Karuppu: సూర్య, త్రిష నటించిన కరుప్పు మూవీకి మరో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే రిలీజ్ ఆలస్యం కాగా.. ముంబై, పుణెలలోని కొన్ని థియేటర్లలో ప్రొడ్యూసర్ కు తెలియకుండానే షోలు వేసేయడంతో ఇప్పుడు పైరసీ ముప్పు కూడా పొంచి ఉంది.

Published on: May 14, 2026, 21:05:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కరుప్పు' (Karuppu) విడుదల రోజునే ఊహించని వివాదంలో చిక్కుకుంది. గురువారం (మే 14) ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమా షోలు సౌత్ ఇండియాలో ఆకస్మికంగా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అదే సమయంలో ముంబై, పూణే వంటి నగరాల్లో షోలు పడటం ఇప్పుడు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?

Karuppu: ప్రొడ్యూసర్‌కు తెలియకుండానే షో వేసేశారు.. సూర్య మూవీకి పైరసీ ముప్పు.. ఆందోళనలో మేకర్స్
Karuppu: ప్రొడ్యూసర్‌కు తెలియకుండానే షో వేసేశారు.. సూర్య మూవీకి పైరసీ ముప్పు.. ఆందోళనలో మేకర్స్

దాదాపు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'కరుప్పు' మూవీ ఆర్థిక కారణాల వల్ల విడుదల ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో షోలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. కానీ ఉత్తరాదిలోని ముంబై, పూణే, వారణాసి వంటి నగరాల్లో మాత్రం థియేటర్లలో సినిమా ప్రదర్శితమైంది.

అక్కడ సినిమా చూస్తున్న ప్రేక్షకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మేకర్స్ షాక్‌కు గురయ్యారు. ఈ వీడియోలు చూసి చాలామంది ఇవి ఏఐ (AI) సృష్టించినవా అని సందేహించారు. కానీ అవి నిజమైన స్క్రీనింగ్స్ అని తేలింది.

‘క్యూబ్’ పొరపాటే శాపమైందా?

ఈ వ్యవహారంపై డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ఆర్ ప్రభు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో కలిసి అత్యవసరంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. డిజిటల్ సినిమా ప్రొవైడర్ 'క్యూబ్' (Qube) చేసిన టెక్నికల్ పొరపాటే దీనికి కారణమని కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ అనుమతి లేకుండానే సినిమాను ఎలా ప్లే చేస్తారని ప్రశ్నించారు. క్యూబ్ యాజమాన్యం దీనిని 'హ్యూమన్ ఎర్రర్' (మానవ తప్పిదం) గా పేర్కొంది.

"గతంలో దళపతి విజయ్ 'జన నాయగన్' విషయంలోనూ ఎడిటర్ నిర్లక్ష్యం వల్ల పైరసీ జరిగిందని చెప్పారు. ఇప్పుడు క్యూబ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రూ.140 కోట్ల సినిమా బయటకు వచ్చేసింది. దీనివల్ల నిర్మాతకు కలిగే భారీ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి క్యూబ్ సంస్థే పరిహారం చెల్లించాలి" అని కౌన్సిల్ కార్యదర్శి శివ డిమాండ్ చేశారు.

పైరసీ టెన్షన్.. మద్దతుగా నిలిచిన స్టార్స్

దర్శకుడు వెంకట్ ప్రభు కూడా "కరుప్పు సినిమాను థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలి, త్వరలోనే సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు కూడా ఈ చిత్రానికి సరైన రీతిలో విడుదల కావాల్సిన అర్హత ఉందని మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతానికి మే 14న ఆడాల్సిన అన్ని షోలు రద్దయ్యాయి. క్యూబ్ సంస్థ తమ లీగల్ టీమ్‌తో చర్చించి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మరి మే 15 (శుక్రవారం) నుంచైనా థియేటర్లలో సూర్య 'కరుప్పు' గర్జన వినిపిస్తుందో లేదో వేచి చూడాలి. తెలుగులో ఈ మూవీ వీరభద్రుడు పేరుతో రిలీజ్ కావాల్సి ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'కరుప్పు' సినిమా షోలు ఎందుకు రద్దయ్యాయి?

ఆర్థిక సమస్యలు, డిజిటల్ సినిమా ప్రొవైడర్ (Qube) మధ్య తలెత్తిన సాంకేతిక ఇబ్బందుల వల్ల సౌత్ ఇండియాలో షోలు రద్దయ్యాయి.

2. కరుప్పు సినిమా బడ్జెట్ ఎంత?

సూర్య - త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను దాదాపు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

3. కరుప్పు సినిమా మళ్ళీ ఎప్పుడు విడుదల కానుంది?

నిర్మాతలు సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నారు. మే 15 నుంచి షోలు పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe