Pookie OTT Release Date: ఓటీటీలోకి లక్ష్మీ మంచు జెన్-జీ రొమాంటిక్ డ్రామా.. ఐఎండీబీలో 7.3 రేటింగ్

వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన తమిళ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'పూకీ' (Pookie) డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. అజయ్ ధిషన్, ఆర్కే ధనుష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో బూకీగా రిలీజైంది. మంచు లక్ష్మీ ఇందులో ఓ కీలకపాత్రలో నటించింది.

Published on: Mar 5, 2026, 14:06:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జెన్ జీ ఆలోచనలు, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ మూవీ 'పూకీ' (తెలుగులో బూకీ) ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమాను డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.3 రేటింగ్ నమోదైంది.

Pookie OTT Release Date: ఓటీటీలోకి లక్ష్మీ మంచు జెన్-జీ రొమాంటిక్ డ్రామా.. ఐఎండీబీలో 7.3 రేటింగ్
Pookie OTT Release Date: ఓటీటీలోకి లక్ష్మీ మంచు జెన్-జీ రొమాంటిక్ డ్రామా.. ఐఎండీబీలో 7.3 రేటింగ్

బూకీ ఓటీటీ అప్‌డేట్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ఈ బూకీ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 13 నుండి 'బూకీ' స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. లక్ష్మీ మంచు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో 'బూకీ' (Bookie) అనే పేరుతో థియేటర్లలో విడుదల చేశారు. తమిళంతోపాటు ఇక్కడ కూడా ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయింది. తమిళ వెర్షన్‌తో పాటే తెలుగు వెర్షన్ కూడా అదే రోజున ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

విజయ్ ఆంటోనీ నిర్మాణంలో..

వైవిధ్యమైన కథలను ఎంచుకునే హీరో విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కేవలం నిర్మాతగానే కాకుండా ఈ సినిమాకు అతడే స్వయంగా సంగీతాన్ని కూడా అందించాడు. మంచు లక్ష్మి, పాండియరాజన్, ఇందుమతి మణికందన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

నేటి తరం (Gen Z) ప్రేమకథలు ఎంత వేగంగా మొదలవుతాయో, అంతే వేగంగా చిన్న చిన్న కారణాలతో ముగిసిపోతుంటాయి. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఆధారం చేసుకుని, ఆధునిక సంబంధాల వెనుక ఉన్న భావోద్వేగ సంఘర్షణను ఆవిష్కరించిన సినిమా ఇది. ఈ మూవీ సోషల్ మీడియా ప్రభావం మన వ్యక్తిగత జీవితాలపై ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది.

ఈ సినిమా కథ కైలాష్ (అజయ్ దిషన్), ఆళి (ఆర్కే ధనుష) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఆరేళ్ల సుదీర్ఘ కాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి జీవితం ఒక చిన్న సంఘటనతో తలకిందులవుతుంది. కారు సైడ్ మిర్రర్ విరిగిపోయిందనే చిన్న కారణంతో రోడ్డు మీద వీరిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరుగుతుంది. ఆవేశంలో ఒకరినొకరు దూషించుకుంటూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు.

బ్రేకప్ తర్వాత కైలాష్ తన బాధను మర్చిపోవడానికి ఫిట్‌నెస్, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ మీద దృష్టి పెడతాడు. మరోవైపు ఆళి మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత, ఇతర మార్గాలను వెతుక్కుంటూ అయోమయంలో పడిపోతుంది. విడిపోయిన ఈ జంట మళ్ళీ కలుస్తారా? లేక తమ దారి తాము చూసుకుంటారా? అనేదే మిగిలిన కథ.

థియేటర్లలో ఈ చిన్న సినిమాను మిస్ అయిన యూత్ ఆడియన్స్‌కు, ఓటీటీలో ఇది ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More