Chennai Love Story Twitter Review: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. 'బేబీ'లాంటి కల్ట్ హిట్ అందించిన ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. థియేటర్ల నుంచి వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విటర్ (X) రెస్పాన్స్ ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన రాబట్టుకుంటోంది.
చెన్నై లవ్ స్టోరీ కథేంటంటే?

చెన్నై లవ్ స్టోరీ మూవీ కథ విషయానికి వస్తే.. నివి (శ్రీ గౌరీ ప్రియా) తనను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు అజయ్ (త్రిగుణ్) పెళ్లి రోజే హ్యాండ్ ఇవ్వడంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురవుతుంది. ఆ బాధను తట్టుకోలేక చెన్నైకి షిఫ్ట్ అయి మద్యానికి బానిసగా మారుతుంది.
ఆ క్రమంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి చెన్నై బీచ్‌లో ఉన్నప్పుడు స్టీవెన్ శంకర్ అలియాస్ దేవుడు (కిరణ్ అబ్బవరం) పరిచయం అవుతాడు. సినిమా డైరెక్టర్ కావాలనే కసిగా తిరిగే స్టీవెన్.. నివి జీవితంలోకి అడుగుపెట్టి ఆమెను ఎలా మార్చాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.
నటన నెక్ట్స్ లెవెల్
సీనియర్ రైటర్ రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా శ్రీ గౌరీ ప్రియా తన సహజసిద్ధమైన నటనతో ఎమోషనల్ సీన్లలో ఒదిగిపోయిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. బ్రేకప్ బాధను, ఆ తర్వాత మానసిక వేదనను ఆమె ఎక్స్‌ప్రెస్ చేసిన తీరు సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
మరోవైపు కిరణ్ అబ్బవరం తన క్యారెక్టర్లో చాలా మెచ్యూర్డ్‌గా కనిపించినట్లు ఆడియెన్స్ ట్విటర్ లో చెబుతున్నారు. అమాయకత్వం, కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ డ్రామాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు. కిరణ్, శ్రీ గౌరీ ప్రియల మధ్య ఉండే ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మణిశర్మ మ్యాజిక్ కూడా ప్లస్
{{/usCountry}}మరోవైపు కిరణ్ అబ్బవరం తన క్యారెక్టర్లో చాలా మెచ్యూర్డ్‌గా కనిపించినట్లు ఆడియెన్స్ ట్విటర్ లో చెబుతున్నారు. అమాయకత్వం, కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ డ్రామాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు. కిరణ్, శ్రీ గౌరీ ప్రియల మధ్య ఉండే ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మణిశర్మ మ్యాజిక్ కూడా ప్లస్
{{/usCountry}}మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌గా నిలిచాయి. కథలోని ఎమోషన్‌ను తన పవర్‌ఫుల్ మ్యూజిక్ తో మణిశర్మ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్లలో రీ-రికార్డింగ్ థియేటర్లలో సీట్‌ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ చెన్నై నగరాన్ని, బీచ్ లొకేషన్స్‌ని చాలా కలర్‌ఫుల్‌గా విజువలైజ్ చేసింది. డైరెక్టర్ రవి నంబూరి లవ్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్ రాసుకోవడంలో తన ప్రతిభను చాటుకున్నాడు.
ప్లస్‌లు, మైనస్‌లు ఏంటంటే?
ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల పరిచయం, క్యూట్ రొమాంటిక్ మోమెంట్స్, కిరణ్ అబ్బవరం కామెడీ మార్క్ సీన్స్‌తో చాలా ఫాస్ట్‌గా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లోకి వచ్చాక కథనం కొంచెం స్లో అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హీరోయిన్ కన్ఫ్యూజన్ సీన్స్, కొన్ని డ్రామా సీన్లను ఎక్కువగా సాగదీయడం వల్ల రన్ టైమ్ పెరిగినట్లు అనిపించిందని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. అయితే ప్రీ-క్లైమాక్స్, లాస్ట్ 20 మినిట్స్ ఎమోషనల్ సీన్స్ మళ్లీ సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాయని ఆడియన్స్ చెబుతున్నారు. రొటీన్ మాస్ ఎలివేషన్స్ కాకుండా క్యారెక్టర్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి 'చెన్నై లవ్ స్టోరీ' ఒక మంచి ఛాయిస్.