ఓటీటీలోకి కుబేర.. కోట్లల్లో ఓటీటీ రైట్స్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
జూన్ 20న థియేటర్లలో విడుదలైన కుబేర మూవీ ఓటీటీలోకి వచ్చేయనుంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించిన కుబేర ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న కుబేర ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి సరికొత్త సినిమాలు వెనువెంటనే వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కుబేర ఓటీటీలోకి వచ్చేయనుందని టాక్ జోరందుకుంది.

కుబేర ఓటీటీ రిలీజ్‌పై
అయితే, కుబేర మూవీ థియేటర్లలో జూన్ 20న విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుబేర ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కుబేర సినిమాకు పాపులర్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అంతేకాకుండా తనదైన మార్క్ స్టైల్‌తో కుబేర సినిమాను తెరకెక్కించారు.
పాజిటివ్ రెస్పాన్స్
కుబేర మూవీలో కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకరైన జిమ్ సర్బ్ కీ రోల్‌లో యాక్ట్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేర సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. అన్ని చోట్ల ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది కుబేర.
ఎక్స్‌ట్రార్డినరీ అంటూ రివ్యూలు
శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్, నాగార్జున, రష్మికల యాక్టింగ్ ఎక్స్‌ట్రార్డినరీ అంటూ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా బిచ్చగాడిగా ధనుష్ నెక్ట్స్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చాడని తెగ చెబుతున్నారు. ధనుష్‌కు మరో నేషనల్ అవార్డ్ పక్కా అని అంటున్నారు. అలాగే, నాగార్జునను సరికొత్తగా చూశామని చెబుతున్నారు.
కుబేర ఓటీటీ రైట్స్
ఇలా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్న కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కుబేర ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. కుబేర ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం.
5 భాషల్లో స్ట్రీమింగ్
సుమారు రూ. 47 కోట్లు ఖర్చు పెట్టి కుబేర ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుక్కున్నట్లు డీల్ కుదుర్చుకుందని టాక్. అయితే, ఏకంగా ఐదు భాషల్లో కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి అంత ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో కుబేర ఓటీటీ రిలీజ్ కానుంది.
బాక్సాఫీస్ కలెక్షన్స్
అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. సినిమా టాక్, బాక్సాఫీస్ కలెక్షన్స్ వంటి అంశాల ప్రాతిపదికన కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



