Bharathi Raja: దిగ్గజ దర్శకుడికి ఈ గతి ఏంటీ? అభిమానుల బాధ.. నడవలేని స్థితిలో భారతీరాజా.. అయినా సినిమాపై చావని ప్రేమ

Bharathi Raja: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న భారతీరాజాకు ఇలాంటి గతి ఏంటీ అని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. నడవలేని స్థితిలో ఆయన్ని వీల్ చైర్ లో చూసి ఫీల్ అవుతున్నారు.

Published on: Apr 19, 2026, 15:06:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bharathi Raja: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజంగా ఎదిగిన డైరెక్టర్ భారతీరాజా. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీపై తమదైన ముద్ర వేసిన లెజెండరీ డైరెక్టర్లలో ఆయనొకరు. ఇప్పుడు భారతీరాజా ఆరోగ్యం క్షీణించింది. నడవలేని స్థితిలో వీల్ చెయిర్ లో ఉన్న ఆయన్ని చూసి అభిమానులు బాధపడుతున్నారు.

రాధికా శరత్ కుమార్, భారతీ రాజా (instagram-radikaasarathkumar)
రాధికా శరత్ కుమార్, భారతీ రాజా (instagram-radikaasarathkumar)

భారతీ రాజా హెల్త్

84 ఏళ్ల భారతీరాజా ఆరోగ్యం క్షీణిస్తోంది. వయసు సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వీల్ చెయిర్ లోనే ఉంటున్నారు. నడవలేకపోతున్నారు.

రాధికా శరత్ కుమార్ వీడియో

భారతీరాజాను ఇటీవల సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కలిశారు. తన గురువు అయిన భారతీరాజాతో ఆమె మాట్లాడుతున్న వీడియోను రాధికా తన ఇన్ స్టాలో పోస్టు చేశారు.

‘‘నా గురువు, నా డైరెక్టర్ భారతీరాజా నుంచి ఈ ఆశీర్వాదం అవార్డుల కంటే గొప్పది. ఆయన్ని ఇలా చూడాలనుకోలేదు. కానీ ఆ సందర్భాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. తాయ్ కిళవి సినిమా గురించి మాట్లాడారు. సినిమాపై ప్రేయ ఇంకా ఆయన్ని బతికిస్తోంది’’ అని రాధికా క్యాప్షన్ ఇచ్చారు.

అభిమానుల బాధ

రాధికా శరత్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోలో భారతీ రాజా కండీషన్ చూసి అభిమానులు బాధ పడుతున్నారు. దిగ్గజ దర్శకుడు ఇలా అయిపోయాడేంటీ అని ఆందోళన చెందుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, ఇలాంటి గతి పట్టిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లోనూ రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాయ్ కిళవి సినిమాను భారతీ రాజా చూడటం విశేషం. చిన్న సినిమాగా వచ్చిన తాయ్ కిళవి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.150 కోట్లు రాబట్టింది.

భారతీరాజా ఎవరు?

భారతీరాజా తమిళ సినిమాల్లో ప్రసిద్ధ చిత్ర దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత, స్క్రీన్‌రైటర్, నటుడు కూడా. ఆయన 1977లో '16 వయతినిలే' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'కిళక్కే పోగుమ్ రైలు', 'సిగప్పు రోజాక్కల్', 'అలైగల్ ఒయివతిల్లై', 'కాదల్ ఓవియం', 'ముదల్ మరియాతై' వంటి అనేక చిత్రాలను రూపొందించారు.

ఆయన చిత్రాలకు ఆరు జాతీయ చిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, ఆరు తమిళనాడు రాష్ట్ర చిత్ర అవార్డులు, ఒక నంది అవార్డుతో సహా అనేక పురస్కారాలు లభించాయి.

తెలుగు సినిమాలు

భారతీరాజా తెలుగులోనూ సినిమాలు తీశారు. 1980లో కొత్త జీవితాలు సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. 1981లో సీతాకోక చిలుక సినిమా తీశారు భారతీరాజా. దీనికి జాతీయ అవార్డు అందుకున్నారు. 1988లో సూపర్ స్టార్ కృష్ణ‌ హీరోగా జమదగ్ని మూవీని తెరకెక్కించారు. తెలుగులో ఇదే ఆయనకు చివరి సినిమా. 2004లో భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More