తెలుగులో బూతులు కూడా వచ్చన్న లావణ్య.. కొడుకు డైపర్లు మారుస్తున్నానన్న వరుణ్.. అన్నను ఆట పట్టించిన నిహారిక

లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన ఓ ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జీ తెలుగు ఆట షో రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ ముగ్గురి సందడి చూడొచ్చు. ఈ షోకి లావణ్య స్పెషల్ గెస్టుగా వచ్చింది.

Feb 18, 2026, 20:01:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీ తెలుగులో ప్రసారమవుతున్న కొత్త డ్యాన్స్ షో 'ఆట' (Aata) ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో గెస్ట్‌గా వచ్చిన లావణ్య త్రిపాఠి, జడ్జిగా ఉన్న నిహారికల మధ్య జరిగిన సరదా సంభాషణ, వరుణ్ తేజ్‌తో ఫోన్ కాల్ ఎపిసోడ్ ప్రేక్షకులను నవ్విస్తోంది. చెల్లి ఫోన్ కట్ చేసి భార్య ఫోన్ ఎత్తిన వరుణ్ తేజ్ చెప్పిన కారణం హైలైట్‌గా నిలిచింది.

తెలుగులో బూతులు కూడా వచ్చన్న లావణ్య.. కొడుకు డైపర్లు మారుస్తున్నానన్న వరుణ్.. అన్నను ఆట పట్టించిన నిహారిక
తెలుగులో బూతులు కూడా వచ్చన్న లావణ్య.. కొడుకు డైపర్లు మారుస్తున్నానన్న వరుణ్.. అన్నను ఆట పట్టించిన నిహారిక

ఆడపడుచు కట్నం.. బూతులు వచ్చన్న లావణ్య

జీ తెలుగు ఛానెల్‌లో ప్రారంభమైన కొత్త డ్యాన్స్ షో 'ఆట'. ఈ షోకి యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల జడ్జిగా ఉంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి గెస్ట్‌గా వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో జరిగిన ఒక ఫన్ గేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

షో ప్రారంభంలో నిహారిక.. లావణ్యను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికింది. యాంకర్ సుధీర్ నిహారికను ఉద్దేశించి.. "వదిన దగ్గర ఆడపడుచు కట్నం తీసుకున్నావా?" అని అడుగుతాడు. దీనికి నిహారిక స్పందిస్తూ.. ఇది అడిగినందుకు నిన్ను కూడా జైల్లో వేస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఆమెకు తెలుగు రాదు కదా అని సుధీర్ అంటే.. నాకు బూతులు కూడా వచ్చు అని లావణ్య అనడం విశేషం.

చెల్లి vs భార్య.. వరుణ్ ఎవరి ఫోన్ ఎత్తాడంటే?

సుధీర్ ఒక ఆసక్తికరమైన గేమ్ ప్లాన్ చేశాడు. నిహారిక, లావణ్య ఇద్దరూ ఒకేసారి వరుణ్ తేజ్‌ (Varun Tej)కు ఫోన్ చేయాలని, అతను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేస్తాడో చూద్దామని ఛాలెంజ్ విసిరాడు. వరుణ్ తేజ్ తన చెల్లి నిహారిక ఫోన్ కట్ చేసి, వెంటనే భార్య లావణ్య ఫోన్ లిఫ్ట్ చేశాడు.

నిహారిక అలిగి "నా ఫోన్ ఎందుకు కట్ చేశావ్?" అని అడగగా.. "నేను బాబు (వాయువ్) డైపర్ మారుస్తున్నాను" అని వరుణ్ సమాధానం ఇచ్చాడు. "మరి లావణ్య కాల్ అంత ఫాస్ట్ గా ఎలా ఎత్తారు?" అని సుధీర్ అడగగా.. "నీకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలు లేరు.. నీకు ఆ కష్టాలు తెలియవులే" అంటూ వరుణ్ సెటైర్ వేశాడు. దీంతో సెట్ లో నవ్వులు పూశాయి. ఈ ఎపిసోడ్‌లో రంభ, అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు.

వరుణ్ - లావణ్య ఫ్యామిలీ

వరుణ్ తేజ్, లావణ్య 2023 నవంబర్‌లో ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి 2025 సెప్టెంబర్ 9న కుమారుడు 'వాయువ్' (Vaayuv) జన్మించాడు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (శివ రామ్, అన్వీర దేవి) జన్మించిన సందర్భంలో.. మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలను లావణ్య తిప్పికొట్టింది. "అది నా కుటుంబం. నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే నేను ఒప్పుకోను" అని ఆమె స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More