Kiara Advani Birthday: భార్య కియారాకు సిద్ధార్థ్ స్వీట్ బర్త్‌డే విషెస్.. టాక్సిక్ బోల్డ్ సీన్స్ గుర్తుచేస్తూ కామెంట్స్
Kiara Advani Birthday: కియారా అద్వానీ బర్త్‌డే వేళ ఆమె భర్త, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా టాక్సిక్ లోని తబాహి సాంగ్ ను కొందరు గుర్తు చేస్తూ ట్రోల్ చేయగా.. అభిమానులు ఆ జంటకు అండగా నిలిచారు.
Kiara Advani Birthday: రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'టాక్సిక్' సినిమాలోని 'తబాహి' సాంగ్ రిలీజైనప్పటి నుంచి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. పాటలో కియారా చేసిన బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ కారణంగా ఆమెపై కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. హద్దులు దాటిన ఈ వేధింపులు ఇప్పుడు ఆమె భర్త, స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వరకు పాకాయి.

కియారాకు క్యూట్ విషెస్
ఇటీవలే ఒక పాపకు జన్మనిచ్చి పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందిన ఈ క్యూట్ కపుల్‌పై కొందరు నెటిజన్లు హద్దుమీరి కామెంట్లు చేస్తుండటంతో ఇంటర్నెట్‌లోని సినిమా లవర్స్, ఫ్యాన్స్ కియారా-సిద్ధార్థ్ జంటకు మద్దతుగా నిలిచారు.
జులై 31న కియారా 33వ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్వీట్ పోస్ట్ షేర్ చేశారు. "నా ఐస్ క్రీమ్‌ను దొంగిలించినా సరే.. నా ప్రతి రోజునూ తీపిగా మార్చే వ్యక్తికి హ్యాపీ బర్త్ డే" అంటూ కియారా పింక్ కలర్ సల్వార్‌లో ఐస్ క్రీమ్ తింటున్న పిక్‌ను పోస్ట్ చేశారు.
అయితే ఈ ప్యూర్ బర్త్ డే పోస్ట్ కామెంట్ బాక్స్‌లో కొందరు నెటిజన్లు అత్యంత నీచమైన రీతిలో స్పందించారు. 'టాక్సిక్' సినిమాలో యశ్‌తో కియారా చేసిన బోల్డ్ సీన్స్ ఫోటోలు, జిఫ్‌లను కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తూ సిద్ధార్థ్‌ను గేలిచేసే ప్రయత్నం చేశారు. భార్య వేరే హీరోతో కలిసి అలాంటి సీన్స్ చేస్తుంటే ఎలా సపోర్ట్ చేస్తావంటూ అసభ్యకరంగా విమర్శలు గుప్పించారు.
"మగవారికో న్యాయం.. ఆడవారికో న్యాయమా?" - నెటిజన్ల ఫైర్!
ఈ రకమైన వేధింపులను చూసి తట్టుకోలేని ఫ్యాన్స్.. రెడిట్ (Reddit) యూజర్లు ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు. "సినిమాల్లో హీరోలు ఇలాంటి బోల్డ్ సీన్స్ చేస్తే కబీర్ సింగ్ అంటూ నెత్తికెత్తుకునే వీళ్లు, ఒక హీరోయిన్ ప్రొఫెషనల్‌గా యాక్ట్ చేస్తే మాత్రం ఇంత నీచంగా మాట్లాడతారా?" అంటూ మండిపడ్డారు.
ఇదే సినిమాలో నటిస్తున్న యశ్ కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని, కానీ కేవలం కియారాను మాత్రమే టార్గెట్ చేసి ట్రోల్ చేయడం నెటిజన్ల ద్వంద్వ నీతికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా తన భార్య కెరీర్‌కు, ప్రొఫెషనల్ నిర్ణయాలకు పూర్తి సపోర్ట్ ఇస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి మైండ్‌సెట్ చూపుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా
కేజీఎఫ్ (KGF) సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో 'టాక్సిక్' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీతో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి ఐదుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు.
'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఒకవైపు ట్రోలింగ్ నడుస్తున్నప్పటికీ, 'తబాహి' పాటలోని కియారా-యశ్ కెమిస్ట్రీకి, విజువల్స్‌కి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. కియారా-సిద్ధార్థ్ జంటకు మద్దతుగా వస్తున్న వాయిస్ సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


