...
...
Next Story

Song: ఒకే పాటలో 8 మంది లేడి సింగర్స్- పెద్ద వివాదం, నిషేధం- స్టూడియో నుంచి పారిపోయిన సంగీత దర్శకుడు- అసలు కథ ఏంటంటే?

Kishore Kumar Song With 8 Female Singers Story: సంగీత ప్రపంచంలో లెజెండరీ సింగర్, సంగీత దర్శకుడు కిశోర్ కుమార్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఒకే పాటలో ఏకంగా 8 మంది మహిళా గాయనులతో కలిసి పాడి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. కానీ, ఆ పాట నిషేధం కావడం వెనుకున్న ఆసక్తికరమైన స్టోరీ ఇదీ.

Published on: Jun 21, 2026, 10:00:23 IST
Advertisement

Kishore Kumar Song With 8 Female Singers Vidhata Story: గాన గంధర్వుడు, స్టార్ సంగీత దర్శకుడు కిశోర్ కుమార్ పాడారంటే ఆ పాటలో ఒక మ్యాజిక్ ఉంటుంది. హిందీతో పాటు తెలుగు, ఇతర భారతీయ భాషల్లో వేలాది అద్భుతమైన పాటలు పాడి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.

8 మంది లేడి సింగర్స్‌తో

ఒకే పాటలో 8 మంది లేడి సింగర్స్- పెద్ద వివాదం, నిషేధం- స్టూడియో నుంచి పారిపోయిన సంగీత దర్శకుడు- అసలు కథ ఏంటంటే?
ఒకే పాటలో 8 మంది లేడి సింగర్స్- పెద్ద వివాదం, నిషేధం- స్టూడియో నుంచి పారిపోయిన సంగీత దర్శకుడు- అసలు కథ ఏంటంటే?

ఆయన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని, ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సింగర్ కూడా బ్రేక్ చేయని ఒక విచిత్రమైన రికార్డ్ కిశోర్ కుమార్ పేరిట ఉంది. ఒకే ఒక్క పాట కోసం ఆయన ఏకంగా 8 మంది మహిళా సింగర్స్‌తో కలిసి మైక్ పంచుకున్నారు. అదే సమయంలో ఆ పాట ఆయన కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పద గీతంగా నిలవడం గమనార్హం.

మ్యూజిక్‌కు ప్రత్యేకత

సాధారణంగా ఒక పాటలో ఇద్దరు లేదా ముగ్గురు సింగర్స్ కలిసి పాడటం చూస్తుంటాం. కానీ, దర్శకుడు సుభాష్ ఘాయ్ చిత్రాల్లోని మ్యూజిక్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. 1982లో సంజయ్ దత్ హీరోగా, దిగ్గజ నటులు దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'విధాత' కోసం ఈ అద్భుత ప్రయోగం చేశారు.

ఈ సినిమాకు ప్రముఖ సంగీత ద్వయం కల్యాణ్ జీ - ఆనంద్ జీ మ్యూజిక్ అందించారు. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండగా.. అందులో ‘సాత్ సహేలియాన్ ఖడీ ఖడీ, ఫరియాద్ సునాయే ఘడీ ఘడీ’ అనే పాటను డిజైన్ చేశారు.

స్టూడియో నుంచి పారిపోవాలని చూసిన కిశోర్ కుమార్!

ఒకేసారి అంతమంది లేడీ సింగర్స్‌ను చూసి కంగారుపడిన కిశోర్ కుమార్.. "నేను ఈ పాట పాడలేను, ఇక్కడ ఇరుక్కుపోయాను" అంటూ స్టూడియో నుంచి వెనక్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. మ్యూజిక్ డైరెక్టర్లు ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదు. చివరకు ఆ సినిమాలో నటిస్తున్న సీనియర్ నటుడు షమ్మీ కపూర్ స్వయంగా రంగంలోకి దిగి, కిశోర్ కుమార్‌ను బ్రతిమలాడి ఒప్పించడంతోనే ఈ క్లాసిక్ సాంగ్ రికార్డింగ్ పూర్తయింది.

రేడియో, దూరదర్శన్‌లో నిషేధం.. అయినా బాక్సాఫీస్ షేక్!

ప్రముఖ రచయిత ఆనంద్ బక్షీ రాసిన ఈ పాట రికార్డింగ్ ముగిసిన తర్వాత షమ్మీ కపూర్, పద్మిని కొల్హాపురేలపై దీనిని అత్యంత ఘనంగా చిత్రీకరించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ పాటలోని కొన్ని లైన్లు కాస్త శృంగారభరితంగా, డబుల్ మీనింగ్‌తో అశ్లీలంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దాంతో అప్పట్లో ప్రభుత్వ అధికారిక మీడియా ఛానళ్లు అయిన ఆల్ ఇండియా రేడియో (AIR), దూరదర్శన్ లు ఈ పాటను ప్రసారం చేయకుండా నిషేధించాయి.

ఆ కాలంలో టీవీ, రేడియోల్లో నిషేధం పడితే సినిమా కలెక్షన్లు దెబ్బతింటాయని భావించేవారు. కానీ, విచిత్రంగా ఈ వివాదం 'విధాత' సినిమాకు భారీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. థియేటర్లలో ఈ పాటను, ఆ నృత్యాలను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.

1982లో అత్యధిక వసూళ్లు సాధించి

ఫలితంగా 1982లో అత్యధిక వసూళ్లు సాధించిన అతిపెద్ద హిట్ చిత్రాల్లో ఒకటిగా 'విధాత' నిలిచింది. కాలక్రమేణా ఈ పాటలోని వివాదాలు పక్కకు పోయి, కిశోర్ కుమార్ కెరీర్‌లోనే ఒక అరుదైన మైలురాయిగా, ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన గీతంగా నిలిచిపోయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks