...
...
Next Story

Athiya Shetty KL Rahul: 152 పరుగులతో కేఎల్ రాహుల్ సంచలనం- తిట్టినోళ్ల నోరు మూతపడేలా- భర్తపై అతియా శెట్టి పోస్ట్!

Athiya Shetty Reacts To KL Rahul Innings IPL DC Vs PBKS: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 152 పరుగులతో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో తొలి భారతీయ బ్యాటర్‌గా ఆయన రికార్డుల్లోకెక్కారు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను చూసి ఆయన భార్య అతియా శెట్టి మురిసిపోయారు.

Published on: Apr 25, 2026 10:08 PM IST
Advertisement

Athiya Shetty Reacts To KL Rahul Innings IPL DC Vs PBKS: కేఎల్ రాహుల్ బ్యాట్ ఝుళిపిస్తే రికార్డులు తిరగరాయాల్సిందే అని మరోసారి నిరూపితమైంది. పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు జరిగిన పోరులో రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు రాహుల్. కేవలం బౌండరీలతోనే కాకుండా మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ 152 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

152 పరుగులతో కేఎల్ రాహుల్ సంచలనం- తిట్టినోళ్ల నోరు మూతపడేలా- భర్తపై అతియా శెట్టి పోస్ట్!
152 పరుగులతో కేఎల్ రాహుల్ సంచలనం- తిట్టినోళ్ల నోరు మూతపడేలా- భర్తపై అతియా శెట్టి పోస్ట్!

ఇప్పటివరకు ఏ భారతీయ ఆటగాడు కూడా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మైలురాయిని చేరుకోలేదు. రాహుల్ ఈ ఘనత సాధించడంతో స్టేడియం మార్మోగిపోయింది. గతంలో ఉన్న అత్యధిక స్కోర్ల రికార్డులన్నీ ఈ ఇన్నింగ్స్‌తో కనుమరుగయ్యాయి.

అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్

టీవీలో మ్యాచ్ చూస్తూ భర్త ఇన్నింగ్స్‌ను ఎంజాయ్ చేసిన హీరోయిన్ అతియా శెట్టి, తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్నారు. రాహుల్ సెంచరీ పూర్తి చేసిన సమయంలో టీవీ స్క్రీన్ ఫోటో తీసి 'ఉఫ్' అంటూ తన ఎమోషన్‌ను వ్యక్తం చేశారు.

ఇక ఇన్నింగ్స్ ముగిశాక, రాహుల్ స్కోరును చూసి 'Just Insane' (నమ్మశక్యం కాని ఇన్నింగ్స్) అంటూ ప్రశంసల జల్లు కురిపించారు అతియా శెట్టి. మైదానంలో రాహుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఫోటోలను కూడా అతియా శెట్టి షేర్ చేస్తూ తన మద్దతును చాటుకున్నారు.

ప్రేమ నుంచి పెళ్లి వరకు.. ఇప్పుడు కొత్త బాధ్యతల్లో

కేఎల్ రాహుల్, అతియా శెట్టిల ప్రయాణం 2019లో ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా మొదలైంది. వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారి, 2023లో పెళ్లి పీటల వరకు వెళ్లింది. సీనియర్ హీరో సునీల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.

గత కొంతకాలంగా రాహుల్ బ్యాటింగ్ శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్ట్రైక్ రేట్ విషయంలోనూ ఆయనపై ఒత్తిడి పెరిగింది. అయితే ఈ 152 పరుగుల ఇన్నింగ్స్‌తో తిట్టినోళ్ల (విమర్శకులు) నోళ్లు మూయించారు. ఒకవైపు తండ్రిగా కొత్త బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు మైదానంలో తన పట్టు సడలలేదని ఆయన నిరూపించారు. రాహుల్ సాధించిన ఈ రికార్డు భవిష్యత్ సీజన్లలో ఇతర భారతీయ స్టార్లకు ఒక పెద్ద సవాల్‌గా నిలవనుంది.

అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఐపీఎల్‌లో 150 పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు?

కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన 152* పరుగులతో ఈ రికార్డు సృష్టించారు.

2. కేఎల్ రాహుల్, అతియా శెట్టిల కుమార్తె పేరు ఏమిటి?

వీరి కుమార్తె పేరు ఇవారా విపుల రాహుల్. 'ఇవారా' అంటే దేవుడు ఇచ్చిన వరం అని అర్థం.

3. కేఎల్ రాహుల్ వయస్సు ఎంత?

కేఎల్ రాహుల్ ఇటీవలే తన 34వ పుట్టినరోజును జరుపుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe