కేజీఎఫ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన నటుడు హరీష్ రాయ్. 35 ఏళ్లుగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. గురువారం (నవంబర్ 6) బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కొన్నేళ్లుగా అతడు థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.
హరీష్ రాయ్ కన్నుమూత

కేజీఎఫ్, ఓం సినిమాలతో బాగా పేరు సంపాదించిన నటుడు హరీష్ రాయ్ గురువారం తుది శ్వాస విడిచాడు. బెంగళూరులోని కిడ్వాయ్ ఆంకాలజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. హాస్పిటల్లో అతడు చివరి చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్నేళ్లుగా హరీష్.. థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.
చాలా రోజుల కిందటే అతడు తన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి దిగజారడంపై మాట్లాడాడు. అతనికి కేజీఎఫ్ స్టార్ యశ్ సహా అనేక మంది చికిత్స కోసం సాయం కూడా చేశారు. థైరాయిడ్ క్యాన్సర్ కాస్తా అతని పొట్ట భాగానికి కూడా పాకడంతో అతడు కోలుకోలేకపోయాడు.
అభిమానుల సాయం కూడా కోరుతూ..
హరీష్ రాయ్ తన క్యాన్సర్ చికిత్స కారణంగా ఆర్థికంగా చితికిపోయాడు. అంతేకాకుండా ఈ చికిత్స మరీ ఖరీదైనదిగా మారడంతో అతడు అభిమానుల సాయం కూడా కోరాడు. ఒక్కో ఇంజెక్షన్ రూ.3 లక్షలు విలువైనదని, ఇలా 63 రోజుల వ్యవధిలో 3 ఇంజెక్షన్లు తీసుకోవాలని, దీనికే రూ.10 లక్షలు అవుతుందని అతడు గతంలో వెల్లడించాడు. మొత్తంగా అతని క్యాన్సర్ చికిత్సకు రూ.70 లక్షల వరకు ఖర్చయినట్లు కూడా సమాచారం.
అతడు ఆర్థిక సాయం కోరడంతో ఎంతో మంది సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయినా అతడు క్యాన్సర్ మహమ్మారిని జయించలేకపోయాడు. హరీష్ 1990లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఓం, నల్లా, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీతా, కేజీఎఫ్ సినిమాలతో అతడు బాగా పాపులర్ అయ్యాడు. హరీష్ మృతికి కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
{{/usCountry}}అతడు ఆర్థిక సాయం కోరడంతో ఎంతో మంది సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయినా అతడు క్యాన్సర్ మహమ్మారిని జయించలేకపోయాడు. హరీష్ 1990లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఓం, నల్లా, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీతా, కేజీఎఫ్ సినిమాలతో అతడు బాగా పాపులర్ అయ్యాడు. హరీష్ మృతికి కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
{{/usCountry}}