హమ్మయ్య.. మొత్తానికి ఓటీటీలోకి వస్తున్న రజనీకాంత్ డిజాస్టర్ మూవీ.. 16 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే టీవీ ప్రీమియర్ కూడా కాగా.. 16 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ బక్రీద్ కు మూవీ రానుంది.
రజనీకాంత్ డిజాస్టర్ మూవీ లాల్ సలామ్ గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతోపాటు ఐఎండీబీలోనూ దారుణమైన రేటింగ్ సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్ లోనే టీవీ ప్రీమియర్ అయిన ఈ సినిమా.. వచ్చే వారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్
రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన మూవీ లాల్ సలామ్. ఈ సినిమా దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడీ మూవీని బక్రీద్ సందర్భంగా జూన్ 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (మే 30) వెల్లడించింది.
బక్రీద్ కు ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ ఓ చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేసింది. అందులో రజనీకాంత్ ను చూడొచ్చు. థియేటర్లలో రిలీజైన సుమారు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
లాల్ సలామ్ మూవీ గురించి..
రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాకు తొలి రోజు నుంచే దారుణమైన టాక్, కలెక్షన్లు వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా రజనీ అతిథి పాత్రపై భారీ ఆశలు పెట్టుకున్నా అదీ వర్కౌట్ కాలేదు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఐశ్వర్య ఈ మూవీ ద్వారా తీవ్రంగా నిరాశపరిచింది.
లాల్ సలామ్ మూవీలో మొయిద్దీన్ భాయ్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజనీకాంత్ నటించాడు. ఓ ఊళ్లో జరిగిన మత హింసకు క్రికెట్ మ్యాచ్ ద్వారా అతడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అతడే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. సినిమా ప్రమోషన్లను కూడా బాగానే చేశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. విష్ణు విశాల్, విక్రాంత్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. ఇవేవీ కూడా మూవీని కాపాడలేకపోయాయి.
ముఖ్యంగా తెలుగులో అయితే మరీ దారుణం. తొలి వారంలో లాల్ సలామ్ తెలుగు కలెక్షన్లు కేవలం రూ.90 లక్షలుగా మాత్రమే ఉన్నాయి. ఇక తమిళం, తెలుగు కలిపినా ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రూ.13 కోట్ల షేర్ కలెక్షన్లు మాత్రమే రావడంతో సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొంది.. రూ.35 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సినిమాకు ఈ కలెక్షన్లు చాలా దారుణమనే చెప్పాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



