Khushbu Daughter: ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అనిల్ కపూర్.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు స్టార్లు

Khushbu Daughter: నలుగురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. గోవాలో జరిగిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ కూతురు అవంతిక పెళ్లికి హాజరైన ఈ స్టార్లు కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అవి నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 26, 2026, 13:45:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Khushbu Daughter: సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహం గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవడంతో గోవా వెడ్డింగ్ ఒక స్టార్లతో కూడిన ఈవెంట్ గా మారిపోయింది.

Khushbu Daughter: ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అనిల్ కపూర్.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు స్టార్లు
Khushbu Daughter: ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అనిల్ కపూర్.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు స్టార్లు

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయడంతో ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

సౌత్ ఇండియన్ లుక్‌లో బాలీవుడ్ స్టార్స్..

మొదట ఈ వివాహాన్ని కేవలం క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మధ్య చాలా సింపుల్‌గా ప్లాన్ చేయాలని అనుకున్నప్పటికీ.. చివరకు ఇండియన్ సినీ పరిశ్రమలోని పెద్దలంతా తరలిరావడంతో ఘనంగా ముగిసింది.

ఈ రాయల్ వెడ్డింగ్ కోసం పూర్తిగా 'బీజ్ అండ్ గోల్డ్' కలర్ థీమ్‌ను ఫిక్స్ చేశారు. పెళ్లికి వచ్చిన గెస్ట్‌లంతా సాంప్రదాయ పట్టు వస్త్రాలలో మెరిసిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ యాక్టర్స్ అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లుక్ ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

వీరిద్దరూ పక్కా సౌత్ ఇండియన్ స్టైల్‌లో తెల్లటి పంచె, కండువా ధరించి పెళ్లి వేడుకల్లో తిరుగుతూ అందరినీ పలకరించారు. అనిల్ కపూర్ ఆల్-వైట్ ఎత్నిక్ వేర్‌లో హైలైట్ అవ్వగా.. కింగ్ నాగార్జున తన మార్క్ స్టైలిష్ టీల్ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు.

చిరంజీవి పక్కన కూర్చుని ముచ్చటించిన త్రిష..

సోషల్ మీడియాలో లీకైన ఒక క్రేజీ వీడియోలో సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ మొదటి వరుసలో కూర్చుని మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖతో చాలా హ్యాపీగా ముచ్చటిస్తూ కనిపించింది. చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న రాబోయే సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర' సినిమా షూటింగ్ అనుభవాన్ని వారు షేర్ చేసుకుంటున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో సి. జోసెఫ్ విజయ్ ఈ పెళ్లి వేడుకకు రాలేకపోయారు. బిజీ పొలిటికల్ షెడ్యూల్స్, అసెంబ్లీ వ్యవహారాల వల్ల విజయ్ గోవా వెడ్డింగ్‌ను స్కిప్ చేసినట్లు తెలుస్తోంది.

మోదీకి కూడా ఆహ్వానం.. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్

ఖుష్బూ సుందర్, డైరెక్టర్ సుందర్ సి గత నెలలోనే ప్రత్యేకంగా న్యూ ఢిల్లీ వెళ్లి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ కుమార్తె పెళ్లి పత్రికను అందించారు. ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఆశీర్వాదాలు తమ ఫ్యామిలీకి దక్కడం గర్వంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు.

ఈ పెళ్లి గురించి ఖుష్బూ మాట్లాడుతూ.. ఇది ప్యూర్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని స్పష్టం చేశారు. చెన్నైకి చెందిన వరుడు శ్రవణ్ శ్రీనివాసన్ మర్చంట్ నేవీలో ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నారని, ఇరు కుటుంబాల సమ్మతితోనే ఈ వివాహం జరిగిందని చెప్పారు.

తమ్ముడు విజయ్ ఇంటికి వెళ్లి మరీ..

పెళ్లికి కొన్ని రోజుల ముందు ఖుష్బూ తాను 'తంబి' (తమ్ముడు) అని ప్రేమగా పిలుచుకునే తమిళనాడు సీఎం విజయ్ నివాసానికి వెళ్లి పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు. విజయ్‌ను కలిసిన హ్యాపీ మూమెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ ఖుష్బూ ఇన్ స్టాగ్రామ్‌లో ఒక పెద్ద ఎమోషనల్ నోట్ రాశారు.

సీఎం విజయ్ అంత బిజీ షెడ్యూల్‌లోనూ తమను ఎంతో ఆప్యాయంగా, తన ట్రేడ్‌మార్క్ స్మైల్‌తో వెల్‌కమ్ చెప్పారని కొనియాడారు. తన కుమార్తెలు అవంతిక, ఆనందితతో పాటు కాబోయే అల్లుడు శ్రవణ్ కూడా విజయ్ పర్సనాలిటీ చూసి ఫిదా అయిపోయారని పోస్ట్‌లో పేర్కొన్నారు.

2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఖుష్బూ-సుందర్ సి జోడీకి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోవా బీచ్ రిసార్ట్ లో జరిగిన ఈ రాయల్ వెడ్డింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More