Lakshmi Manchu: నేను మంచు ఫ్యామిలీలో పుట్టకపోయి ఉంటే నా కెరీర్ ఎక్కడో ఉండేది: లక్ష్మీ మంచు షాకింగ్ కామెంట్స్

Lakshmi Manchu: 'మంచు' అనే ఇంటిపేరు తన కెరీర్‌కు రక్షణగా నిలవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంకిగా కూడా మారిందని నటి లక్ష్మీ మంచు వ్యాఖ్యానించారు. తన కుటుంబంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉండేదని, ఏది సాధించాలన్నా తాను ఎంతో పోరాడాల్సి వచ్చిందని ఓపెన్‌గా చెప్పుకొచ్చారు.

Published on: Aug 31, 2026, 16:53:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lakshmi Manchu: టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా, నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా లక్ష్మీ మంచు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా అభిమానులతో జరిగిన 'హానెస్ట్ టౌన్ హాల్' (Honest Town Hall) ఇంటరాక్షన్ సెషన్‌లో తన కుటుంబం, కెరీర్ ఎదుగుదలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Lakshmi Manchu: నేను మంచు ఫ్యామిలీలో పుట్టకపోయి ఉంటే నా కెరీర్ ఎక్కడో ఉండేది: లక్ష్మీ మంచు షాకింగ్ కామెంట్స్
Lakshmi Manchu: నేను మంచు ఫ్యామిలీలో పుట్టకపోయి ఉంటే నా కెరీర్ ఎక్కడో ఉండేది: లక్ష్మీ మంచు షాకింగ్ కామెంట్స్

మంచు కుటుంబంలో జన్మించకపోతే తన కెరీర్ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. 'మంచు' అనే సర్ నేమ్‌ను టాలీవుడ్‌లో మొదట ఉపయోగించింది తానేనని, ఆ తర్వాతే సోదరులు విష్ణు, మనోజ్ తమ పేర్ల చివర 'మంచు' అని చేర్చుకున్నారని సంచలన నిజం వెల్లడించారు.

‘మంచు కాకపోయి ఉంటే కెరీర్ మరోలా ఉండేది’

ఫ్యాన్ ఇంటరాక్షన్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు లక్ష్మీ మంచు ఎంతో నిజాయతీగా సమాధానమిచ్చారు. "ఒకవేళ నేను మంచు ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కాకపోయి ఉంటే, నా కెరీర్ ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎంతో ఉన్నతంగా ఉండేదని నేను భావిస్తున్నాను. మా ఇంట్లో ఉన్న ముగ్గురు మగవాళ్లు (మోహన్ బాబు, విష్ణు, మనోజ్) నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించారు. నేను వారిని ఎంతో ప్రేమిస్తాను. కానీ అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మాది పక్కా పితృస్వామ్య (Patriarchal) కుటుంబం. అక్కడ నేనేదైనా సాధించాలి లేదా నాకు ఏదైనా కావాలి అని గట్టిగా చెప్పాలంటే ఎంతో పోరాడాల్సి వచ్చేది" అని లక్ష్మీ వివరించారు.

'మంచు' అనే సర్ నేమ్ వాడింది మొదట నేనే..

ఇంటిపేరును ఇండస్ట్రీలో వాడటంపై కూడా లక్ష్మీ మంచు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. "మీరు జాగ్రత్తగా గమనిస్తే.. మా కుటుంబం నుంచి పరిశ్రమలోకి వచ్చిన అందరికంటే తక్కువ సమయమే నేను ఇక్కడ ఉన్నాను. కానీ అందరికంటే ముందు 'మంచు' అనే సర్ నేమ్‌ను వాడింది నేనే. అంతకుముందు నా సోదరులను ఎం. విష్ణువర్ధన్ బాబు, ఎం. మనోజ్ కుమార్ అని పిలిచేవారు. నాన్నను కూడా మోహన్ బాబు అని మాత్రమే పిలిచేవారు కానీ 'మంచు మోహన్ బాబు' అని కాదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 'లక్ష్మీ మంచు' అని పేరు పెట్టుకున్న తర్వాతే, వారు కూడా 'మనుజ్ మంచు', 'విష్ణు మంచు'గా పేర్లు మార్చుకున్నారు" అని స్పష్టం చేశారు.

కుటుంబ వాతావరణం, ముంబైకి మకాం

లక్ష్మీ మంచు తన కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి పురుషులను గౌరవించడం, పూజించడం మాత్రమే తనకు నేర్పించారని, ఆ భావజాలం నుంచి బయటకు రావడానికి తనకు సమయం పట్టిందని చెప్పారు.

ప్రస్తుతం ఆమె తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి ముంబైలో నివాసముంటున్నారు. భర్త ఆండీ శ్రీనివాసన్ అమెరికాలో ఉంటుండగా, లక్ష్మీ ముంబై వేదికగా హిందీ, తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది 'పూకీ', 'లేచింది మహిళా లోకం' వంటి చిత్రాలతో అలరించిన ఆమె, ఆహా (Aha) ప్లాట్‌ఫామ్‌లో 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్' షోకి జడ్జిగా వ్యవహరించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More