Crime Thriller OTT: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేష్ విశ్వరూపం- ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్-టీజర్ వేరే లెవల్!
Keerthy Suresh OTT: మహానటిలో సావిత్రిలా కన్నీళ్లు పెట్టించిన కీర్తి సురేష్ గతంలో ఎప్పుడూ చూడనంత పవర్ ఫుల్ గా మారిపోయింది. ఓటీటీ సిరీస్ కోసం డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఇవాళ మేకర్స్ ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. ఇది వేరే లెవల్ లో ఉందనే కామెంట్లు వస్తున్నాయి.
Keerthy Suresh Crime Thriller OTT: మహానటి కీర్తి సురేష్ వెండితెరపైనే కాకుండా ఇప్పుడు డిజిటల్ దునియాను కూడా ఏలేందుకు సిద్ధమైంది. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ (YRF Entertainment) నిర్మించిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘అక్క’ (Akka) సిరీస్ ద్వారా కీర్తి సురేష్ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇవాళ (అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సిరీస్ అఫీషియల్ టీజర్‌ను విడుదల చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా లాక్ చేశారు.

అక్క వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
ఈ కథ 1980ల నాటి నేపథ్యంలో సాగుతుంది. సౌత్ ఇండియాలోని ‘పెర్నూరు’ (Pernuru) అనే ఒక నగరంలో మహిళలదే పైచేయి. అక్కడ 800 ఏళ్లుగా స్త్రీల పాలనే నడుస్తుంది. ఆ సామ్రాజ్యాన్ని ఏలే లేడీ గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ కథే ఈ ‘అక్క’. ఇందులో కీర్తి సురేష్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా నటించింది.
అయితే, ఎంతో పవర్‌ఫుల్‌గా సాగుతున్న వీరి రౌడీయిజం, ఒక అవుట్‌సైడర్ రాకతో ఒక్కసారిగా ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత ఈ సిస్టర్‌హుడ్‌ను కాపాడుకోవడానికి వారు ఎలాంటి హింసాత్మక పోరాటం చేశారు? మనుగడ కోసం వారు చేసిన యుద్ధం ఏంటి? అనేదే ఈ అక్క వెబ్ సిరీస్ స్టోరీ.
టీజర్ అదుర్స్
కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఇవాళ రిలీజ్ చేసిన టీజర్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే ఇదొక ఓల్డ్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సాంప్రదాయ దుస్తుల్లో ఉంటూనే మహిళలు కత్తులు, తుపాకులు పట్టి వేటాడే విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి.
ఇప్పటివరకు సౌత్ ఇండియాలో పురుషుల నేపథ్యంలోనే ఎన్నో గ్యాంగ్‌స్టర్ డ్రామాలు వచ్చాయి, కానీ పూర్తిగా మహిళల ఆధిపత్యం, వారి గ్యాంగ్ వార్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సరికొత్త ప్రయత్నం ఇది. టీజర్లో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌పై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.
భవానీగా కీర్తి సురేష్
అక్క వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ ‘భవానీ’ అనే పవర్ఫుల్ లేడీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఊరమాస్ లుక్‌లో కనిపించింది. తన కెరీర్లోనే ఎప్పుడూ లేనంత రఫ్‌గా, యాక్షన్ సీన్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించింది. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ వెర్సటైల్ నటి రాధికా ఆప్టే ‘రుద్ర’గా పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య జరిగే మైండ్ గేమ్స్, ఫైట్స్ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీరితో పాటు సీనియర్ నటి తన్వీ అజ్మీ కీలక పాత్రలో నటిస్తోంది.
డెబ్యూ డైరెక్టర్
ఈ వెబ్ సిరీస్ ద్వారా ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 1980ల నాటి వాతావరణాన్ని, కలర్ గ్రేడింగ్‌ను స్క్రీన్‌పై చాలా నేచురల్‌గా ఆవిష్కరించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ అనుబంధ సంస్థ వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్‌తో దీనిని నిర్మించింది. ఆదిత్య చోప్రా ఈ ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ఊరమాస్ పర్ఫార్మెన్స్ చూడాలనుకునే యాక్షన్ ప్రియులకు ఈ అక్క సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్. దసరా, దీపావళి పండుగల కానుకగా ఈ హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


