Khalifa Twitter review: ఓనం రేసులో దిగిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 20న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మొదటి ఆట నుంచే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. 'పులిమురుగన్' ఫేమ్ డైరెక్టర్ వైశాఖ్ కాంబోలో వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
నిరాశ పరిచిన రోటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే

ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారం.. 'ఖలీఫా' కథలో ఎలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడమే సినిమాకి పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. కేరళ పొలిటికల్ పార్టీ గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ చాలా ఊహించదగినదిగా సాగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మొదటి 40 నిమిషాలు కథలోకి వెళ్లడానికే టైమ్ తీసుకున్నారని, ఫైట్ సీక్వెన్సెస్ ఫర్వాలేదనిపించేలా ఉన్నప్పటికీ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ ఫ్లాప్‌గా మారిందని అభిమానులు పెదవి విరుస్తున్నారు. పృథ్వీరాజ్ మాస్ అండ్ స్టైలిష్ లుక్ మినహా సినిమాలో పెద్దగా మెప్పించే ఎలిమెంట్స్ ఏవీ లేవని ఎక్స్ లో రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు.
జేక్స్ బిజోయ్ బీజీఎం తేలిపోయిందా?
సాధారణంగా మలయాళ యాక్షన్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కానీ 'ఖలీఫా' విషయంలో జేక్స్ వర్క్ కూడా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు రావడం గమనార్హం.
విలన్‌గా నటించిన నటుడి రోల్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయిందని, అంచనాలు రీచ్ అవ్వడంలో డైరెక్టర్ వైశాఖ్ ఫెయిల్ అయ్యారని నెటిజన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 'పోక్కిరి రాజా', 'పులిమురుగన్' లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన వైశాఖ్ నుంచి ఇలాంటి రోటీన్ డ్రామా వస్తుందని ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు.
'యానిమల్' టైప్ క్లైమాక్స్, ఊహించని క్యామియోలు
ఈ నెగెటివ్ టాక్ మధ్యలో కూడా ఒకే ఒక్క ఎలిమెంట్ థియేటర్లను షేక్ చేస్తోంది. సెకండాఫ్, క్లైమాక్స్‌లో వచ్చే 3 బిగ్ క్యామియోలు ప్రేక్షకులకు క్రేజీ కిక్ ఇచ్చాయి.
{{/usCountry}}ఈ నెగెటివ్ టాక్ మధ్యలో కూడా ఒకే ఒక్క ఎలిమెంట్ థియేటర్లను షేక్ చేస్తోంది. సెకండాఫ్, క్లైమాక్స్‌లో వచ్చే 3 బిగ్ క్యామియోలు ప్రేక్షకులకు క్రేజీ కిక్ ఇచ్చాయి.
{{/usCountry}}ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ హిట్ 'యానిమల్' రేంజ్‌లో ఉండే ఎండ్ క్రెడిట్ టెయిల్-ఎండ్ సీక్వెన్స్ థియేటర్లలో రచ్చ లేపిందని కొందరు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్ ఇచ్చిన మాస్ ఎంట్రీ, ఆయన ప్రెజెన్స్ ఆడియెన్స్‌కి పూనకాలు తెప్పించిందని పేర్కొన్నారు.
సెకండ్ పార్ట్ లీడ్.. బాక్సాఫీస్ వద్ద నిలబడేనా?
జీను వి అబ్రహం రాసిన కథతో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌కి మొదటి పార్ట్‌లోనే ప్రాపర్ రెస్పాన్స్ రాకపోవడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. 'సలార్', 'ఆడు జీవితం' లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత పృథ్వీరాజ్ నటించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై నార్త్, సౌత్‌లో విపరీతమైన హైప్ నెలకొంది.
ఓనం పండుగ హాలిడే సీజన్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ, మొదటి రోజు వచ్చిన ఈ నిరాశ పరిచే టాక్‌ను దాటుకుని 'ఖలీఫా' బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి.