Kriti Sanon Obsession: ఆ హారర్ థ్రిల్లర్ మూవీ వణుకు పుట్టించే సీన్ రీక్రియేట్ చేసిన కృతి.. అచ్చూ అలాగే.. రేపే ఓటీటీలోకి
Kriti Sanon Obsession: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, వరుణ్ ధావన్ వాయిస్ ఓవర్ అందించడంతోపాటు.. అత్యంత భయంకరమైన రెస్టారెంట్ సీన్‌ను రీక్రియేట్ చేయడం విశేషం.
Kriti Sanon Obsession: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతి స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా వందల మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన చిత్రం 'అబ్సెషన్' (Obsession). కర్రీ బార్కర్ దర్శకత్వంలో ఇండే నవరెట్టే, మైఖేల్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ డిజిటల్ వీక్షకులను భయపెట్టేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెడుతోంది. ఈ అన్‌కట్ ఒరిజినల్ సైకాలాజికల్ హారర్ చిత్రం అక్టోబర్ 30 సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్ లోని ది పీకాక్ హబ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

వైరల్‌గా మారిన కృతి సనన్, వరుణ్ ధావన్ యాక్టింగ్ వీడియో
ఈ మోస్ట్ అవేటెడ్ హారర్ థ్రిల్లర్ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ప్రముఖ డిజిటల్ స్పాట్లైట్ హబ్ జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. విశేషమేమిటంటే, ఈ సినిమాలో కథానాయిక నిక్కీ (Nikki) పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, కథానాయకుడు బేర్ (Bear) పాత్రకు వరుణ్ ధావన్ వాయిస్ ఓవర్ అందించారు. 'స్త్రీ 2' ఫేమ్ దర్శకుడు అమర్ కౌశిక్ ఈ డబ్బింగ్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించారు.
సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు ఒక రోజు ముందు మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. అందులో ఒరిజినల్ సినిమాలో అత్యంత ఉత్కంఠభరితంగా, భయంకరంగా సాగే ఒక రెస్టారెంట్ సీన్‌ను కృతి సనన్, వరుణ్ ధావన్‌లు డైరెక్టర్ అమర్ కౌశిక్‌తో కలిసి హిందీలో రీక్రియేట్ చేశారు.
ఈ సీన్లో కృతి సనన్ చూపించిన ఎక్స్ప్రెషన్లు, వాయిస్ మోడ్యులేషన్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. క్షణాల వ్యవధిలోనే కృతి ముఖంలో మారే భయానక భావాలు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. "కృతి సనన్ వాయిస్ మోడ్యులేషన్ అద్భుతం.. నిక్కీ పాత్రకు ఆమె కంటే బెటర్ ఆప్షన్ మరొకరు ఉండరు" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
'అబ్సెషన్' కథేంటి? ఒక చిన్న కోరిక.. భయంకరమైన నరకం
ఈ సినిమా కథాంశం ఒక మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే సాధారణ యువకుడు బేర్ బైలీ (మైఖేల్ జాన్సన్) చుట్టూ తిరుగుతుంది. బేర్ తనతో పాటు పనిచేసే సహోద్యోగి నిక్కీ (ఇండే నవరెట్టే) ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ తన మనసులోని మాటను చెప్పడానికి భయపడుతుంటాడు.
ఆ క్రమంలో ఒక క్రిస్టల్ షాప్‌లో 'వన్ విష్ విల్లో' (One Wish Willow) అనే వింత బొమ్మను కొనుగోలు చేస్తాడు. ఆ బొమ్మను ఉపయోగించిన వారికి తీవ్రమైన ప్రమాదాలు ఎదురవుతాయని విక్రేత హెచ్చరించినప్పటికీ, బేర్ దానిని తీసుకొని "నిక్కీ నన్ను ప్రపంచంలో అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించాలి" అని కోరుకుంటాడు.
పిచ్చి ప్రేమతో ఇక్కట్లు
మరుసటి రోజు నుంచే ఆ విష్ నెరవేరినట్లు కనిపిస్తుంది. నిక్కీ అతనిపై అమితమైన ప్రేమ చూపిస్తుంది. కానీ రానురాను ఆ ప్రేమ ఒక భయంకరమైన సైకలాజికల్ అబ్సెషన్ (పిచ్చి/ఉన్మాదం)గా మారుతుంది.
నిక్కీ ప్రవర్తన అత్యంత హింసాత్మకంగా, ప్రమాదకరంగా మారిపోతుంది. డ్రీమ్ లవ్ స్టోరీ కాస్త ఒక భయంకరమైన పీడకలగా మారడంతో, ఆ కోరికను ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియక బేర్ పడే తపనతో సినిమా ఊహించని మలుపులు తిరుగుతుంది.
7.5 లక్షల డాలర్ల బడ్జెట్.. 522 మిలియన్ డాలర్ల వసూళ్లు
కేవలం 7,50,000 డాలర్ల (సుమారు రూ. 7.5 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన 'అబ్సెషన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 522 మిలియన్ డాలర్లు (రూ. 4,300 కోట్లకు పైగా) వసూలు చేసి హాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక లాభాలు సాధించిన మోస్ట్ ప్రాఫిటబుల్ చిత్రాలలో ఒకటిగా రికార్డు సృష్టించింది.
అమెరికా డొమెస్టిక్ మార్కెట్లో 263 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లో 253 మిలియన్ డాలర్లు రాబట్టిన ఈ విజువల్ హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు అక్టోబర్ 30 సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar)లోని 'ది పీకాక్ హబ్' వేదికగా ఇంగ్లీష్ అన్‌కట్ వెర్షన్‌తో పాటు హిందీ డబ్బింగ్లో స్ట్రీమింగ్ కానుంది. సైకలాజికల్ హారర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఇది ఒక మైండ్ బ్లాకింగ్ వీకెండ్ ట్రీట్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


