Keerthy Suresh OTT: ఓటీటీలు ఎందుకన్నారు.. రెండు పడవల ప్రయాణం.. వెబ్ సిరీస్ ఎంట్రీపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్!

Keerthy Suresh OTT: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తొలిసారిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ‘అక్క’ సిరీస్‌తో ఆమె ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓటీటీలో నటించొద్దని కొందరు తనకు సలహా ఇచ్చారని కీర్తి సంచలన విషయాలు వెల్లడించారు.

Published on: Oct 27, 2026, 10:30:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Keerthy Suresh OTT: దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో కీర్తి సురేష్ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘అక్క’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. మహిళల చేతుల్లో నడిచే ‘పెర్నూరు’ అనే పట్టణం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నేర సామ్రాజ్యాన్ని శాసించే ముగ్గురు సోదరీమణుల్లో ఒకరైన 'భవానీ' అనే పవర్‌ఫుల్ అక్క పాత్రలో కీర్తి కనిపించనున్నారు.

ఓటీటీలు ఎందుకన్నారు.. రెండు పడవల ప్రయాణం.. వెబ్ సిరీస్ ఎంట్రీపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్!
ఓటీటీలు ఎందుకన్నారు.. రెండు పడవల ప్రయాణం.. వెబ్ సిరీస్ ఎంట్రీపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్!

భవానీ క్యారెక్టర్

అక్క వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "సాధారణంగా గ్యాంగ్‌స్టర్ అనగానే మనకు ఒక మాస్ ఇమేజ్, రక్తపాతం గుర్తొస్తాయి. కానీ ఈ సిరీస్‌లో భవానీ క్యారెక్టర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. హత్యలు చేయడం కంటే.. ఒక నాయకత్వ లక్షణంతో రాజసం ఉట్టిపడేలా నా పాత్ర సాగుతుంది. ఈ వైవిధ్యమైన ఎనర్జీని అర్థం చేసుకోవడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.

భాష ముఖ్యం కాదు

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడు హిందీ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టారు. అయితే భాష అనేది తనకు అడ్డంకి కాదని ఆమె స్పష్టం చేశారు. "నేను హిందీలో ఏం చేశాను, ఏం చేయలేదు అని ఆలోచించట్లేదు. ఒక ప్రాజెక్ట్ నాకు ఎంత ఆసక్తిని కలిగిస్తుంది అనేదే ముఖ్యం.

నాకు నచ్చిన కథ తెలుగులో వచ్చినా, తమిళంలో వచ్చినా కచ్చితంగా చేస్తాను. ఇక్కడ భాష అనేది రెండో అంశం మాత్రమే. నేను మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలను ప్రయత్నించాలని మాత్రమే కోరుకుంటున్నాను" అని కీర్తి వివరించారు.

ఓటీటీ ఎందుకన్నారు!

ఓటీటీలో నటించడంపై తనకెదురైన అనుభవాలను కూడా 34 ఏళ్ల కీర్తి సురేష్ పంచుకున్నారు. "నేను కేవలం థియేట్రికల్ స్టార్‌నని, ఓటీటీ షోలు చేయొద్దని చాలా మంది చెప్పారు. కానీ నేను వారి మాటలు పట్టించుకోలేదు" అని నవ్వుతూ కీర్తి సమాధానమిచ్చారు.

కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, సినిమాకు వెబ్ సిరీస్‌లు ఏమాత్రం తీసిపోవని ఆమె అభిప్రాయపడ్డారు. థియేటర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండు పడవల ప్రయాణంలాంటివేనని.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ, నటిగా అన్ని రకాల ప్రాజెక్టులు చేయడం తనకు ఇష్టమని కీర్తి స్పష్టం చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ‘అక్క’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వైష్ణవ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘అక్క’ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు టాలెంటెడ్ నటి రాధికా ఆప్టే మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు తన్వి అజ్మీ, మహేష్ మంజ్రేకర్, అన్షుమాన్ పుష్కర్, మోనికా పన్వార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More