Largest Screen: 108 అడుగుల భారీ స్క్రీన్.. ఏషియాలోనే అతిపెద్దది.. వారణాసి మూవీతో లాంచ్.. తిరుపతికి స్పెషల్ అట్రాక్షన్!

Largest Screen: ఆంధ్రాలో ఏషియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన థియేటర్ రాబోతోంది. అది కూడా వారణాసి మూవీతో లాంచ్ కాబోతుండటం విశేషం. ఈ స్క్రీన్ తిరుపతిలోనే రానుందని వార్తలు వస్తుండగా.. వైజాగ్ కూడా కావచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Published on: Aug 20, 2026, 20:02:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Largest Screen: ఆధ్యాత్మిక నగరం తిరుపతి త్వరలోనే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డుకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. ఆసియాలోనే అతిపెద్ద 108 అడుగుల భారీ స్క్రీన్‌తో కూడిన స్టాండ్‌అలోన్ సింగిల్ స్క్రీన్ థియేటర్ తిరుపతిలో ప్రారంభానికి వేగంగా సిద్ధమవుతోంది.

Largest Screen: 108 అడుగుల భారీ స్క్రీన్.. ఏషియాలోనే అతిపెద్దది.. వారణాసి మూవీతో లాంచ్.. తిరుపతికి స్పెషల్ అట్రాక్షన్!
Largest Screen: 108 అడుగుల భారీ స్క్రీన్.. ఏషియాలోనే అతిపెద్దది.. వారణాసి మూవీతో లాంచ్.. తిరుపతికి స్పెషల్ అట్రాక్షన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి' (Varanasi) తో ఈ థియేటర్ గ్రాండ్‌గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ థియేటర్ తిరుపతి కాదు.. వైజాగ్ లో వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

నో సెలబ్రిటీ స్టేక్.. కొత్త ఇన్వెస్టర్ల ధైర్యమైన అడుగు

ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వెనుక ఎలాంటి సినిమా సెలబ్రిటీల భాగస్వామ్యం లేకపోవడం విశేషం. ఎగ్జిబిషన్ ఫీల్డ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక యంగ్ ఇన్వెస్టర్స్ టీమ్ ఈ ల్యాండ్‌మార్క్ థియేటర్‌ను నిర్మిస్తోంది.

షాపింగ్ మాల్స్‌లోని మల్టీప్లెక్స్‌ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో, కేవలం సినిమా ఎక్స్‌పీరియన్స్ కోసమే ఒక ప్యూర్ సింగిల్ స్క్రీన్‌ను ఈ స్థాయిలో నిర్మించడం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వీ ఎపిక్ సుళ్లూరుపేట రికార్డు బ్రేక్!

గతంలో నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో వి సెల్యులాయిడ్స్ సంస్థ 'వి ఎపిక్' (V EPIQ) పేరుతో 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు ఉన్న భారీ స్క్రీన్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఆ మల్టీప్లెక్స్ స్క్రీన్ అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్‌గా రికార్డు సృష్టించింది.

ఇప్పుడు తిరుపతి (లేదా వైజాగ్)లో రాబోతున్న ఈ 108 అడుగుల స్క్రీన్ వి ఎపిక్ రికార్డును సైతం తిరగరాస్తూ ఆసియాలోనే లార్జెస్ట్ స్క్రీన్‌గా నిలవనుంది. ఇది మల్టీప్లెక్స్ కాకుండా ఒకే ఒక స్టాండ్‌అలోన్ సింగిల్ స్క్రీన్ కావడం దీని ప్రత్యేకత.

మహేష్ బాబు 'వారణాసి'తో గ్రాండ్ బిగినింగ్

ఈ గ్రాండ్ థియేటర్‌ను మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాతోనే గ్రాండ్‌గా ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ వైడ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ విజువల్ వండర్‌ను 108 అడుగుల బిగ్ స్క్రీన్‌పై చూడటం ఆడియెన్స్‌కి ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోంది.

వరల్డ్ క్లాస్ సౌండింగ్, లేటెస్ట్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఈ థియేటర్‌ను డిజైన్ చేస్తుండటంతో రాయలసీమ సినీ ప్రియులకు ఇది అల్టిమేట్ డెస్టినేషన్‌గా మారనుంది.

సింగిల్ స్క్రీన్ల మనుగడకి ఊపిరి.. టికెట్ రేట్లపై ఉత్కంఠ

ఓటీటీల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్న తరుణంలో, ఇలాంటి భారీ పెట్టుబడులు ఎగ్జిబిషన్ రంగానికి సరికొత్త జోష్ ఇస్తున్నాయి. తిరుపతి లాంటి ప్రధాన నగరంలో ఈ లెవల్ థియేటర్ రావడం వల్ల బిజినెస్ పరంగా కూడా టాలీవుడ్‌కి భారీ అడ్వాంటేజ్ కానుంది.

అయితే ఈ స్పెషల్ కేటగిరీ థియేటర్‌కి సంబంధించిన టికెట్ ధరల పరిమితిపై ప్రభుత్వం, ఎగ్జిబిటర్లు సుమూహ్యమైన చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన రేట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్‌పై సినిమా చూసేందుకు తిరుపతి ప్రజలతో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More