...
...
Next Story

Kavya Anirudh Honeymoon: రాయల్ హనీమూన్‌లో కావ్య మారన్, అనిరుధ్-కళానిధి మారన్ స్పెషల్ ప్రైవేట్ జెట్ VT-SRHలో లగ్జరీ జర్నీ

Kavya Anirudh Honeymoon: చెన్నైలో గ్రాండ్ గా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ అనంతరం కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ లగ్జరీ హనీమూన్ ట్రిప్‌కు వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్‌కు చెందిన ‘VT-SRH’ అల్ట్రా లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో ఈ జంట వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Nov 22, 2026, 18:12:46 IST
Advertisement

Kavya Anirudh Honeymoon: చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకున్న కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి వేడుకలు ముగిసిన వెంటనే ఈ నూతన దంపతులు అత్యంత విలాసవంతమైన హనీమూన్ ట్రిప్‌ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

అల్ట్రా లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో

రాయల్ హనీమూన్‌లో కావ్య మారన్, అనిరుధ్-కళానిధి మారన్ స్పెషల్ ప్రైవేట్ జెట్ VT-SRHలో లగ్జరీ జర్నీ (x/sunpictures)
రాయల్ హనీమూన్‌లో కావ్య మారన్, అనిరుధ్-కళానిధి మారన్ స్పెషల్ ప్రైవేట్ జెట్ VT-SRHలో లగ్జరీ జర్నీ (x/sunpictures)

కొత్త జంట కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ తమ హనీమూన్ కు వెళ్లడానికి లగ్జరీ జెట్ ను వాడారని తెలిసింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కు చెందిన విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌ ఇదేనని టాక్. ‘VT-SRH’ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ ప్రత్యేక విమానంలో కావ్య మారన్, అనిరుధ్ ప్రయాణిస్తున్నారన్న వార్త సినీ, క్రీడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కావ్య మారన్‌కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ జట్టు పేరు కలిసొచ్చేలా ఉన్న ‘VT-SRH’ ప్రైవేట్ జెట్‌లో వీరి ప్రయాణం సాగుతుండటం నెటిజన్ల మధ్య ప్రత్యేక చర్చకు దారితీసింది.

గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్

కావ్య మారన్, అనిరుధ్ వివాహ వేడుకలు మొదటి నుంచీ అత్యంత వైభవంగా జరుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తొలుత గ్రీస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి వేడుకలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.

ఆ తర్వాత చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్‌లో అగ్ర తారలు, రాజకీయ నేతలు సందడి చేశారు. ఇప్పుడు ఆ వేడుకల హడావుడి ముగియగానే, అదే స్థాయి విలాసవంతమైన ఏర్పాట్లతో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయడం వీరి గ్రాండ్ లైఫ్‌స్టైల్‌కు అద్దం పడుతోంది.

కొత్త అధ్యాయంలోకి స్టార్ జోడీ

సంగీత ప్రపంచంలో తిరుగులేని క్రేజ్ ఉన్న అనిరుధ్, వ్యాపార రంగంలో దూసుకుపోతున్న కావ్య మారన్ కలిసి తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అందుకే ఈ జంటకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది.

అప్డేడ్ కోసం వెయిటింగ్

కావ్య మారన్, అనిరుధ్ హనీమూన్, ప్రైవేట్ జెట్ ప్రయాణానికి సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దంపతులు ఎక్కడికి వెళ్లారనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా అధికారికంగా ధ్రువీకరించని ఈ లగ్జరీ హనీమూన్ వార్త మాత్రం ఇప్పుడు నెట్టింట భారీగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks