...
...
Next Story

బికినీ సీన్ చూశాక ఆ విషయం గుర్తొచ్చింది.. తల్లి అయ్యాక నా శరీరంపై గౌరవం పెరిగింది: కియారా ఎమోషనల్

వార్ 2 సినిమాలో తన బికినీ సీన్ పై తల్లయ్యాక తొలిసారి స్పందించింది కియారా అద్వానీ. ఇప్పుడు తన శరీరంపై గౌరవం మరింత పెరిగిందని, తాను ఇక ఏ సైజులో ఉన్నా ఫర్వాలేదని ఆమె అనడం విశేషం.

Published on: Dec 24, 2025, 07:37:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తల్లి అయ్యాక తన శరీరాన్ని, అందాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందని అంటోంది. 'వార్ 2' (War 2) సినిమాలో ఆమె బికినీలో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భధారణ తర్వాత తన శరీరం మారిన తీరు, మాతృత్వం నేర్పిన పాఠాల గురించి కియారా 'వోగ్' ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

"నేను ఒక ప్రాణాన్ని సృష్టించాను.."

బికినీ సీన్ చూశాక ఆ విషయం గుర్తొచ్చింది.. తల్లి అయ్యాక నా శరీరంపై గౌరవం పెరిగింది: కియారా ఎమోషనల్
బికినీ సీన్ చూశాక ఆ విషయం గుర్తొచ్చింది.. తల్లి అయ్యాక నా శరీరంపై గౌరవం పెరిగింది: కియారా ఎమోషనల్

స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ఏడాది జులై 15న తల్లిదండ్రులయ్యారు. వీరికి 'సరాయా' (Saraayah) అనే పాప పుట్టింది. పాప పుట్టిన నెలకే అంటే ఆగస్టు 14న కియారా నటించిన భారీ బడ్జెట్ మూవీ 'వార్ 2' విడుదలైంది. ఇందులో కియారా బికినీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కియారా స్పందించింది.

'వార్ 2'లోని 'ఆవన్ జావన్' పాటలో బికినీ షాట్ కోసం కియారా చాలా కష్టపడిందట. ఎంతో క్రమశిక్షణతో బాడీని ఫిట్‌గా మార్చుకుంది. కానీ సినిమా విడుదలయ్యే సమయానికి ఆమె డెలివరీ అవ్వడంతో శరీరం పూర్తిగా మారిపోయింది.

"ఆ బికినీ షాట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ డెలివరీ అయ్యాక నా శరీరం చాలా డిఫరెంట్ గా అనిపించింది. మొదట 'నేను మళ్ళీ ఆ షేప్‌లోకి రాగలను' అనుకున్నాను. కానీ వెంటనే నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ బెస్ట్ బాడీ కలిగి ఉండటం ముఖ్యం కాదు. 'వావ్.. నువ్వు ఒక మనిషిని సృష్టించావు' అని నా శరీరాన్ని చూసి గర్వపడ్డాను. ఇప్పుడు నేను ఏ సైజులో ఉన్నా, ఎలా ఉన్నా.. నా శరీరాన్ని నేను గౌరవిస్తాను. మాతృత్వం నాకు ఈ విషయాన్ని నేర్పింది" అని కియారా ఎమోషనల్ అయింది.

'షేర్షా' (2021) సినిమా సమయంలో సిద్ధార్థ్, కియారా ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’, హృతిక్ రోషన్‌తో 'వార్ 2' చిత్రాల్లో మెరిసింది. త్వరలో యశ్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) సినిమాలో కనిపించనుంది. ఇక ఈ ఏడాది 'పరమ్ సుందరి'లో నటించిన సిద్ధార్థ్.. త్వరలో 'వన్‌' అనే చిత్రంతో రానున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe