...
...
Next Story

Lakshmi Manchu Daughter: మంచు ఫ్యామిలీలో ఘనంగా సంబరాలు.. అంగరంగ వైభవంగా లక్ష్మీ కూతురు 'ఆపిల్' హాఫ్ శారీ ఫంక్షన్

Lakshmi Manchu Daughter: లక్ష్మీ మంచు కూతురు విద్య నిర్వాణ హాఫ్ శారీ వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని లక్ష్మీయే తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Published on: Mar 18, 2026 03:32 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ మంచు ఇంట సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తన గారాల పట్టి విద్యా నిర్వాణ హాఫ్ శారీ (ఓణీల) వేడుకను లక్ష్మీ ఎంతో గ్రాండ్‌గా నిర్వహించింది. 11 ఏళ్ల ఆపిల్ పెద్దమనిషి అయిన సందర్భంగా చేసిన ఈ బ్లెస్సింగ్ సెర్మనీకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను లక్ష్మీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో హ్యాపీగా షేర్ చేసింది.

మెరిసిపోయిన తల్లీకూతుళ్లు

Lakshmi Manchu Daughter: మంచు ఫ్యామిలీలో ఘనంగా సంబరాలు.. అంగరంగ వైభవంగా లక్ష్మీ కూతురు 'ఆపిల్' హాఫ్ శారీ ఫంక్షన్
Lakshmi Manchu Daughter: మంచు ఫ్యామిలీలో ఘనంగా సంబరాలు.. అంగరంగ వైభవంగా లక్ష్మీ కూతురు 'ఆపిల్' హాఫ్ శారీ ఫంక్షన్

హైదరాబాద్‌లోని రిధిరా రిట్రీట్స్‌ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ డెకరేషన్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. తాజా పూలు, అరిటాకులతో అచ్చమైన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్‌లో మండపాన్ని ముస్తాబు చేశారు.

ఆపిల్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న బెస్ట్ మూమెంట్స్‌తో లక్ష్మీ మంచు ఒక ప్రత్యేకమైన 'మెమొరీ వాల్' కూడా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్‌లో లక్ష్మీ పర్పుల్ కలర్ ఫ్లోరల్ చీరలో కనిపించగా.. విద్యా నిర్వాణ గోల్డ్, పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న హాఫ్ శారీలో ఎంతో క్యూట్‌గా మెరిసిపోయింది.

ఫోటోలను షేర్ చేస్తూ.. "కూతురి బ్లెస్సింగ్ సెర్మనీ. ఈ అందమైన వేడుకను ఇంత అద్భుతంగా మార్చిన డ్రీమ్ టీమ్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని లక్ష్మీ మంచు ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

సన్నజాజుల సువాసన, కర్ణాటక సంగీతం..

ప్రముఖ డిజైనర్ అస్మిత మార్వా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫంక్షన్ వీడియోలను పోస్ట్ చేశారు. "నా ప్రాణ స్నేహితురాలు లక్ష్మీ కూతురి హాఫ్ శారీ ఫంక్షన్ ఇది. అక్కడ వాతావరణం అంతా సన్నజాజుల సువాసనలతో, కర్ణాటక సంగీతపు (Carnatic music) రాగాలతో ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంది. దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి ఆపిల్" అని అస్మిత విష్ చేశారు.

మోహన్ బాబు ఏకైక కూతురైన లక్ష్మి.. 2006లో ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకుంది. 2014 జూన్‌లో సరోగసీ ద్వారా విద్యా నిర్వాణ జన్మించింది. చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్న లక్ష్మీ.. ఈమధ్యే తన కూతురితో కలిసి ముంబైకి షిఫ్ట్ అయింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్‌గా 2025లో వచ్చిన 'దక్ష: ది డెడ్లీ కాన్‌స్పిరసీ' తెలుగు సినిమాలో లక్ష్మీ నటించింది. అలాగే ఈ ఏడాది రిలీజ్ అయిన 'పూకీ' అనే తమిళ సినిమాలో కూడా ఒక మంచి పాత్ర పోషించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe