Kotha Cinema: హీరోగా మారిన కిరాణం షాపు నడిపుకునే వ్యక్తి- 'కొత్త సినిమా' ఈవెంట్‌‌లో హీరో సురేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్

Kotha Cinema Movie Hero Suresh Comments: ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా, ప్రతిభే పెట్టుబడిగా ఒక సాధారణ కిరాణం షాప్ నడుపుకునే వ్యక్తి టాలీవుడ్‌లో హీరోగా మారారు. 'కొత్త సినిమా' అనే మూవీ ప్రెస్ మీట్‌లో హీరో సురేష్ చేసిన కామెంట్స్ అందరి మనసును తాకుతున్నాయి.

Published on: Jul 13, 2026, 20:35:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kotha Cinema Movie Hero Suresh Comments: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ, పట్టుదల ఉంటే చాలు.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎంతోమంది నిరూపించారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు సరికొత్త నటుడు సురేష్.

హీరోగా మారిన కిరాణం షాపు నడిపుకునే వ్యక్తి- 'కొత్త సినిమా' ఈవెంట్‌‌లో హీరో సురేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్
హీరోగా మారిన కిరాణం షాపు నడిపుకునే వ్యక్తి- 'కొత్త సినిమా' ఈవెంట్‌‌లో హీరో సురేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్

కొత్త హీరోగా సురేష్ ఎంట్రీ

సురేష్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'కొత్త సినిమా'. అజహర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో హీరో సురేష్ తన నిజ జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే బలమైన కోరికతో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతుంటారు. 'కొత్త సినిమా' హీరో సురేష్ ప్రయాణం కూడా అలాంటి స్ఫూర్తిదాయకమైనదే. నిన్నటి వరకు ఒక సాధారణ కిరాణా దుకాణం నడుపుకుంటూ సొంతంగా జీవనం సాగించిన ఆయన, ఈ రోజు వెండితెరపై హీరోగా మెరిసేందుకు సిద్ధమయ్యారు. చిన్నప్పటి నుంచి వెండితెరపై కనిపించాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఆయన పడిన శ్రమ ఈ రోజు ఈ వేదికపైకి తెచ్చింది.

కిరాణం షాపు నడుపుకునేటోన్నీ

"అందరికి నమస్కారం అన్నా.. నా పేరు సురేష్. రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని మార్కండేయ కమాన్ దగ్గర ఉంటాను. హైదరాబాద్‌కి ఒక మూడు, నాలుగు సార్లు వచ్చి ఉంటా. సినిమా డబ్బింగ్ అప్పుడు వచ్చినా మళ్లీ.. ఈవెంట్ ఉందని నిన్న వచ్చా" అని సురేష్ చెప్పారు.

"నాది ఒక చిన్న కిరాణం షాపు అన్నా.. కిరాణా షాపు అంటే మీ అందరికి తెలుసు కదా అన్నా.. కందిపప్పు, చక్కెర, బెల్లం, కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు ఇవి అమ్ముతా అన్నా. అయితే నాకు ఎలా ఉండే అంటే.. ఒకతను చక్కెర కొనుక్కోపోయిండు. నాలుగు రోజుల తర్వాత వచ్చి చీమలు పట్టాయి, ఏం చక్కెర ఇచ్చావయ్యా అంటే.. ఆయన డబ్బులు ఆయనకు వాపసు ఇచ్చేశా" అని హీరో సురేష్ తెలిపారు.

యాక్టింగ్ అంటే పిచ్చి

"అలా ఉండేటోన్నీ అన్నా. అందరితో మంచిగా. హే సురేష్ మంచోడు.. దిల్‌దారు.. హే సూపరయ్యా అంటే.. అందరి నమస్కే పెట్టుకుంటూ పలకరించుకుంటూ పోయేటోన్నీ. యాక్టింగ్ అన్నా, సినిమా అన్నా.. నాకు పిచ్చి. నాలాగే.. కొన్ని లక్షల మందికి యాక్టింగ్, సినిమా అంటే అందరికి ఇష్టముంటదిగా" అని సురేష్ అన్నారు.

"నేను ఏదో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, కిరాణం షాపు నడుపుకునేటోన్నీ.. సినిమా అంటే పిచ్చి ఉంటే ఏం చేస్తావ్ అన్నా.. ఏం చేయలేవు. హైదరాబాదుకు పోవాలి. పెద్ద పెద్దోళ్లను కలవాలి. ఎంతో కష్టపడితే కానీ అవకాశాలు రావు" అని సురేష్ చెప్పుకొచ్చారు.

పార్ట్ 2 లోడింగ్

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేష్ కామెంట్స్ అందరి మనసును తాకుతున్నాయి. దీనికి పార్ట్ 2 లోడింగ్ అంటూ వీడియోను ముగించారు. ఈ వీడియో కొత్త సినిమా మూవీ డైరెక్టర్ అజహర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ కొత్త సినిమా ప్రెస్ మీట్‌కు బుల్లితెర సీరియల్, టాలీవుడ్ హీరో ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ కూడా హాజరయ్యారు.

దర్శకుడు అజహర్ వన్‌మ్యాన్ షో

కాగా, ఈ చిత్రానికి అజహర్ వన్‌మ్యాన్ షోగా నిలిచారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే స్వయంగా చూసుకోవడం విశేషం. మహమ్మద్ వసీం అక్రమ్, సాగి సుధీర్ రావు, యాదండ్ల సతీష్ యాదవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. జాని బాషా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా (DOP) విజువల్స్ అందిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More