S Janaki: కన్నీళ్లు పెట్టిస్తున్న జానకమ్మ చివరి వీడియో.. పాటలే ప్రాణంగా.. ఈ లెజండరీ సింగర్ ఆఖరి కోరిక అదే!
S Janaki Last Video: రాగాలతో ఆటలాడి, శ్రుతులతో స్నేహం చేసి సంగీత ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన లెజెండరీ సింగర్ ఎస్.జానకి చివరి వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. పాటలతోనే ఆమె ప్రయాణం చేశారు. అలాగే శనివారం కన్నుమూసిన ఈ దిగ్గజ గాయని ఆఖరి కోరిక ఏంటో ఇక్కడ చూసేయండి.
S Janaki Last Video: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అపురూపమైన, దైవికమైన అధ్యాయం ముగిసింది. కోట్లాది మంది అభిమానులు ‘జానకమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకునే వెటరన్ సింగర్ ఎస్.జానకి శనివారం (జూలై 11) కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన 88వ ఏట తుదిశ్వాస విడిచిన జానకమ్మ చివరి వీడియో వైరల్ గా మారింది.

జానకమ్మ చివరి వీడియో
వేలాది పాటలతో సంగీత ప్రియులను సమ్మోహనపరిచిన సంగీత శిఖరం మన జానకమ్మ. ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. అయితే ఈ సమయంలో జానకి చివరి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పాటలే ప్రాణంగా సాగిన ఆమె.. ఆ వీడియోలోనూ పాటలను వింటూ సంతోషంతో మురిసిపోయారు.
సింగర్ సునీతతో
ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో జానకమ్మ కోసం సింగర్ సునీత పాటలు పాడటం కనిపిస్తోంది. జానకమ్మ ఇంట్లోనే ఓ చిన్నపాటి సంగీత విభావరిలా ఇది సాగింది. జానకమ్మ కాళ్ల దగ్గర కూర్చున్న సునీత పాట పాడింది. ఆ పాటకు తగ్గట్లుగా జానకమ్మ చేతులతోనే తాళం వేసింది. ఇప్పుడీ వీడియో చూస్తు జానకమ్మ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అదే చివరి కోరిక
60 ఏళ్ల పాటు 48 వేలకు పైగా పాటలతో ఇండియన్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగారు జానకమ్మ. ఇప్పుడు 88 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అయితే ఇప్పుడు జానకమ్మ చివరి కోరిక గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండీ గ్రామంలో తన అంత్యక్రియలు చేయాలన్నదే జానకమ్మ ఆఖరి కోరికగా తెలిసింది.
ప్రభుత్వ లాంఛనాలతో
తెలుగు నాట పుట్టి విశ్వవ్యాప్తమైన జానకమ్మ అంత్యక్రియలు కన్నడ గడ్డపై జరుగనున్నాయి. ఆమె ఆఖరి కోరిక మేరకు కర్ణాటక రాష్ట్రంలోని కణియర హుండీలో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజు (జూలై 12) సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అభిమానులు, సెలబ్రిటీల సందర్శనార్థం జానకమ్మ పార్థివ దేహాన్ని మైసూర్ లోని మహారాజా కాలేజీ గ్రౌండ్ లో ఉంచారు. జానకి 20 భాషల్లో పాటలు పాడటం విశేషం. అంతే కాకుండా పిల్లాడిగా, మగాడిగా, అమ్మాయిగా, ముసలావిడగా గొంతు మార్చి పాటలు పాడిన ఘనత జానకమ్మ సొంతం. అందుకే జానకమ్మ అంటే కేవలం ఓ వ్యక్తి మాత్రమే కాదు.. తన పాటలతో సంగీత ప్రపంచాన్ని ఏలిన ఓ మహారాణి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


