Keerthy Suresh: దక్షిణాది చిత్రసీమలో తనదైన నటన, పద్ధతిగల పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). సాధారణంగా ప్రయాణాల్లో అభిమానులతో చాలా సరదాగా ముచ్చటించే ఈ బ్యూటీకి తాజాగా ఒక విమాన ప్రయాణంలో అనూహ్యమైన, తీవ్ర ఇబ్బందికరమైన ఘటన ఎదురైంది.

ఇటలీలోని మిలాన్ నగరం నుంచి ఇండియాకు తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఒక తాగుబోతు అభిమాని చేసిన హంగామా వల్ల కీర్తి సురేష్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ చేదు అనుభవాన్ని బయటపెడుతూ అసలు ఏం జరిగిందో వివరంగా పంచుకున్నారు. సెలబ్రిటీలైనా సరే ప్రైవసీని గౌరవించాలని, అభిమానం పేరిట హద్దులు దాటితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు.
అసలు మిలాన్ ఫ్లైట్లో ఏం జరిగింది?
కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) తో కలిసి మిలాన్ నుంచి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో ఆంటోనీ ఆమె పక్క సీటులోనే కూర్చుని ఉన్నారు. ప్రయాణం మధ్యలో తీవ్ర మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి సరిగ్గా నిలబడలేని స్థితిలో కీర్తి సురేష్ దగ్గరకు వచ్చాడు. నేరుగా ఆమె ముందుకు వచ్చి వెంటనే తనతో సెల్ఫీ దిగాలని పట్టుబట్టాడు.
ఆ సమయంలో అతను ఉన్న స్థితిని చూసి కీర్తి సురేష్ ఎంతో ఓర్పుగా స్పందిస్తూ.. "దయచేసి కొద్దిసేపు ఆగండి, మనం తర్వాత ఫొటో దిగుదాం" అని సున్నితంగా తిరస్కరించింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆమె మాటలను అసలు పట్టించుకోకుండా, "ఇప్పుడే సెల్ఫీ దిగాలి, దానికి ఏమైంది?" అంటూ ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు.
"నా తరఫున నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు!"
అభిమాని ప్రవర్తన హద్దులు దాటడంతో కీర్తి సురేష్ గట్టిగానే స్పందించాల్సి వచ్చింది. "నా ఫొటో ఎప్పుడు దిగాలో, నా తరఫున నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు" అని స్పష్టమైన స్వరంతో అతనికి వార్నింగ్ ఇచ్చారు.
{{/usCountry}}అభిమాని ప్రవర్తన హద్దులు దాటడంతో కీర్తి సురేష్ గట్టిగానే స్పందించాల్సి వచ్చింది. "నా ఫొటో ఎప్పుడు దిగాలో, నా తరఫున నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు" అని స్పష్టమైన స్వరంతో అతనికి వార్నింగ్ ఇచ్చారు.
{{/usCountry}}అయినా ఆ వ్యక్తి వెనక్కి తగ్గకపోవడంతో సీన్లో ఉన్న కీర్తి భర్త ఆంటోనీ తట్టిల్ రంగంలోకి దిగారు. సాధారణంగా అభిమానుల పట్ల ఎంతో మృదువుగా, శాంతంగా ఉండే ఆంటోనీ.. మొదటిసారి గొంతు పెంచి ఆ తాగుబోతు వ్యక్తిని తీవ్రంగా నిలదీశారు. మొదటిసారి తన భర్త అంత కోపంతో అరవడం చూశానని కీర్తి తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండటంతో చివరికి విమాన సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని అక్కడ నుంచి పంపించివేశారు.
"అభిమానాన్ని గౌరవిస్తాం.. కానీ ప్రైవసీ ముఖ్యం!"
ఈ ఘటనపై కీర్తి సురేష్ మాట్లాడూతూ.. సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలనుకోవడంలో తప్పులేదని, కానీ వారి వ్యక్తిగత స్వేచ్ఛను, పరిధిని ప్రతీ ఒక్కరూ గౌరవించాలని చెప్పారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారని, కొందరైతే ఫొటో కూడా అడగకుండా ప్రయాణమంతా చక్కగా కబుర్లు చెబుతుంటారని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ ఇలా మత్తులో వచ్చి హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందని స్పష్టం చేశారు.