...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి మంచు లక్ష్మీ తెలుగు కామెడీ మూవీ.. భార్యాభర్తల గొడవల్లో పక్కింటోళ్లు దూరితే..

OTT Telugu: ఓటీటీలోకి లక్ష్మీ మంచు నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ లేచింది మహిళా లోకం స్ట్రీమింగ్ కు వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుండి. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Apr 17, 2026, 18:41:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Telugu: మంచు లక్ష్మీ, శ్రద్ధా దాస్, అనన్య నాగళ్లలాంటి వాళ్లు నటించిన మూవీ లేచింది మహిళా లోకం. భార్యాభర్తల గొడవల్లోకి పక్కింటోళ్లు దూరితే చిన్న సమస్యలే విడాకులు, హత్యల వరకూ ఎలా వెళ్తాయో ఫన్నీ ఎలిమెంట్స్ జోడించి తీసిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

లేచింది మహిళా లోకం ఓటీటీ రిలీజ్ డేట్

OTT Telugu: ఓటీటీలోకి మంచు లక్ష్మీ తెలుగు కామెడీ మూవీ.. భార్యాభర్తల గొడవల్లో పక్కింటోళ్లు దూరితే..
OTT Telugu: ఓటీటీలోకి మంచు లక్ష్మీ తెలుగు కామెడీ మూవీ.. భార్యాభర్తల గొడవల్లో పక్కింటోళ్లు దూరితే..

లేచింది మహిళా లోకం మూవీ వచ్చే బుధవారం అంటే ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ ఓటీటీ ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “బ్యాడ్ మ్యారేజీ.. చెత్త ప్లాన్.. కానీ బెస్ట్ కామెడీ.. ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో ఇందరు ఆడవాళ్ల మధ్య సింగర్ శ్రీరామ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

లేచింది మహిళా లోకం మూవీ విశేషాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా మహిళా ప్రధాన చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను ప్రశ్నించే పాత్రల్లో నటించడానికి మన కథానాయికలు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, హరితేజ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'లేచింది మహిళా లోకం'. టైటిల్‌లోనే ఎంతో వైబ్రేషన్ ఉన్న ఈ సినిమా, నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని వారు అధిగమించిన తీరును ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది.

ఈ సినిమాకు ప్రాణం పోసింది ఇందులోని ముగ్గురు నటీమణులు. ఇందులో మంచు లక్ష్మి ఓ లాయర్ గా నటించింది. అటు అనన్య నాగళ్ల ఓ సామాన్య యువతిగా, అమాయకత్వం నుంచి ధైర్యవంతురాలిగా మారే పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన చాలా సహజంగా ఉంది.

ఇక హరితేజ విసయానికి వస్తే.. తనదైన టైమింగ్‌తో నవ్విస్తూనే, భావోద్వేగపూరితమైన సన్నివేశాల్లో ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.మార్చి 26న థియేటర్లలో రిలీజైనా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ కామెడీ డ్రామాను చూడొచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'లేచింది మహిళా లోకం' సినిమాలో మంచు లక్ష్మి పాత్ర ఏమిటి?

మంచు లక్ష్మి ఇందులో ఒక ధైర్యవంతురాలైన మహిళా లాయర్ పాత్రలో కనిపించింది. అన్యాయంపై పోరాడే మహిళలకు మార్గదర్శిగా ఆమె పాత్రను రూపొందించారు.

లేచింది మహిళా లోకం సినిమాలో ప్రధాన సందేశం ఏమిటి?

మహిళలు తమపై జరిగే అన్యాయాలను సహించకుండా, ఐకమత్యంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే బలమైన సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది.

లేచింది మహిళా లోకం ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది?

లేచింది మహిళా లోకం మూవీ ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe