Keerthy Suresh Nani: వాడి జడల్‌ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది: నాని జడ లాగిన కీర్తి సురేష్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Keerthy Suresh Nani: నాని ది ప్యారడైజ్ సెట్ లో నుంచి కీర్తి సురేష్ షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న ఆమె.. నాని జడల్ లాగుతూ ఓ ఫన్నీ క్యాప్షన్ తో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేసింది.
Keerthy Suresh Nani: నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్ సమయంలోని ఒక సరదా బిహైండ్ ద సీన్ (BTS) ఫొటోను హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాని జడను పట్టుకుని ఆమె పెట్టిన తెలంగాణ మాండలికపు క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సందడి చేస్తున్న కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
మాస్, నేచురల్ యాక్టర్ నాని, మహానటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ కాంబినేషన్ కు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తాజాగా కీర్తి సురేష్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక ఆసక్తికరమైన స్టోరీ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. నాని రాబోయే ది ప్యారడైజ్ సినిమాలో కీర్తి ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలుసు కదా.
ఈ సాంగ్ షూటింగ్ స్పాట్ లో నాని జడల్ పట్టుకొని లాగుతున్న ఫొటోలను షేర్ చేసింది. దానికి.. "వాడి జడల్ ని ముట్టుకుంటే.. వాడికి సర్రుమంటది" అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో ఇన్‌స్టాంట్ వైరల్ అయింది. మరో ఫొటోలో నాని, కీర్తి షూటింగ్ స్పాట్ లో సరదాగా ముచ్చట్లు ఆడుతూ కనిపించడం చూడొచ్చు.
గతంలో ఇదే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీలో నాని, కీర్తి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీలో ధరణి, వెన్నెల కాంబినేషన్ సూపర్ హిట్ అయి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.
హైదరాబాద్‌లో భారీ సెట్.. 1000 మందితో హంగామా
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో నాని, కీర్తి సురేష్ పై ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఈ పాటలో ఈ ఇద్దరితోపాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులు, డ్యాన్సర్లు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఎనర్జిటిక్ ట్యూన్‌ను సమకూర్చారు. 'దసరా'లో 'చంకీల అంగీలేసి' పాటతో అలరించిన ఈ కాంబో.. ఇప్పుడు మరోసారి థియేటర్లలో ఈనాటి మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ నాని, కీర్తి సురేష్ మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన కీర్తి వివాహ వేడుకకు హాజరైన అతికొద్ది మంది సన్నిహితులలో నాని ఒకరు. వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధం, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించేందుకు కీర్తిని ఒప్పించాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ ది ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.
టాలీవుడ్‌లో కీర్తి సురేష్ జోరు
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సరసన 'రౌడీ జనార్దన' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న జనవరి 12 విడుదల మూవీలోనూ కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


