Mangli Apology: క్షమించండి.. కావాలని తప్పు చేయలేదు.. మళ్లీ ఇలాంటిది జరగదు.. ఆ లిరిక్స్ ఇప్పుడు మార్చారు: మంగ్లీ వివరణ

Mangli Apology: సింగర్ మంగ్లీ తన బూతుపై మొత్తానికి స్పందించింది. క్షమాపణ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. సరిగా గమనించకపోవడంతో ఇలాంటి తప్పు జరిగిందని, కావాలని చేయలేదని ఆమె అనడం గమనార్హం. అంతేకాదు లిరిక్స్ కూడా మార్చినట్లు చెప్పింది.

Published on: Mar 18, 2026, 19:34:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాపులర్ సింగర్ మంగ్లీ (Mangli) తాను పాడిన ఓ బూతు పాట విషయంలో వచ్చిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తన పాటలోని కొన్ని పదాలు జనాల సెంటిమెంట్స్‌ను హర్ట్ చేయడంతో, వెంటనే రియాక్ట్ అయిన ఆమె సోషల్ మీడియాలో క్షమాపణ చెబుతూ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. మంగ్లీలాంటి సింగర్ సర్కే చునర్ అనే ఓ బూతు పాట ఎలా పాడిందన్న విమర్శల నేపథ్యంలో ఆమె తాజాగా వివరణ ఇచ్చింది. ఇలాంటి తప్పు మళ్లీ జరగదని కూడా ఆమె హామీ ఇచ్చింది.

Mangli Apology: క్షమించండి.. కావాలని తప్పు చేయలేదు.. మళ్లీ ఇలాంటిది జరగదు.. ఆ లిరిక్స్ ఇప్పుడు మార్చారు: మంగ్లీ వివరణ
Mangli Apology: క్షమించండి.. కావాలని తప్పు చేయలేదు.. మళ్లీ ఇలాంటిది జరగదు.. ఆ లిరిక్స్ ఇప్పుడు మార్చారు: మంగ్లీ వివరణ

మంగ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏముందంటే..

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ మంగ్లీ ఇలా రాసుకొచ్చింది. "ప్రజల మనోభావాలను, వాళ్ల సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ.. ఆ సాంగ్‌ను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేశాం. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నేను మీ అందరికీ, ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని చెప్పింది.

ఆమె ఇంకా కొనసాగిస్తూ.. "ఎవరి సెంటిమెంట్స్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. మా వైపు నుంచి జరిగిన ఈ పొరపాటుకు మేం నిజంగా చాలా చింతిస్తున్నాం. ఇప్పుడు ఆ పాట లిరిక్స్‌ను కరెక్ట్ చేసి అప్‌డేట్ చేశాం. ఈరోజు సాయంత్రం ఆ సాంగ్ రివైజ్డ్ వెర్షన్ అఫీషియల్‌గా రిలీజ్ అవుతుంది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదని నేను మీకు పక్కాగా హామీ ఇస్తున్నాను" అని ఆమె చెప్పింది.

అదే సమయంలో ఈ మూవీ మేకర్స్ కు, తనకు ఈ అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యాకు ఆమె థ్యాంక్స్ చెప్పింది.

సర్కే చునర్ సాంగ్ వివాదం

'కేడీ ద డెవిల్' సినిమాలో సంజయ్ దత్, నోరాలపై చిత్రీకరించిన ఈ 'సర్కే చునర్' సాంగ్ నిజానికి కన్నడ పాట. దీన్ని లిరిసిస్ట్ రకీబ్ ఆలం హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. డైరెక్టర్ బలవంతం వల్లే హిందీలో బూతులు వాడానని రీసెంట్‌గా చెప్పిన విషయం తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగులతో ఉన్న ఈ పాటపై సోషల్ మీడియాలో జనాలు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడంతో మేకర్స్ ఆ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించారు.

ఈ వివాదం విషయంలో అందరూ డైరెక్టర్ నే నిందించారు. పాట రాసిన రకీబ్ ఆలమ్, ఇందులో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఇద్దరూ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ బూతు పాటను తాను రాయలేదని, కేవలం ట్రాన్స్‌లేట్ చేశానని రకీబ్ చెప్పాడు. అటు నోరా స్పందిస్తూ.. అసలు హిందీలో తన ఇమేజ్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వలేదని, ఆ లిరిక్స్ దుమారం రేపుతాయని ముందే తాను వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More