మా అమ్మానాన్నే నన్ను తాకరు.. నువ్వెవడు నన్ను కొట్టడానికి.. ఐదేళ్ల కింద తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నా: లక్ష్మీ మంచు

ప్రముఖ నటి లక్ష్మీ మంచు తన కొత్త సినిమా 'బూకీ' (Bookie) ప్రమోషన్స్‌లో గృహ హింస, రిలేషన్షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాప్సీ నటించిన 'తప్పడ్' సినిమా తనకు ఎందుకు నచ్చిందో వివరిస్తూ, సోషల్ మీడియా ప్రేమల గురించి, మగవారి ప్రవర్తన గురించి ఘాటుగా స్పందించింది.

Published on: Feb 18, 2026, 14:06:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లక్ష్మీ మంచు త్వరలో తమిళ మూవీ 'పూకీ' (Pookie)లో సైక్రియాట్రిస్ట్‌గా కనిపించనుంది. ఈ సినిమా తెలుగులో 'బూకీ' పేరుతో విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సినిమాలో గృహ హింస ప్రస్తావన ఉండటంతో, మీడియా వాళ్లు రిలేషన్షిప్స్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చింది. అంతేకాదు సినిమాల్లో నష్టాలు, అప్పుల గురించి కూడా స్పందించింది.

మా అమ్మానాన్నే నన్ను తాకరు.. నువ్వెవడు నన్ను కొట్టడానికి.. ఐదేళ్ల కింద తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నా: లక్ష్మీ మంచు
మా అమ్మానాన్నే నన్ను తాకరు.. నువ్వెవడు నన్ను కొట్టడానికి.. ఐదేళ్ల కింద తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నా: లక్ష్మీ మంచు

'తప్పడ్' సినిమాకు నేను పెద్ద ఫ్యాన్..

గృహ హింస గురించి లక్ష్మీ మంచు మాట్లాడుతూ.. తాప్సీ పన్ను నటించిన 2020 నాటి సినిమా 'తప్పడ్' (Thappad)ను ఉదాహరణగా తీసుకుంది.

"కొంతమంది స్త్రీలు.. భర్త ఎంత కొట్టినా, ఎంత హింసించినా భరిస్తూ అతనితోనే ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. కానీ నేను మాత్రం 'తప్పడ్' సినిమా చూసి అద్భుతం అనుకునే రకం. అవును ఒకరిని కొట్టే హక్కు ఎవరికి ఉంది? మా తల్లిదండ్రులే నన్ను కొట్టలేదు.. అలాంటప్పుడు నన్ను కొట్టడానికి నువ్వెవరు? ఆత్మగౌరవం ముఖ్యం. అందుకే నేను 'తప్పడ్' సినిమాకు మద్దతు ఇస్తాను" అని లక్ష్మీ మంచు స్పష్టం చేసింది. ఒక పెళ్లిలో గౌరవం తగ్గినప్పుడే పతనం మొదలవుతుందని ఆమె చెప్పింది.

సోషల్ మీడియా ప్రేమలు.. కట్ కాపీ పేస్ట్

ఇప్పటి తరంలో ప్రేమ, సంబంధాలు ఎలా మారిపోయాయో కూడా ఆమె వివరించింది. "సోషల్ మీడియా మన ఆలోచనలను చెడగొట్టింది. ఒకప్పుడు అబ్బాయిలు, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఒకే మెసేజ్‌ను పది మంది అమ్మాయిలకు 'కట్-కాపీ-పేస్ట్' చేసి పంపుతున్నారు. వాళ్లు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలదే" అని తెలిపింది. ఆమె చెప్పిన తెలివైన సమాధానాలకు ఈ సినిమాను సమర్పిస్తున్న నటుడు విజయ్ ఆంటోనీ ఫిదా అయ్యి, ఆమెను సరదాగా "మాతాజీ" అని పిలిచాడు.

ఐదేళ్ల కిందటి అప్పులు తీరుస్తున్నా..

ఇక సినిమాల్లో తన నష్టాలు, అప్పుల గురించి కూడా లక్ష్మీ మంచు స్పందించింది. సినిమాల వల్ల డబ్బులు పోగొట్టుకున్నారా అని ఓ రిపోర్టర్ ఆమెను ప్రశ్నించారు. దీనికి లక్ష్మీ స్పందిస్తూ.. “100 పర్సెంట్ అండి.. ఐదేళ్ల కిందట సినిమా అప్పులు ఇప్పటికీ కడుతూనే ఉన్నాను. వాటిని కవర్ చేసుకోవడానికే కొత్త సినిమాలు చేస్తున్నాను” అని ఆమె అనడం విశేషం.

లక్ష్మీ మంచు వ్యక్తిగత జీవితం..

లక్ష్మీ మంచు 2006లో ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకుంది. వీరికి 2014లో సరోగసీ ద్వారా విద్య నిర్వాణ అనే పాప పుట్టింది. ప్రస్తుతం ఆండీ అమెరికాలో ఉండగా, లక్ష్మీ మంచు పాపతో కలిసి ముంబైలో సెటిల్ అయింది.

గతంలో నిఖిల్ విజయేంద్ర సింహ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "మగవాళ్లను పూజించేలా నన్ను పెంచారు. కానీ ఇప్పుడు నేను మారాను. నా జీవితంలో మగ తోడు లేదని నేను అస్సలు బాధపడటం లేదు" అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More