Asha Bhosle Dance: ఇండియన్ సినిమా సంగీత శిఖరం, తన గాత్రంతో ఎన్నో తరాలను ఉర్రూతలూగించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోంస్లే (92) కన్నుమూసిన విషయం తెలుసు కదా. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె తాను ఇచ్చిన చివరి షోలో 91 ఏళ్ల వయసులో తౌబా తౌబా పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
'తౌబా తౌబా' స్టెప్పులతో హోరెత్తించిన చివరి ప్రదర్శన

వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ.. 91 ఏళ్ల వయసులో కూడా ఆశా భోంస్లే ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆమె చివరిసారిగా 2024 డిసెంబర్ 29న దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో ‘ఆశా భోంస్లే & సోనూ నిగమ్ లెగసీ కన్సర్ట్’లో ప్రదర్శన ఇచ్చారు.
ఆ వేదికపై ఆమె పాడిన పాటలకంటే, ఇటీవల సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ‘తౌబా తౌబా’ పాటకు ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. విక్కీ కౌశల్ వైరల్ హుక్ స్టెప్‌ను ఆమె రీక్రియేట్ చేయడంతో ఆ వీడియో అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. "చిన్న గ్రామం నుంచి వచ్చిన నాలాంటి కుర్రాడు రాసిన పాటకు సంగీత దేవత ఆశా జీ డ్యాన్స్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని గౌరవం," అని గాయకుడు కరణ్ ఔజ్లా అప్పట్లో భావోద్వేగానికి లోనయ్యారు.
లతాజీ నీడ నుంచి స్వయంప్రకాశం వరకు..
అగ్రగామి గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రయాణం మొదలుపెట్టిన ఆశా భోంస్లే, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. లతాజీ గొంతులో ఉండే గాంభీర్యం ఒకటైతే, ఆశాజీ గొంతులో ఉండే మాధుర్యం, చమత్కారం, వైవిధ్యం మరొకటి.
క్యాబరే సాంగ్స్ నుంచి గజల్స్ వరకు, శాస్త్రీయ సంగీతం నుంచి వెస్ట్రన్ పాప్ వరకు ఆమె పాడని జానర్ లేదు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె సుమారు 12,000 కంటే ఎక్కువ పాటలకు ప్రాణం పోశారు.
పురస్కారాలు - అపురూప గీతాలు
{{/usCountry}}క్యాబరే సాంగ్స్ నుంచి గజల్స్ వరకు, శాస్త్రీయ సంగీతం నుంచి వెస్ట్రన్ పాప్ వరకు ఆమె పాడని జానర్ లేదు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె సుమారు 12,000 కంటే ఎక్కువ పాటలకు ప్రాణం పోశారు.
పురస్కారాలు - అపురూప గీతాలు
{{/usCountry}}ఆశా భోంస్లే పాటల్లో ‘దమ్ మారో దమ్’, ‘పియా తూ అబ్ తో ఆజా’, ‘ఆవో నా గలే లాగ్ జావో నా’, ‘ఇన్ ఆంఖోన్ కీ మస్తీ’ వంటివి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డును గెలుచుకున్నారు. 'ఉమ్రావ్ జాన్' (దిల్ చీజ్ క్యా హై), 'ఇజాజత్' (మేరా కుచ్ సామాన్) చిత్రాలకు గాను రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది.
శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు
ఆశా భోంస్లే మరణవార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శనార్థం సోమవారం ఉదయం 11 గంటలకు ఆమె నివాసం (కాసా గ్రాండే, లోయర్ పరేల్) వద్ద ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఆశా భోంస్లే ఎప్పుడు, ఎక్కడ మరణించారు?
ఆశా భోంస్లే ఏప్రిల్ 12, 2026 ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.
2. ఆమె చేసిన చివరి ప్రదర్శన ఏది?
2024 డిసెంబర్ 29న దుబాయ్‌లో సోనూ నిగమ్‌తో కలిసి నిర్వహించిన 'లెగసీ కన్సర్ట్' ఆమె చివరి భారీ స్టేజ్ షో. ఇందులో ఆమె 'తౌబా తౌబా' పాటకు స్టెప్పులేసి వార్తల్లో నిలిచారు.
3. ఆశా భోంస్లేకు వచ్చిన ప్రధాన అవార్డులేవి?
ఆమె రెండు జాతీయ అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు భారత అత్యున్నత పురస్కారాలైన పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు.