Karuppu Twitter Review: సూర్య ఈజ్ బ్యాక్.. థియేటర్లలో గర్జిస్తున్న ‘వీరభద్రుడు’.. సూర్య, త్రిష కాంబో హిట్ కొట్టినట్టేనా?
Karuppu Twitter Review: సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాకు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మూవీ ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ కాగా.. నెటిజన్లు ఎక్స్ ద్వారా తమ రివ్యూలు ఇస్తున్నారు.
Karuppu Twitter Review: చివరి నిమిషంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక రోజు ఆలస్యంగా.. అంటే శుక్రవారం (మే 15) థియేటర్లలోకి వచ్చిన 'కరుప్పు' (Karuppu) బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సూర్య, త్రిష కాంబినేషన్‌లో దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు "సూర్య ఈజ్ బ్యాక్" అంటూ రచ్చ చేస్తున్నారు.

టాక్ ఎలా ఉంది?
ఎక్స్ (గతంలో ట్విటర్) రివ్యూల ప్రకారం 'కరుప్పు' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా నిండిపోయిందని ఆడియన్స్ చెబుతున్నారు. తెలుగులో ఈ మూవీ వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజైన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, థియేటర్లలో ఈ సీన్లకు ఈలలు, గోలలతో హోరెత్తిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. టీజర్, ట్రైలర్‌లో చూపించని కొన్ని ఫాంటసీ అంశాలు సినిమాలో సర్ ప్రైజ్ ప్యాకేజీలా ఉన్నాయట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఒక సీన్ దాదాపు 2 నిమిషాల పాటు థియేటర్లను దడదడలాడించిందని ఒక నెటిజన్ పేర్కొన్నారు.
లాయర్‌గా, అలాగే మాస్ లుక్‌లో సూర్య నటన 'పీక్' స్టేజ్‌లో ఉందని రివ్యూలు వస్తున్నాయి. ఆర్జే బాలాజీ తన మేకింగ్‌తో సూర్యను ఎలివేట్ చేసిన తీరు అట్లీ-విజయ్ కాంబినేషన్‌ను గుర్తుచేస్తోందని కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఇక సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) 'రుద్రతాండవం'లా ఉందని, ప్రతి మాస్ సీన్‌ను ఇది మరో లెవల్‌కు తీసుకెళ్లిందని ప్రశంసలు కురుస్తున్నాయి.
"కరుపు (4.25/5). ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా సాగితే, సెకండాఫ్ మాత్రం ప్యూర్ మాస్ డిస్ట్రక్షన్. సూర్య గర్జిస్తున్నాడు. ఆర్జే బాలాజీ రైటింగ్ అదిరిపోయింది. ఇదొక ప్రాపర్ పైసా వసూల్ మూవీ!" అనే ఓ అభిమాని రాశాడు.
కరుప్పు సినిమా విశేషాలు
ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన కరుప్పు సినిమాలో సూర్య, త్రిష కృష్ణన్, యోగి బాబు, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, మమితా బైజులాంటి వాళ్లు నటించారు.
సినిమా విడుదలకు ముందు ఎదురైన అడ్డంకులపై సూర్య స్పందిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. "మా వెంటే ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) ఈ రోజు నుంచి మీ ముందుకు వచ్చింది" అని పోస్టర్లను షేర్ చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కరుప్పు' సినిమాలో సూర్య పాత్ర ఏంటి?
సూర్య ఇందులో ఒక లాయర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన కోర్టులో వాదించడమే కాదు, స్ట్రీట్ ఫైటింగ్ లోనూ కింగ్ అని సినిమా చూపిస్తోంది. అలాగే ఆయన ద్విపాత్రాభినయం (Dual Role) చేసినట్లు రివ్యూల ద్వారా తెలుస్తోంది.
2. త్రిష పాత్ర ఎలా ఉంది?
త్రిష సినిమాలో ఒక ఎమోషనల్ రోల్ పోషించారు. సూర్యతో ఆమె కెమిస్ట్రీ బాగుందని, కథకు ఆమె పాత్ర ఒక డెప్త్ ను ఇచ్చిందని ఆడియన్స్ అంటున్నారు.
3. కరుప్పు సినిమా తెలుగులో అందుబాటులో ఉందా?
అవును.. ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పేరుతో మే 15న విడుదలైంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


