Malayalam OTT: వారణాసి విలన్ మూవీ రికార్డు..ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి మలయాళ బిగ్ క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Malayalam OTT: మలయాళ స్టార్ హీరో, వారణాసి మూవీలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ‘ఖలీఫా’ మూవీ ఏకంగా ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి రాబోతుంది. మరి ఈ సినిమా ఏయే ఓటీటీల్లోకి వస్తుందో చూసేయండి. 

Published on: Oct 6, 2026, 12:54:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Malayalam OTT: మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం 'ఖలీఫా' (Khalifa) ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేవలం ఒకటి లేదా రెండు కాకుండా, ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.

వారణాసి విలన్ మూవీ రికార్డు..ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి మలయాళ బిగ్ క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే? (x/SonyMusicSouth)
వారణాసి విలన్ మూవీ రికార్డు..ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి మలయాళ బిగ్ క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే? (x/SonyMusicSouth)

ఖలీఫా థియేటర్ రెస్పాన్స్

'పులిమురుగన్', 'పోకిరి రాజా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు వైశాఖ్ ఈ ఖలీఫా సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి రెడీ అయింది.

ఆరు ఓటీటీల్లో

ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖలీఫా ఒకే సారి ఆరు ఓటీటీల్లోకి రానుంది. అక్టోబర్ 9 నుంచి ఆరు ప్లాట్‌ఫామ్‌లలో గ్రాండ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ మూవీ ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (Aha), మనోరమ మ్యాక్స్ (ManoramaMAX), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) లలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

వీటితో పాటు విదేశాల్లోని ఆడియన్స్ కోసం స్టార్జ్ ప్లే (STARZPLAY), సింప్లీ సౌత్ (Simply South) లలో ఖలీఫా మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ వ్యూహాత్మక విడుదల వల్ల సినిమాకు వివిధ ప్రాంతాలలో భారీ రీచ్ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

స్పెషల్ క్యామియోలు

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రాలలో 'ఖలీఫా' ఒకటి. ఈ సినిమాలో మాళవిక శర్మ, శమ్మి తిలకన్, ఇంద్రన్స్, సురేష్ ఒబెరాయ్, రెంజీ పానికర్‌, మోహిని వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. వీరికి తోడుగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, యంగ్ హీరో టోవినో థామస్ క్యామియోలో మెరిశారు.

ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, జిను వి. అబ్రహం కథను అందిస్తూ 'జిను అబ్రహం ఇన్నోవేషన్స్' బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. థియేటర్లలో ఈ యాక్షన్ డ్రామాను మిస్ అయిన వారు అక్టోబర్ 9 నుంచి తమకు నచ్చిన ఓటీటీ యాప్‌లలో హ్యాపీగా చూసేయొచ్చు.

మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి మూవీలో కుంభ అనే విలన్ రోల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ బాబు హీరో.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More