LGBT: గే, ట్రాన్స్‌జెండర్స్‌పై వివక్ష- 12 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటం- కోర్ట్ రూమ్ డ్రామాగా ఎల్‌జీబీటీ, దర్శకుడు ఎవరంటే?
LGBT A Legal Battle Movie Press Meet: గే, ట్రాన్స్‌జెండర్స్‌పై చూపించే వివక్ష, వారి వ్యక్తిగత జీవితాల ఆధారంగా తెరకెక్కిన తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్. ఎల్ బి శ్రీరామ్, ఎస్తేర్ నొరోన్హా వంటి ప్రముఖులు నటించిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా వెల్లడించారు.
LGBT A Legal Battle Movie Press Meet: సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా గే, ట్రాన్స్‌జెండర్స్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్“.

సినిమా నటీనటులు
ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తేర్ నొరోన్హా, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్‌తో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్‌గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారని సమాచారం.
“ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్“ సినిమా ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా జూన్ 10న హైదరాబాద్‌లో ఈ ఎల్‌జీబీటీ - ఏ లీగల్ బ్యాటిల్ మూవీ టీమ్ మీడియాతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు.
మా హక్కుల కోసం ఎంతో కాలంగా
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ.. "మా హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాము. కానీ మాకు సరైన వేదిక ఎక్కడా లభించలేదు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉంది" అని అన్నారు.
"మేము నటులము కాము. కానీ, మా జీవితంలో మేము ఎలా ఉంటామో అలాంటి పాత్రలనే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ చిత్రంలో తెరకెక్కించారు. మేము ఈ సినిమాలో మా నిజ జీవిత పాత్రలనే పోషించాం. ఈ సినిమా ద్వారా మేము సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాం" అని ఆశించారు ప్రెసిడెంట్ లైలా.
12 ఏళ్లుగా పోరాటం
గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. "గే కమ్యూనిటీ కోసం దాదాపు 12 ఏళ్లుగా పోరాడుతున్నాను. మన సినిమాల్లో గే క్యారెక్టర్స్‌ను కామెడీ కోసం ఉపయోగించడం చూశాం. కానీ, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కు వచ్చే అనేక చిత్రాల్లో ఎంతో డెప్త్‌గా గే కమ్యూనిటీ సమస్యలను తెరకెక్కించడం నేను గమనించాను" అని పేర్కొన్నారు.
"ఇతర రాష్ట్రాల్లో గే లైఫ్ మీద ఇన్ డెప్త్ మూవీస్ సీరియస్ అప్రోచ్‌తో వచ్చాయి. ఆ సినిమాల వల్ల అక్కడి సమాజం గే కమ్యూనిటీని చూసే విధానం మారిపోయింది. తెలుగులో ఫస్ట్ టైమ్ అలాంటి ప్రయత్నం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన మాతో ట్రావెల్ చేసి మా జీవితాన్ని దగ్గరగా గమనించారు. ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు మీ సపోర్ట్ దక్కాలి. ఈ చిత్రంతో మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాము" అని విష్ణు ఆకాంక్షించారు.
మా ప్రతిభ అందరికీ తెలియాలి
ట్రాన్స్‌జెండర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా ఖాన్ మాట్లాడుతూ.. "మా జీవితాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. బయట ప్రపంచం చూడని మా జీవిత ప్రయాణాన్ని, మా సమస్యలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిగారు చూపించారు" అని వెల్లడించారు.
"మేము ఏంటి అనేది కాకుండా మా ప్రతిభ అందరికీ తెలియాలి. ఇంకా మాకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని చెప్పుకొచ్చారు యాక్టివిస్ట్ సనా ఖాన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


