Kiran Abbavaram: ఆ రీల్స్ చూస్తే భయం వేస్తోంది.. శ్మశానంలో ఏంటీ.. వాళ్లు లేచొస్తే ప్రాబ్లం కదా: కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫుల్ జోష్ లో ఉన్నాడు. అతని లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం రూ.50 కోట్ల కలెక్షన్లను టచ్ చేయడంతో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈవెంట్లో కిరణ్ అబ్బవరం కామెంట్లు వైరల్ గా మారాయి.
Kiran Abbavaram: టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో ఫుల్ సందడి నెలకొంది. అక్కినేని అఖిల్ మూవీ లెనిన్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరగా.. తాజాగా కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ ఏమో రూ.50 కోట్లను అందుకుంది. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో అదరగొడుతోంది.

కిరణ్ అబ్బవరం కామెంట్లు
చెన్నై లవ్ స్టోరీ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా సినిమా టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించింది. ఇవాళ (ఆగస్టు 1) జరిగిన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అయిన హీరో.. మధ్యలో కామెడీ కూడా చేశాడు. అతని కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
శ్మశానంలో రీల్స్ ఏంటీ?
కిరణ్ అబ్బవరం తన సినిమాకు వస్తున్న ఆదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అయితే కొన్ని రీల్స్ చూస్తుంటే భయం వేస్తోంది. శ్మశానానికి వెళ్లి చేస్తున్నారు. జాగ్రత్తమ్మా. వాళ్లు లేచొస్తే మళ్లీ ప్రాబ్లం అవుతుంది. అక్కడికి వెళ్లిపోయి రీల్స్ చేస్తున్నారు. వాళ్ల బాధంతా చెప్పుకుంటున్నారు’’ అని కిరణ్ అబ్బవరం నవ్వేవాడు. వెనుకాలే ఉన్న హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా నవ్వేశారు.
ఆ సీన్
చెన్నై లవ్ స్టోరీ సినిమాలో శ్మశానంలో ఓ సీన్ ఉంటుంది. హీరోను హీరోయిన్ ఎంతో ప్రేమిస్తుంది. కానీ పెళ్లి చేసుకునే టైమ్ కు ముందు హీరో యాక్సిడెంట్లో చనిపోతాడు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన హీరోయిన్ ఫుల్ గా మందు తాగుతుంది. శ్మశానంలోని హీరో సమాధి వద్దకు వెళ్లి.. ‘‘నాకు నువ్వు కావాలి లే’’ అని అరుస్తూ ఏడుస్తుంది. ఇప్పుడు ఈ సీన్ కు రీల్స్ చేస్తున్నారని తాజాగా కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.
చెన్నై లవ్ స్టోరీ హిట్
కిరణ్ అబ్బవరం వరుస హిట్లతో జోరుమీదున్నాడు. ‘క’ మూవీతో కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత ‘కే ర్యాంప్’తో దూకుడు కొనసాగించాడు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.
చెన్నై లవ్ స్టోరీ ఓ డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఆత్మ కాన్సెప్ట్ బాగా వర్కౌంట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక క్లైమాక్స్ అయితే కన్నీళ్లు తెప్పించేలా ఉందని ఆడియన్స్ అంటున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


