ఓటీటీలోకి వివాదాల యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మంగ్లీ బూతు పాట గుర్తుందా? వచ్చే వారమే స్ట్రీమింగ్

సంచలనాల నడుమ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలైన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కేడీ ది డెవిల్' ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ధృవ సర్జా, కిచ్చా సుదీప్, సంజయ్ దత్, శిల్పా శెట్టి నటించిన ఈ క్రైమ్ యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ తేదీ, ప్లాట్‌ఫామ్ తదితర పూర్తి వివరాలు మీకోసం.

Published on: May 29, 2026, 14:52:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన కన్నడ మూవీ 'కేడీ ది డెవిల్'. యాక్షన్ స్టార్ ధృవ సర్జా హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సుమారు నెల రోజుల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (Zee5)లో అందుబాటులోకి రానుంది.

ఓటీటీలోకి వివాదాల యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మంగ్లీ బూతు పాట గుర్తుందా? వచ్చే వారమే స్ట్రీమింగ్
ఓటీటీలోకి వివాదాల యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. మంగ్లీ బూతు పాట గుర్తుందా? వచ్చే వారమే స్ట్రీమింగ్

ఓటీటీలోకి కేడీ ది డెవిల్

ఈ విషయాన్ని జీ5 కన్నడ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. "అడుగెడితే దుమ్ము, శ్వాస పీల్చితే రక్తం! డెవిల్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ మొదలైంది.. జూన్ 5 నుంచి కన్నడ జీ5లో కేడీ ది డెవిల్" అనే క్యాప్షన్‌తో ఒక సరికొత్త ట్రైలర్‌ను కూడా పంచుకుంది.

ఆకట్టుకుంటున్న ట్రైలర్

దేశ ప్రధానికి కూడా లేనంత కట్టుదిట్టమైన భద్రత మధ్య 'కాళీ' అనే ఒక పేరుమోసిన క్రిమినల్‌ను పోలీసులు తరలించే వాయిస్‌ఓవర్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అది చూస్తుంటే అతడిని తీసుకెళ్లడం కన్నా, ఒక విజయ యాత్రలా అనిపిస్తుందని చెప్పే డైలాగ్ ఆసక్తిని పెంచుతుంది.

ఆ తర్వాత కాళిదాస అలియాస్ కేడీ ఎంట్రీ ఇస్తాడు. ఒక సామాన్యుడు తన స్థాయికి మించిన భారీ పరిణామాల్లో ఎలా చిక్కుకున్నాడనేది ట్రైలర్ విజువల్స్ సూచిస్తున్నాయి. తనకు అడ్డు వచ్చిన వాళ్లందరినీ కేడీ ఊచకోత కోసే యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ ట్రైలర్ ముగుస్తుంది.

నటీనటులు, బాక్సాఫీస్ కలెక్షన్లు

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఈ పాన్-ఇండియా తరహా ప్రాజెక్టులో ధృవ సర్జా, కిచ్చా సుదీప్, సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య, జిష్షు సేన్‌గుప్తా, నోరా ఫతేహి తదితర భారీ తారాగణం నటించింది. ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 24.19 కోట్లు వసూలు చేసింది.

వివాదాల సుడిగుండంలో కేడీ..

ఈ ఏడాది మార్చిలో విడుదలైన "సర్సే నిన్న సెరగ సర్సే" (హిందీలో సర్కే చునార్ తేరి సర్కే) పాట తీవ్ర వివాదానికి దారి తీసింది. నోరా ఫతేహి, సంజయ్ దత్ లపై చిత్రీకరించిన ఈ పాటకు కన్నడలో దర్శకుడు ప్రేమ్, హిందీలో రకీబ్ ఆలం సాహిత్యం అందించారు. ఈ పాటను మన తెలుగు సింగర్ మంగ్లీ పాడిన విషయం తెలిసిందే.

అయితే ఈ పాటలోని లిరిక్స్ అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నోరా ఫతేహి స్పందిస్తూ.. షూటింగ్ సమయంలో తనకు ఆ పాట అర్థం తెలియదని వివరణ ఇవ్వగా, దర్శకుడు రాసిన కన్నడ లిరిక్స్‌ను మాత్రమే తాను హిందీలోకి అనువదించానని రకీబ్ ఆలం చెప్పుకొచ్చారు.

వివాదం ముదరడంతో యూట్యూబ్‌తో సహా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ పాట హిందీ వెర్షన్‌ను తొలగించారు. అప్పటికే సెన్సార్ బోర్డు (CBFC)తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), హర్యానా, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్లలో దీనిపై ఫిర్యాదులు దాఖలయ్యాయి. చివరకు, ఈ వివాదానికి ముగింపు పలుకుతూ సంజయ్ దత్, నోరా ఫతేహి.. బాలికల విద్యను స్పాన్సర్ చేస్తామని హామీ ఇచ్చారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

కేడీ ది డెవిల్ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో విడుదలవుతోంది?

ఈ సినిమా జూన్ 5 నుంచి జీ5 (Zee5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ చిత్రంలో నటించిన బాలీవుడ్ స్టార్స్ ఎవరు?

ఈ భారీ కన్నడ చిత్రంలో బాలీవుడ్ నుంచి సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు.

నోరా ఫతేహి పాట ఎందుకు వివాదమైంది?

ఈ సినిమాలో నోరా ఫతేహిపై చిత్రీకరించిన "సర్సే నిన్న సెరగ సర్సే" పాటలోని లిరిక్స్ అభ్యంతరకరంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు, మహిళా కమిషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More