మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మరోసారి మాస్ యాక్షన్ అవతార్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె నటించిన రివాల్వర్ రీటా మూవీ ట్రైలర్ గురువారం (నవంబర్ 13) రిలీజైంది. ఈ మూవీలో సునీల్ కూడా విలన్ గా తిరిగి వస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఆసక్తికరంగా ఉండబతోంది.
రివాల్వర్ రీటా ట్రైలర్

చాలా రోజులుగా ఊరిస్తున్న మూవీ రివాల్వర్ రీటా. కీర్తి సురేష్ ఈ టైటిల్ రోల్ పోషిస్తోంది. మూవీ ఓ మాంచి కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ ట్రైలర్ మొదట్లోనే విలన్ తండ్రి కిడ్నాప్ కావడం, అతన్ని రీటానే ఎత్తుకెళ్లడం, తర్వాత ఆమె ఇంట్లోనే అతడు చనిపోవడం, ఆ విషయం తెలిస్తే తమ పరిస్థితి ఏమవుతుందో అని వాళ్లు భయపడటం, తన ఇంట్లో వాళ్లను కాపాడటానికి రివాల్వర్ రీటా బయలుదేరడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. 2 నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపేలా సాగింది. కీర్తి యాక్షన్, సునీల్ విలనిజం ఇందులో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతోంది అన్నది థియేటర్లలో చూడాలి.
రివాల్వర్ రీటా మూవీ గురించి..
కీర్తి సురేష్ గతేడాది చివర్లో బేబీ జాన్, ఈ ఏడాది నేరుగా ప్రైమ్ వీడియోలో రిలీజైన ఉప్పు కప్పురంబు సినిమాల్లో నటించినా.. ఈ రెండూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడీ రివాల్వర్ రీటాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాను జేకే చంద్రు డైరెక్ట్ చేశాడు. ఇందులో కీర్తి సురేష్, సునీల్ తోపాటు రాధిక, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్‌లే, జాన్ విజయ్ లాంటి వాళ్లు నటించారు. ఇదొక క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన సినిమా.
చాలా రోజులుగా మూవీ పెండింగ్ లో ఉంది. మొత్తానికి నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. దానికి రెండు వారాల ముందే ట్రైలర్ రిలీజ్ చేసి మూవీపై ఆసక్తిని పెంచారు. తమిళంతోపాటు తెలుగులోనూ మూవీ రిలీజ్ కానుంది. సుమారు ఏడాది తర్వాత కీర్తి సురేష్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది.
{{/usCountry}}చాలా రోజులుగా మూవీ పెండింగ్ లో ఉంది. మొత్తానికి నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. దానికి రెండు వారాల ముందే ట్రైలర్ రిలీజ్ చేసి మూవీపై ఆసక్తిని పెంచారు. తమిళంతోపాటు తెలుగులోనూ మూవీ రిలీజ్ కానుంది. సుమారు ఏడాది తర్వాత కీర్తి సురేష్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది.
{{/usCountry}}