...
...
Next Story

తల్లయిన తర్వాత తొలిసారి బయట కనిపించిన కియారా.. ఆమె అందం మరింత పెరిగిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ డెలివరీ తర్వాత తొలిసారి పబ్లిగ్గా కనిపించింది. ఆమెను చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె ఇంత ఫిట్‌గా ఎలా ఉందంటూ వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

Published on: Dec 8, 2025, 20:59:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారా అద్వానీ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. తన ముద్దుల కుమార్తె సారాయా మల్హోత్రాకు జన్మనిచ్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కియారా సోమవారం (డిసెంబర్ 8) ముంబైలో తొలిసారిగా బహిరంగంగా కనిపించింది. ఆమెను చూడగానే అభిమానుల్లో, మీడియా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఆమెను చాలా ఫిట్‌గా ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

షూటింగ్‌లో తళుక్కున మెరిసిన కియారా

తల్లయిన తర్వాత తొలిసారి బయట కనిపించిన కియారా.. ఆమె అందం మరింత పెరిగిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్
తల్లయిన తర్వాత తొలిసారి బయట కనిపించిన కియారా.. ఆమె అందం మరింత పెరిగిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్

సోమవారం (డిసెంబర్ 8)నాడు ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ కోసం కియారా అద్వానీ ముంబైలోని సెట్స్‌కు వచ్చింది. ఆమె చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. లూజ్ పౌడర్-బ్లూ షర్ట్, డెనిమ్ షార్ట్స్ లో కనిపించిన కియారా.. ఎప్పటిలాగే ఎవర్‌గ్రీన్ స్మైల్ తో అందరినీ పలకరించింది.

ఆమెను చూడగానే మీడియా వాళ్లు చుట్టుముట్టారు. ఒక ఫోటోగ్రాఫర్ స్పందిస్తూ.. "మేడమ్.. పాప సారాయా ఎలా ఉంది?" అని అడగగా.. కియారా ముఖం వెలిగిపోయింది. చిరునవ్వుతోనే పాప చాలా బాగుందని సైగ చేశారు. ఆ ఆప్యాయమైన పలకరింపు అభిమానుల మనసు గెలుచుకుంది.

ఇలా ఎలా సాధ్యమంటున్న ఫ్యాన్స్

డెలివరీ తర్వాత కియారా తొలిసారి కనిపించడంతో సోషల్ మీడియాలో కామెంట్ల వరద పారుతోంది. ముఖ్యంగా ఆమె ఫిట్‌నెస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "ప్రసవం జరిగిన కొన్ని నెలలకే ఆమె ఇలా ఉండటం నమ్మశక్యంగా లేదు. ఆమె ముఖంలో మాతృత్వపు కళ స్పష్టంగా కనిపిస్తోంది" అని ఒకరు కామెంట్ చేశారు.

మరొకరు ఆమెను "న్యాచురల్ గ్లామ్ క్వీన్" అని పొగడ్తలతో ముంచెత్తారు. "ఇది అసాధ్యం.. డెలివరీ తర్వాత ఇంత త్వరగా ఆమె తన ఒరిజినల్ ఫిగర్ కు ఎలా వచ్చారు? చాలా అందంగా ఉన్నారు" అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కియారా, సిద్ధార్థ్ రాకుమారి

సిద్ధార్థ్, కియారా జంటకు ఈ ఏడాది జులై 15న పాప జన్మించింది. "మా హృదయాలు నిండిపోయాయి. మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది" అంటూ అప్పట్లో వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫిబ్రవరిలో ప్రెగ్నెన్సీ ప్రకటించినప్పటి నుంచే అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఈమధ్యే కియారా 'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి నటించిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe