Rashin Rahman: ఇవాళ పాపులర్ నటుడు రషీన్ రెహమాన్ పుట్టినరోజు- కొత్త సినిమా పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
Actor Rashin Rahman Birthday: సౌత్ ఇండియాలోనే మోస్ట్ స్టైలిష్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రషీన్ రెహమాన్ పుట్టినరోజు (మే 23) సందర్భంగా పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. తమ కొత్త చిత్రం 'ప్రొడక్షన్ నంబర్ 1' నుంచి విడుదల చేసిన రెహమాన్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Actor Rashin Rahman Birthday: టాలీవుడ్‌లో తనదైన నటనతో, క్లాస్ లుక్స్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు రషీన్ రెహమాన్ పుట్టినరోజు వేడుకలు ఇవాళ (మే 23) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 'ప్రొడక్షన్ నంబర్ 1' చిత్రం నుంచి రెహమాన్ క్యారెక్టర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

పవర్‌ఫుల్ పాత్రల్లో
1987లో వచ్చిన 'రాగలీల' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రెహమాన్.. ఆ తర్వాత విలక్షణమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 'భారత్ బంద్', 'ప్రియతమా' వంటి చిత్రాల్లో హీరోగా, పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించిన ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సహాయ నటుడిగా, విలన్‌గా అదరగొడుతున్నారు.
ప్రభాస్ 'బిల్లా', బాలకృష్ణ 'సింహ' వంటి భారీ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు.
పోస్టర్‌లో మిస్టరీ.. రెహమాన్ మార్క్ ఎలిగెన్స్
తాజాగా విడుదల చేసిన బర్త్‌డే పోస్టర్ సినిమాపై తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో రెహమాన్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా, డిగ్నిఫైడ్‌గా కనిపిస్తోంది. ఆయన పాత్ర చుట్టూ ఒక రకమైన మిస్టరీని నడిపించనున్నట్లు పోస్టర్ డిజైన్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమాలో రెహమాన్ గతంలో ఎన్నడూ చూడని ఒక కొత్త తరహా గెటప్‌లో కనిపించబోతున్నారని చిత్ర బృందం పేర్కొంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, రాయల్ లుక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
సస్పెన్స్‌లో మిగతా వివరాలు.. త్వరలోనే ప్రకటన
పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సరికొత్త చిత్రానికి సంబంధించిన కథాంశం, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచారు. ఒక వినూత్నమైన కథతో, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. రెహమాన్ పుట్టినరోజున విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


