టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోని థాట్టిల్ మతం గురించి, తమ ప్రేమకథ గురించి మాట్లాడింది. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా' లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన పెళ్లి విషయంలో ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పింది.
కీర్తి సురేష్ పెళ్లిపై..

కీర్తి సురేష్ హిందువు కాగా, ఆమె భర్త ఆంటోని థాట్టిల్ క్రిస్టియన్. వీరి పెళ్లి హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగింది. గతేడాది డిసెంబర్ లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే జగపతి బాబు జీ5 షో జయమ్ము నిశ్చయమ్మురా షోలో పాల్గొన్న ఆమె.. తన పెళ్లి గురించి మాట్లాడింది. ఆంటోనీది వేరే మతం కావడంతో తన ఇంట్లో పెళ్లికి అంగీకరిచరేమో అని మొదట్లో తాను భయపడినట్లు చెప్పింది.
"ఇంట్లో మతపరమైన తేడాల కారణంగా సమస్యలు ఉండవచ్చు అని మేము అనుకున్నాము. నేను నాలుగేళ్ల కిందట ఒక రోజు నాన్నతో మాట్లాడాను. కానీ ఆయన చాలా సులభంగా అంగీకరించారు. నేను ఊహించినట్లుగా ఏమీ జరగలేదు" అని కీర్తి చెప్పింది. ఆమె తండ్రి (నిర్మాత సురేష్ కుమార్) ఈ నిర్ణయాన్ని ఆమోదించడమే కాకుండా సంతోషంతో ఆంటోనికి డ్రింక్ పోసి సెలబ్రేట్ చేసుకున్నారని కూడా తెలిపింది.
15 ఏళ్ల ప్రేమ ప్రయాణం
కీర్తి సురేష్, ఆంటోనీలది హైస్కూల్ లవ్ స్టోరీ. 2010 నుంచి డేటింగ్ లో ఉన్నారు. తమ పెళ్లికి 15 ఏళ్లు ఎందుకు పట్టిందో కూడా ఆమె వివరించింది. "మాకు టైమ్ అవసరమైంది. నేను అప్పటికి కాలేజీ పూర్తి చేయాలి. కెరీర్‌ను ఏర్పరచుకోవాలి. గత 15 సంవత్సరాలలో దాదాపు 5-6 సంవత్సరాలు మేము లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. ఎందుకంటే అతను ఖతార్‌లో, నేను చెన్నైలో ఉన్నాము. అతను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అతనికి సమయం అవసరమైంది. నాది కూడా అదే పరిస్థితి" అని చెప్పింది.
కుక్క పేరు వెనుక సీక్రెట్ ఇదీ..
'మహానటి' విజయం తర్వాత, తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేని సమయంలో ఆంటోని ఆమెకు ఒక కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడని చెప్పింది. "2018లో 'మహానటి' తర్వాత అతను నాకు దానిని బహుమతిగా ఇచ్చాడు. నేను అప్పుడు మా సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయాను. కానీ మా ప్రేమను గౌరవించుకోవాలనుకున్నాను. అందుకే నేను ఆ కుక్కకు నైక్ అని పేరు పెట్టాను. అది ఆంటోని (Anto-NY) లోని 'Ny', కీర్తి (KE-erthy) లోని 'Ke' నుండి వచ్చింది" అని చిరునవ్వుతో చెప్పింది.
{{/usCountry}}'మహానటి' విజయం తర్వాత, తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేని సమయంలో ఆంటోని ఆమెకు ఒక కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడని చెప్పింది. "2018లో 'మహానటి' తర్వాత అతను నాకు దానిని బహుమతిగా ఇచ్చాడు. నేను అప్పుడు మా సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయాను. కానీ మా ప్రేమను గౌరవించుకోవాలనుకున్నాను. అందుకే నేను ఆ కుక్కకు నైక్ అని పేరు పెట్టాను. అది ఆంటోని (Anto-NY) లోని 'Ny', కీర్తి (KE-erthy) లోని 'Ke' నుండి వచ్చింది" అని చిరునవ్వుతో చెప్పింది.
{{/usCountry}}